Kohli vs BCCI : కొంతకాలంగా ప్రత్యేకించి టెస్ట్ ఫార్మాట్ లో టీమిండియా ఆట తీరు బాగుండడం లేదు. ముఖ్యంగా స్వదేశంలో కూడా భారత్ న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా చేతిలో వైట్ వాష్ కు గురైంది. ఈ నేపథ్యంలో మరోసారి దేశవాళీ చర్చ మొదలైంది.
కొంతకాలంగా జాతీయ జట్టులో ఆడే క్రికెటర్లు డొమెస్టిక్ క్రికెట్లో సత్తా చూపించాలి అనే చర్చ మొదలైంది. ఎప్పుడైతే న్యూజిలాండ్ జట్టు చేతిలో టీమిండియా వైట్ వాష్ కు గురైందో.. అప్పటినుంచి మేనేజ్మెంట్ రకరకాల మార్పులు తీసుకొచ్చింది. కచ్చితంగా దేశవాళీ క్రికెట్ ఆడాలి అని నిబంధన తీసుకువచ్చింది. ఈ నిబంధనలో భాగంగా కొంతమంది ప్లేయర్లు డొమెస్టిక్ క్రికెట్ ఆడినప్పటికీ.. టెస్ట్ ఫార్మేట్లో అంతగా ఆకట్టుకోలేకపోతున్నారు.. టి20, వన్డే ఫార్మాట్ కు అలవాటు పడి.. గంటల తరబడి క్రీజ్ లో ఉండలేకపోతున్నారు. ఇక ఇటీవలి దక్షిణాఫ్రికా జట్టుతో వైట్ వాష్ ఫలితం ఎదురైన తర్వాత మరోసారి డొమెస్టిక్ క్రికెట్ గురించి చర్చ మొదలైంది.
డొమెస్టిక్ క్రికెట్లో కచ్చితంగా ప్రతి ప్లేయర్ ఆడాలి అనే నిబంధన బీసీసీఐ తీసుకొచ్చింది. అందులో రోహిత్, విరాట్, బుమ్రా, రవీంద్ర జడేజా కు మినహాయింపు ఇచ్చింది. ఈ జాబితాలో విరాట్, రోహిత్ గత ఏడాది న్యూజిలాండ్ సిరీస్ లో దారుణంగా విఫలమయ్యారు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో విరాట్ సెంచరీ చేశాడు. కానీ ఆ తర్వాత వరుసగా విఫలమయ్యాడు. రోహిత్ కూడా అంతగా ఆకట్టుకోలేకపోయాడు.
ఆ తర్వాత అనేక పరిణామాలు జట్టులో చోటు చేసుకున్న నేపథ్యంలో టెస్ట్ ఫార్మేట్ నుంచి రోహిత్, విరాట్ వెనక్కి వెళ్ళిపోయారు. దీంతో గిల్ జట్టు పగ్గాలు అందుకున్నాడు. గిల్ నాయకత్వంలో టీమిండియా ఇంగ్లాండ్ జట్టుతో టెస్ట్ సిరీస్ ను సమం చేసుకుంది. వెస్టిండీస్ జట్టుపై విజయం సాధించింది.. గిల్ గాయపడిన నేపథ్యంలో జట్టుకు రిషబ్ పంత్ నాయకత్వం వహించాడు. అతని ఆధ్వర్యంలో కూడా టీమిండియా ఓటమిపాలైంది.. ఇన్ని వరుస ఓటములు ఎదురవుతున్న నేపథ్యంలో డొమెస్టిక్ క్రికెట్ ఆడాలని మేనేజ్మెంట్ మరోసారి నిబంధన విధించినట్లు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి..
దీనిపై విరాట్ కోహ్లీ పరోక్షంగా మేనేజ్మెంట్ కు హెచ్చరికలు జారీ చేశాడు. మైదానంలో కఠిన సాధన చేస్తే లయ అనేది ఆటోమేటిక్ గా లభిస్తుందని విరాట్ చెప్పేశాడు. పూర్వపు లయ అందుకోవడంలో ఎటువంటి సమస్య లేదని.. మానసికంగా దృఢంగా ఉంటేనే ఉంటే అద్భుతంగా ఆడవచ్చని విరాట్ పేర్కొన్నాడు. దీనిని బట్టి మేనేజ్మెంట్ తీసుకున్న నిర్ణయం పట్ల పరోక్షంగా విరాట్ తన స్పందన తెలియజేసినట్టయింది.