Sunrisers Hyderabad : ఇప్పుడు ఐపీఎల్ పున: ప్రారంభమవుతున్న నేపథ్యంలో హైదరాబాద్ జట్టు యజమాని కావ్య మారన్ తను అనుకున్నది చేసి చూపించారు. తన మాటల మనిషిని కాదని.. చేతల మనిషినని నిరూపించారు. అంతేకాదు హైదరాబాద్ జట్టుకు తిరుగులేని బలాన్ని అందించారు. దిక్కుమాలిన ఉగ్రవాద దేశంతో ఏర్పడిన ఉద్రిక్తతల వల్ల ఇబ్బందికర వాతావరణం ఏర్పడింది. జోరుగా సాగుతున్న ఐపీఎల్ కు ఒక్కసారిగా బ్రేక్ పడింది. దీంతో అభిమానుల ఆనందం ఆవిరి అయిపోయింది. ప్రేక్షకుల ఉత్సాహం నీరుగారిపోయింది. గత్యంతరం లేని పరిస్థితిలో నిర్వాహకులు ఐపీఎల్ ను వాయిదా వేశారు. దీంతో ఫారిన్ ప్లేయర్లు వాళ్ళ వాళ్ళ సొంత దేశాలకు వెళ్ళిపోయారు. అలా వెళ్లిపోయిన ప్లేయర్ల లిస్టులో ఆస్ట్రేలియా ఆటగాళ్లు హెడ్, కమిన్స్ కూడా ఉన్నారు. హైదరాబాద్ జట్టులో వీరిద్దరూ అత్యంత కీలకమైన ప్లేయర్లు. వాస్తవానికి ఈ సీజన్లో హైదరాబాద్ జట్టు ఊహించిన స్థాయికి తగ్గట్టుగా ఆడ లేకపోయింది. కొన్ని విషయాలలో మాత్రం హైదరాబాద్ జట్టు అదరగొట్టింది. ముఖ్యంగా పంజాబ్ లాంటి బలమైన జట్టుపై దుర్భేద్యమైన ఇన్నింగ్స్ ఆడింది. తద్వారా ఏక్ దం విజయాన్ని సొంతం చేసుకుంది..
Also Read : వాళ్లకు చోటు.. WTC ఫైనల్ లో దక్షిణాఫ్రికా తో తలపడే ఆస్ట్రేలియా జట్టు ఇదే..
పనిచేసిన కావ్య చాకచక్యం
ఐపీఎల్ వాయిదా పడిన నేపథ్యంలో ఆస్ట్రేలియా ఆటగాళ్లు తిరిగి ఆడటం అసాధ్యం అని సంకేతాలు వినిపించాయి. ఆస్ట్రేలియా మీడియా కూడా ఇదేవిధంగా వార్తలు రాస్కొచ్చింది. ఆస్ట్రేలియా మేనేజ్మెంట్ ప్లేయర్లకు అండగా ఉంటుందని.. ఇండియాకు పంపించే అవకాశం లేకపోవచ్చని వ్యాఖ్యానించింది. అయితే ఇదే సమయంలో కావ్య ఒకసారిగా రంగంలోకి దిగింది. తన చాకచక్యాన్ని ప్రదర్శించింది. దీంతో కమిన్స్, హెడ్ తిరిగి ఇండియాకు రావడానికి మార్గం సుగమం అయింది. అంతేకాదు వారు జట్టులో ఆడేందుకు కూడా లైన్ క్లియర్ అయింది. మొత్తంగా చూస్తే కావ్య తన పరపతి మొత్తం ఉపయోగించి.. మిగతా జట్ల మేనేజ్మెంట్లు విఫలమైనచోట.. కమిన్స్, హెడ్ ను జట్టులోకి తీసుకొస్తోంది. తదుపరి మ్యాచ్లను వారితో ఆడించనుంది. అయితే ఇది ఆస్ట్రేలియాకు చెందిన స్టార్క్ జోస్ ఇంగ్లిస్ ఐపీఎల్ పున: ప్రారంభం అయినప్పటికీ ఆడే అవకాశం లేదని తెలుస్తోంది. వారు ఆస్ట్రేలియా కే పరిమితమవుతారని సమాచారం. కారణాలు తెలియవు గాని.. వారు ఆస్ట్రేలియా నుంచి ఇండియాకు రావడానికి ఆసక్తి చూపించడం లేదని తెలుస్తోంది. మేనేజ్మెంట్లు అనేక రకాలుగా ప్రయత్నాలు చేసినప్పటికీ వారు ఆడే అవకాశం లేదని తెలుస్తోంది. మరోవైపు బెంగళూరు కీలక బౌలర్ హేజిల్ ఉడ్ కూడా ఐపీఎల్ లో ఆడతాడా? లేదా? అనే విషయంపై ఇంకా సందిగ్ధం కొనసాగుతూనే ఉంది. లివింగ్ స్టోన్, మెక్ గుర్క్, ఎంగిడి వంటివారు ఐపీఎల్ లో ఆడతారని ప్రచారం జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ కమిన్స్, హెడ్ లాంటి ప్లేయర్లను తిరిగి జట్టులోకి తీసుకువచ్చి కావ్య తన స్టామినా నిరూపించుకుంది.