Sunrisers Hyderabad: గుజరాత్ టైటాన్స్ జట్టుతో ఆదివారం హైదరాబాదులోని ఉప్పల్ మైదానం వేదికగా జరిగిన మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఓటమిపాలైంది. ఈ మ్యాచ్ లో ముందుగా హైదరాబాద్ జట్టు బ్యాటింగ్ చేసింది. 8 వికెట్ల కోల్పోయి 152 పరుగులు చేసింది. ఈ టార్గెట్ ను గుజరాత్ జట్టు 16.4 ఓవర్లలోనే మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఈ మ్యాచ్లో హైదరాబాద్ జట్టు అన్ని విభాగాలలో విఫల ప్రదర్శన చేసింది. ఈ ఓటమి ద్వారా పాయింట్ల పట్టికలో తన ఆఖరి స్థానాన్ని నిరాటంకంగా కొనసాగిస్తూ వస్తోంది.. వరుస ఓటములు.. సీనియర్ ఆటగాళ్ల నుంచి వస్తున్న విమర్శలు.. విశ్లేషకులు నుంచి ఎదురవుతున్న చీత్కరింపులు.. ఇవన్నీ ఇలా ఉండగానే హైదరాబాద్ జట్టుకు మరో షాక్ తగిలింది.. హైదరాబాద్ జట్టులో కీలక బౌలర్ గా ఉన్న వ్యక్తి ఆసుపత్రి పాలయ్యాడు. ఇంతకీ ఏం జరిగిందంటే..
Also Read: సన్ రైజర్స్ ను దెబ్బకొట్టిన హైదరాబాదీ!
అస్వస్థతకు గురయ్యాడు
సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు లో కీలక బౌలర్ గా ఉన్న హర్షల్ పటేల్ (Harshal Patel) అస్వస్థతకు గురయ్యాడు. ఇదే విషయాన్ని హైదరాబాద్ జట్టు కెప్ట ప్యాట్ కమిన్స్ వెల్లడించాడు. గుజరాత్ జట్టుతో జరిగే మ్యాచ్ కు ముందే ఈ విషయాన్ని అతడు బయటికి చెప్పాడు.. అయితే హర్షల్ పటేల్ ప్రస్తుతం ఆస్పత్రిలో ఉన్నట్టు తెలుస్తోంది. అతడు తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నట్టు సమాచారం. అందుకే హర్షల్ పటేల్ గుజరాత్ టైటాన్స్ జట్టుతో జరిగిన మ్యాచ్లో ఆడలేదు. అతని స్థానంలో కమిన్స్ జయదేవ్ ఉనద్కత్ ను జట్టులోకి తీసుకున్నాడు. అయినప్పటికీ హైదరాబాద్ జట్టు ఓటమిపాలైంది.. అయితే హర్షల్ పటేల్ గనుక మ్యాచ్ ఆడి ఉంటే ఫలితం మరో విధంగా ఉండేదని.. హైదరాబాద్ అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు..స్లో పిచ్ పై హర్షల్ పటేల్ చుక్కలు చూపించేవాడని.. అతడు లేని లోటు హైదరాబాద్ జట్టులో స్పష్టంగా కనిపించిందని సన్ రైజర్స్ హైదరాబాద్ అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు. ” హర్షల్ పటేల్ కు జ్వరం వచ్చింది. స్లో వికెట్ అని కెప్టెన్ కమిన్స్ కు తెలిసింది. అలాంటప్పుడు మంచి ఆటగాడిని తీసుకుంటే బాగుండేది. ఏమాత్రం ప్రభావం చూపించలేని ప్లేయర్లను తీసుకుంటే ఫలితం ఇలానే ఉంటుంది. వరుసగా నాలుగు మ్యాచ్లు ఓడిపోయారంటే.. పరిస్థితి ఎంతదారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికైనా హైదరాబాద్ జట్టు మేనేజ్మెంట్ తీరు మార్చుకోవాలి. జట్టు కూర్పు విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఇలానే హైదరాబాద్ జట్టు వ్యవహారం కొనసాగితే… ప్రస్తుత సీజన్లో గ్రూప్ దశ నుంచే జట్టు నిష్క్రమించాల్సి ఉంటుందని” సోషల్ మీడియా వేదికగా అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు. ” ఆటగాళ్ల సామర్థ్యం పెంచే ప్రయత్నం హైదరాబాద్ జట్టు మేనేజ్మెంట్ చేయాలి. రిజర్వ్ బెంచ్ ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వాలి. అంత తప్ప వరుసగా విఫలమవుతున్న ఆటగాళ్లకు అవకాశాలు ఇస్తే ఉపయోగం లేకుండా పోతోంది. తొలి మ్యాచ్ మినహా ఇషాన్ కిషన్ పెద్దగా ఆకట్టుకోలేదు. హెడ్ లోపాలు ప్రత్యర్థి బౌలర్లకు తెలిసిపోయాయి. అభిషేక్ శర్మ దూకుడుగా ఆడలేక పోతున్నాడు. నితీష్ కుమార్ రెడ్డి సామర్థ్యాన్ని నిరూపించుకోలేకపోతున్నాడు. ఇలాంటి వాళ్ల స్థానంలో కొత్త వాళ్లకు అవకాశం కల్పిస్తే జట్టు విజయాలు సాధించే అవకాశం ఉందని” సన్ రైజర్స్ హైదరాబాద్ అభిమానులు పేర్కొంటున్నారు.