SRH Vs Punjab: ఆది చిదంబరం స్టేడియం. చెన్నై, ఢిల్లీ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై జట్టు 212 పరుగులు చేసింది. కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయింది. బలమైన బౌలింగ్ లైన్ అప్ ఉన్న ఢిల్లీ జట్టుకు చుక్కలు చూపించింది. ముఖ్యంగా చెన్నై ఓపెనర్ సంజు సింహతాండవం చేశాడు. ఈ ఐపీఎల్ లో తొలి సెంచరీని నమోదు చేశాడు. ఓపెనర్ గా వచ్చిన అతడు.. కడదాకా నిలబడ్డాడు. 115* పరుగులు చేసి సంచలనం సృష్టించాడు.
పిచ్ నుంచి బౌలర్లకు పెద్దగా సహకారం లేదు. దీంతో ఢిల్లీ జట్టు 212 పరుగులను ఈజీగా ఫినిష్ చేస్తుందని అందరూ అనుకున్నారు. కానీ ఇక్కడే మ్యాజిక్ జరిగింది. చెన్నై బౌలర్లు రెచ్చిపోయారు. ముఖ్యంగా ఓవర్టన్ మ్యాజిక్ చేశాడు. కేవలం 18 పరుగులు మాత్రమే ఇచ్చి.. నాలుగు వికెట్లు పడగొట్టాడు. ప్రస్తుత ఐపీఎల్ లో ఏ బౌలర్ కైనా సరే ఇదే అత్యుత్తమ ప్రదర్శన.. దానిని ఓవర్టన్ చేసి చూపించాడు.
ఇక చెన్నై విజయాన్ని కాస్త పక్కన పెడితే.. మన హైదరాబాద్ జట్టు విషయానికొద్దాం. అభిషేక్ శర్మ పంజాబ్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. ఐపీఎల్ లో ఇది మామూలు టార్గెట్ కాదు. ఈ టార్గెట్ కాపాడుకోవడంలో హైదరాబాద్ జట్టు దారుణంగా విఫలమైంది. పంజాబ్ జట్టు బ్యాటర్లు పిచ్చ కొట్టుడు కొడుతుంటే.. హైదరాబాద్ బౌలర్లు చూస్తూ ఉండిపోయారు.. 220 టార్గెట్ కూడా కాపాడుకోలేక ప్రేక్షకులుగా మిగిలిపోయారు. ముల్లాన్ పూర్ పిచ్ ప్లాట్ గా ఉంది. దాని అంచనా వేసి పంజాబ్ జట్టు సారథి అయ్యర్ బౌలింగ్ ఎంచుకున్నాడు. అప్పుడు హైదరాబాద్ బ్యాటర్లు ఏం చేయాలి.. భారీగా పరుగులు చేయాలి. వికెట్లు వెంటనే పడేసుకోకూడదు. ఓపెనింగ్ భాగస్వామ్యం బాగానే వచ్చింది. కానీ మిడిల్ ఆర్డర్ విఫలమైంది. ఎవరిని పంపించాలో తెలియక.. ఎవరో ఒకరిని పంపించారు. వారేమో సరిగా ఆడలేక పంజాబ్ బౌలర్లకు దాసోహం అయ్యారు. ప్రారంభ ఓవర్లలో వచ్చిన స్కోర్ కు.. చివర్లో వచ్చిన స్కోర్ కు ఏమాత్రం సంబంధం లేదు. వాస్తవానికి పంజాబ్ జట్టు ఎదుట హైదరాబాద్ ఏకంగా 270 రన్స్ టార్గెట్ పెడుతుందని అందరూ అనుకున్నారు. కానీ మిడిల్ ఆర్డర్ బ్యాటర్ల వైఫల్యం వల్ల అది కాస్త 220 పరుగులకే పరిమితమైంది.
ఈ లక్ష్యాన్ని కాపాడుకోవడం పెద్ద కష్టం కాదు. పిచ్ నుంచి సహకారం లేదనుకుందాం. అలాంటప్పుడు శశాంక్ అనే పంజాబ్ బౌలర్ అంత కట్టుదిట్టంగా బంతులు ఎలా వేశాడు.. వికెట్లు ఎలా పడగొట్టాడు.. అనే విషయాన్ని హైదరాబాద్ బౌలర్లు పూర్తిగా మర్చిపోయారు. సీమ్ ఆఫ్ డెలివరీ లు వేయడం. ప్లాట్ పిచ్ మీద పేస్ ను జనరేట్ చేయడం వల్ల పరుగులు సమర్పించుకున్నారు. కొందరు బౌలర్లు అయితే ఫుల్ టాస్ బంతులను బ్యాట్ ఎత్తుకు వేశారు. దీంతో పంజాబ్ బ్యాటర్లు పండగ చేసుకున్నారు.. బ్యాకప్ లెంత్ బంతులు వేయడాన్ని హైదరాబాద్ బౌలర్లు అలవాటుగా మార్చుకున్నారు. తగిన మూల్యాన్ని చెల్లించుకున్నారు.
హైదరాబాద్ బౌలింగ్ ఎంత దారుణంగా ఉందో.. మ్యాచ్ ఓడిపోయిన తర్వాత కెప్టెన్ కిషన్ చెప్పిన మాటలు వెల్లడిస్తున్నాయి. కిషన్ తీరు అలా ఉంటే.. సామాన్య ప్రేక్షకుడి స్పందన ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే హైదరాబాద్ బౌలర్లు పూర్తిగా మారిపోవాలి. కావ్య పాపను ఏడిపించకుండా.. గెలిపించాలి. ఇవన్నీ జరగాలంటే బౌలింగ్లో సమూల ప్రక్షాళన జరగాలి. ఇప్పుడే సన్ “రైజర్స్” అయ్యేది.