South Africa League 2024: సౌతాఫ్రికా లీగ్ లో ఫైనల్ కి చేరిన సన్ రైజర్స్ టీమ్…

డర్బన్ సూపర్ జాయింట్స్ టీం 158 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగగా, 19.3 ఓవర్లలో 106 పరుగులు చేసి అలౌట్ అయింది. వియన్ మల్డర్ 38, హెన్రిచ్ 23, డికాక్ 20 పరుగులు చేశారు.

Written By: Gopi, Updated On : February 7, 2024 11:59 am
Follow us on

South Africa League 2024: సౌతాఫ్రికాలో జరుగుతున్న టి20 లీగ్ లో భాగంగా సన్ రైజర్స్ ఈస్టర్ టీమ్ ఫైనల్ కీ చేరుకుంది. ఇక ఈ లీగ్ లో ఎన్ని టీమ్ లు ఉన్నా కూడా ఈ టీమ్ కి ఉన్న ప్రత్యేకత వేరనే చెప్పాలి. ఈసారి డిపెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగిన ఈ టీమ్ వరుసగా మంచి విజయాలను అందుకుంటూ టీం యొక్క సత్తా చాటుతూ వస్తుంది.ఇక అందులో భాగంగానే క్వాలిఫైయర్ -1 మ్యాచ్ లో డర్బన్ సూపర్ జాయింట్స్ పై 51 పరుగులు తేడాతో విజయం సాధించింది.

ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ టీం నిర్ణీత 20 ఓవర్లకి 157 పరుగులు చేసింది. ఈ టీమ్ లో ఉన్న ప్లేయర్లలో మలన్ హాఫ్ సెంచరీ తో 63 పరుగులు చేసి టీమ్ విజయంలో కీలక పాత్ర వహించాడనే చెప్పాలి. ఈయన ఇప్పుడే కాదు ఇంతకుముందు మ్యాచ్ ల్లో కూడా అద్భుతమైన పర్ఫామెన్స్ ఇచ్చి టీం కి మంచి విజయాలను అందిస్తూ వస్తున్నాడు. ఇక మలన్ తో పాటు కెప్టెన్ మార్కరం కూడా 30 పరుగులు చేసి టీమ్ భారీ స్కోర్ చేయడం లో తన వంతు పాత్ర పోషించాడు…

ఇక డర్బన్ సూపర్ జాయింట్స్ టీం 158 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగగా, 19.3 ఓవర్లలో 106 పరుగులు చేసి అలౌట్ అయింది. వియన్ మల్డర్ 38, హెన్రిచ్ 23, డికాక్ 20 పరుగులు చేశారు. ఇక వీళ్లని మినహా ఇస్తే మిగితా ఏ ప్లేయర్ కూడా రెండంకెల పరుగులు చేయలేకపోయారు…

ఇక ఈ మ్యాచ్ గెలిచి ఫైనల్ లోకి అడుగుపెట్టిన సన్ రైజర్స్ టీమ్ శనివారం రోజున ఫైనల్ మ్యాచ్ ఆడడానికి రెడీ అవుతుంది… ఇక సన్ రైజర్స్ తో తలపడే టీమ్ ఏది అనేది తెలియాలంటే క్వాలిఫైయర్ 2 అలాగే ఎలిమినేటర్ మ్యాచులు ముగిస్తే గాని ఒక క్లారిటీ అయితే రాదు…ఇక ఈ మ్యాచ్ లు చూస్తున్న అభిమానులు మాత్రం ఫైనల్ కి ఎవరు వచ్చిన సన్ రైజర్స్ టీమ్ కప్పు గెలుస్తుంది అంటూ వాళ్ల కాన్ఫిడెంట్ ను వ్యక్తం చేస్తున్నారు.