https://oktelugu.com/

Paytm Crisis: పేటీఎంకు మరో నిరాశ.. షాకిచ్చిన కేంద్రం

Paytmబ్యాంకులో వినియోగదారుల కేవైసీ పై సంస్థ అధినేతలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, ఇందులోని వినియోగదారుల డేటాకు భద్రత లేదని కొందరు ఆడిటర్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI)కి ఫిర్యాదు చేశారు.

Written By:
  • Srinivas
  • , Updated On : February 7, 2024 / 12:06 PM IST

    Paytm Crisis

    Follow us on

    Paytm Crisis: ప్రముఖ ఆన్లైన్ యాప్ పేటీఎం గురించి ఇటీవల తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ బ్యాంకులో కొన్ని అవకతవకలు ఉన్నాయని కొందరు ఆడిటర్లు ఆర్బీఐ కు ఫిర్యాదు చేయడంతో ఫిబ్రవరి 29 నుంచి మనీ ట్రాన్సాక్షన్‌ను నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో పేటీఎం మాతృ సంస్థ వన్ ప్లస్ 97 అధినేత విజయ్ శర్మ ఈ సమస్య నుంచి గట్టెక్కేందుకుదుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా ఆయన ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ మాట్లాడుతూ పేటియం విషయంలో జోక్యం చేసుకోమని తేల్చి చెప్పారు. ఈవిషయంలో ఆర్బిఐనే సంప్రదించాలని, అక్కడే సమస్య పరిష్కరించుకోవాలని సూచించారు.

    Paytmబ్యాంకులో వినియోగదారుల కేవైసీ పై సంస్థ అధినేతలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, ఇందులోని వినియోగదారుల డేటాకు భద్రత లేదని కొందరు ఆడిటర్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI)కి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు కు స్పందించిన ఆర్బీఐ ఫిబ్రవరి 29 నుంచి పేటీఎం ఆర్థిక లావాదేవీల పై ఆంక్షలు విధించింది. అప్పటినుంచి మనీ ట్రాన్సాక్షన్, క్రెడిట్ కార్డ్ , ఇతర బిల్లుల చెల్లింపులకు అవకాశం లేకుండా ఆదేశాలు జారీ చేసింది.

    ఈ నేపథ్యంలో సంస్థ సీఈవో విజయ్ శర్మ పేటీఎం కష్టాల నుంచి గట్టెక్కేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇటీవల ఆయన రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ కి చెందిన జియో ఫైనాన్షియల్ సంస్థను సంప్రదించి చర్చలు జరిపారు. దీంతో జియో ఫైనాన్షియల్ పేటీఎంను కొనుగోలు చేయనుందని వార్తలు వచ్చాయి. మరోవైపు పేటీఎం పై ఆంక్షలు విధించిన నేపథ్యంలో దీని షేర్లు విపరీతంగా పడిపోయాయి. కానీ ఫిబ్రవరి 6న కాస్త మెరుగుపడ్డాయి. దీంతో పేటీఎం కష్టాల నుంచి బయటపడుతుందని అనుకున్నారు.

    తాజాగా బుధవారం విజయ్ శర్మ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ తో భేటీ కావడంతో మరోసారి ఆశలు రేకెత్తాయి. కానీ ఆర్థిక మంత్రి పేటియం విషయంలో జోక్యం చేసుకోలేదని చెప్పడంతో మరోసారి చర్చనీయాంశంగా మారింది.దీంతో ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని ఆసక్తి ఎదురు చూస్తున్నారు