Gautam Gambhir Fans Insult : గత కొద్దిరోజుల నుండి సౌత్ ఆఫ్రికా తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో టీం ఇండియా ఘోరమైన ఓటమిని చూడాల్సి వచ్చింది. దీంతో నిరాశకు గురైన కొంతమంది అభిమానులు ఇండియన్ టీం హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్(Gautam Gambhir) ని ఘోరంగా అవమానించారు. మ్యాచ్ పూర్తి అయ్యాక గ్రౌండ్ లోకి అడుగుపెట్టిన గౌతమ్ గంభీర్ ని చూసిన ప్రేక్షకులు ‘గౌతమ్ గంభీర్ హే హే’ అంటూ నినాదాలు చేశారు. అంటే దాని అర్థం ‘గౌతమ్ గంభీర్..డౌన్ డౌన్..సిగ్గు పదండి’ అని అర్థం. ప్రేక్షకుల నినాదాలను గమనించిన క్రికెటర్ సిరాజ్ సైలెంట్ గా ఉండాలంటూ నోటి పై వేలు వేసుకొని అభిమానులకు చూపించారు. కానీ వాళ్ళు ఏ మాత్రం శాంతించలేదు. ఒక ప్రేక్షకుడు హద్దులు దాటి ప్రవర్తించడం గుర్తించిన పోలీసులు, వెంటనే అతడిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు.
క్రికెట్ లెజెండ్ గా పిలవబడే గంభీర్ కి ఇలాంటి అవమానం జరగడం దురదృష్టకరం అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఆట అన్న తర్వాత గెలుపు ఓటములు సహజం. గెలిచినప్పుడు సంతోషించి, ఓడినప్పుడు ఇలా అవహేళన చేయడం ఏ మాత్రం సరికాదు అంటూ సోషల్ మీడియా లో క్రికెట్ లవర్స్ కామెంట్స్ చేస్తున్నారు.
ఇక మ్యాచ్ వివరాల్లోకి వెళ్తే మొదటి టెస్ట్ మ్యాచ్ ఘోరంగా ఓడిపోయిన టీం ఇండియా, రెండవ టెస్ట్ మరింత దారుణంగా ఓడిపోయింది. 5 రోజులుగా జరుగుతున్న ఈ టెస్ట్ సిరీస్ లో సౌత్ ఆఫ్రికా టీం 408 పరుగుల తేడా తో భారత్ ని చిత్తుచిత్తు గా ఓడించింది. ఇలాంటి ఓటమి ఈమధ్య కాలం లో టీం ఇండియా కి రాలేదు. అందుకే గ్రౌండ్ లో అభిమానులు కాస్త అదుపు తప్పి ప్రవర్తించారు. గంభీర్ తనకు జరిగిన అవమానం పై కాస్త అసహనం కి కూడా గురైనట్టు సమాచారం. సోషల్ మీడియా లో బాగా వైరల్ అయినటువంటి ఈ వీడియో ని మీరు కూడా చూసేయండి.
Crowd shouting “Gautam Gambhir hay hay!”
Man this is peak embarrassment.
— Rohan (@rohann__45) November 26, 2025