సన్ రైజర్స్ సూపర్ ఓవర్ ఓడిందిక్కడే: వార్నర్ బదులు బెయిర్ స్టో వచ్చి ఉంటే?

సూపర్ సండే రోజున జరిగిన రెండు ఐపీఎల్ మ్యాచ్ లు ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచాయి. చెన్నై వేదికగా నిన్న రాత్రి జరిగిన మన సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ ఢిల్లీ కేపిటల్స్ మ్యాచ్ అభిమానులపై మునివేళ్లపై నిలబెట్టింది. పోరు ఉత్కంఠభరితంగా సాగింది. సూపర్ ఓవర్ కు దారితీసి నువ్వా నేనా అన్నట్టుగా రెండు టీంలు కొదమ సింహాల్లో పోరాడాయి. అయితే సన్ రైజర్స్ చేసిన ఆ తప్పే సూపర్ ఓవర్ లో ఓటమికి దారితీసింది. టాస్ […]

Written By: NARESH, Updated On : April 26, 2021 8:34 am
Follow us on

సూపర్ సండే రోజున జరిగిన రెండు ఐపీఎల్ మ్యాచ్ లు ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచాయి. చెన్నై వేదికగా నిన్న రాత్రి జరిగిన మన సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ ఢిల్లీ కేపిటల్స్ మ్యాచ్ అభిమానులపై మునివేళ్లపై నిలబెట్టింది. పోరు ఉత్కంఠభరితంగా సాగింది. సూపర్ ఓవర్ కు దారితీసి నువ్వా నేనా అన్నట్టుగా రెండు టీంలు కొదమ సింహాల్లో పోరాడాయి. అయితే సన్ రైజర్స్ చేసిన ఆ తప్పే సూపర్ ఓవర్ లో ఓటమికి దారితీసింది.

టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ కేపిటల్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. ఆ తర్వాత బరిలోకి దిగిన హైదరాబాద్ జట్టు ఓపెనర్ బెయిర్ స్టో రెచ్చిపోయాడు.లేని పరుగు కోసం వెళ్లి కెప్టెన్ డేవిడ్ వార్నర్ రనౌట్ అయ్యాడు. తర్వాత బెయిర్ స్టో కూడా ఔట్ కావడంతో ఇక మొత్తం భారం కేన్ విలయమ్స్ సన్ పై పడింది. ఆపద్భాంధవుడిలా మారిన కేన్ మామ ఓ ఎండ్ లో వరుసగా వికెట్లు పడుతున్నా చివరి వరకు క్రీజులో ఉండి మ్యాచ్ ను టై చేశాడు. సన్ రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో సరిగ్గా 159 పరుగులే చేయడంతో మ్యాచ్ డ్రా అయ్యింది. దీంతో సూపర్ ఓవర్ అనివార్యమైంది.

సూపర్ ఓవర్ లో మొదట సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు బ్యాటింగ్ కు దిగింది. అక్కడే పెద్ద పొరపాటును చేసింది. అలసిపోయిన కేన్ విలయమ్స్ సన్ తోపాటు కెప్టెన్ వార్నర్ క్రీజులోకి వచ్చారు. కానీ తెలివిగా ఢిల్లీ కెప్టెన్ పంత్.. స్పిన్నర్ అక్షర్ పటేల్ ను బౌలింగ్ కు దించాడు. కెప్టెన్ వార్నర్ విఫలమయ్యాడు. అక్సర్ పటేల్ బౌలింగ్ ను ఎదుర్కోలేకపోయాడు. కానీ కేన్ మామ మాత్రం అక్సర్ బౌలింగ్ ఒక బౌండరీ కొట్టి సత్తా చాటాడు. అక్సర్ ధాటికి సన్ రైజర్స్ కేవలం 7 పరుగులు మాత్రమే చేయగలిగింది.

సాధారణంగా ఆస్ట్రేలియా క్రికెటర్లు స్పిన్ ను సరిగా ఆడలేరు.దీంతో వార్నర్ స్ట్రైక్ లో ఉండడంతో ప్రత్యర్థి కెప్టెన్ పంత్ తెలివిగా అక్సర్ తో బౌలింగ్ వేయించి సన్ రైజర్స్ ను దెబ్బతీశాడు. అదే వార్నర్ స్థానంలో బెయిర్ స్టో ఓపెనర్ గా దిగి ఉంటే మ్యాచ్ మరోలా ఉండేదని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. బెయిర్ స్టోను సూపర్ ఓవర్ లో బరిలోకి దించకపోవడమే సన్ రైజర్స్ ఓటమికి కారణంగా చెబుతున్నారు. సూపర్ ఫామ్ లో ఉండి బీకరంగా ఆడుతున్న బెయిర్ స్టో కనుక సూపర్ ఓవర్ లో ఉంటే మ్యాచ్ గెలిచే వాళ్లం అంటున్నారు. వార్నర్ చేసిన తప్పే విజయాన్ని దూరం చేసిందంటున్నారు.

ఇక 8 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన ఢిల్లీ టీం కూడా సూపర్ ఓవర్ లో సన్ రైజర్స్ లాగానే తడబడింది. సన్ రైజర్స్ బౌలర్ రషీద్ ఖాన్ పకడ్బందీగా బౌలింగ్ చేసినా పంత్ ఓ ఫోర్ కొట్టి ఆ తర్వాత అతికష్టం మీద సింగిల్ తీసి ఢిల్లీ సూపర్ ఓవర్ లో గెలిచింది.

నిజానికి ఢిల్లీ కూడా చివరి బంతికి 1 పరుగు చేసి గెలిచింది. కానీ అంతకుముందు వార్నర్-కేన్ సరిగ్గా పరుగులు చేయకలేక క్రీజుపై బ్యాట్ పెట్టకపోవడంతో ఒక పరుగును సన్ రైజర్స్ కోల్పోయింది. లేకుంటే విజయ లక్ష్యం 9 పరుగులుండేది. అప్పుడు ఢిల్లీ కూడా డ్రా చేసుకునేది. ఆ పరుగును కనుక సరిగ్గా పూర్తి చేసి ఉన్నా కూడా సన్ రైజర్స్ గెలిచి ఉండేది. హైదరాబాద్ తప్పుడు నిర్ణయాలే ఈ మ్యాచ్ లో ఓటమికి కారణమయ్యాయి.