IPL 2024 Auction: ఐపిఎల్ మినీ వేలంలో సన్ రైజర్స్ టీం తన సత్తాను చాటుతుంది. ఇక ఇప్పటికే ట్రవిస్ హెడ్,హసరంగ లాంటి ప్లేయర్లు కొనుగోలు చేసిన హైదరాబాద్ టీం ఇక ఇప్పుడు హిస్టరీలోనే అత్యధిక డబ్బులను కేటాయించి ఆస్ట్రేలియన్ కెప్టెన్ అయిన పాట్ కమ్మిన్స్ ని కొనుగోలు చేసింది. ఐపిఎల్ హిస్టరీలోనే ఏ ప్లేయర్ ని కొనుగోలు చేయలేని రీతిలో 20.50 కోట్లతో అతన్ని కొనుగోలు చేసి మిగతా ఫ్రాంచైజ్ లకి షాక్ ఇచ్చింది.కమ్మిన్స్ ని కొనుగోలు చేయడానికి సన్ రైజర్స్ టీం తో పాటుగా బెంగళూరు టీం కూడా చాలా వరకు ట్రై చేసింది.
అయినప్పటికీ హైదరాబాద్ కమ్మిన్స్ ను దక్కించుకుంది. ఇక ఇదిలా ఉంటే ఈసారి హైదరాబాద్ టీమ్ భారీ ఎత్తున ప్లాన్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే ముగ్గురు ఫారన్ ప్లేయర్స్ ను తీసుకొని టీం కి మరింత బలాన్ని చేకూర్చింది. ఇక వీళ్ల రాకతో హైదరాబాద్ టీం లోకి మరొక ఆల్ రౌండర్ చేరినట్టు అయింది. ఇప్పటికి ముగ్గురు ఆల్ రౌండర్లను తీసుకొని హైదరాబాద్ టీం మరింత స్ట్రాంగ్ గా తయారైంది.ఇక ఇప్పటి వరకు ఐపిఎల్ 2023 లో పంజాబ్ టీమ్ సామ్ కరణ్ కోసం 18.50 కోట్ల పెట్టగా కమ్మిన్స్ ఇప్పుడు 20.50 కోట్లతో ఆ రికార్డ్ ని బ్రేక్ చేశాడు.ఇక ఇది ఇలా ఉంటే బ్యాటింగ్ లో మార్కరం క్లాసేన్, ట్రావిస్ హెడ్, హసరంగా లాంటి ప్లేయర్స్ ఉండటం తో ఈ టీమ్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. ప్రస్తుతం ఐపీఎల్ మినీ వేలంలో హైద్రాబాద్ టీమ్ తన సత్తాను చాటుకుంటు పాట్ కమ్మిన్స్ లాంటి ప్లేయర్ ని ఐపీఎల్ హిస్టరీలోనే అత్యధిక ధర కి కొనుగోలు చేసి సరికొత్త రికార్డ్ ను క్రియేట్ చేశాడు…
కమ్మిన్స్ కోసం హైదరాబాద్ కి అన్ని కోట్లు పెట్టడానికి గల కారణం ఏంటంటే ఆస్ట్రేలియా టీమ్ తరుపున కెప్టెన్ గా ఉండి ఆ టీమ్ కి వన్డే వరల్డ్ కప్ ని అందించాడు. తనదైన రీతిలో టీమ్ మొత్తాన్ని ముందు ఉండి నడిపిస్తూ ఆ టీమ్ మంచి విజయం సాధించడంలో తను చాలా వరకు కృషి చేశాడు. అందుకే అతన్ని అన్ని డబ్బులు పెట్టి కొనుగోలు చేసినట్టుగా తెలుస్తుంది. ఇక ఈసారి పాట్ కమ్మిన్స్ హైదరాబాద్ టీం తరఫున చాలావరకు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఇక హైదరాబాద్ తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని నెరవేరుస్తూ సక్సెస్ ఫుల్ గా కప్పు తీసుకొచ్చే దిశగా ముందుకు సాగాలని కోరుకుందాం…
ఇప్పటి హైదరాబాద్ టీమ్ ప్లేయర్ల పరంగా చాలా డల్ గా ఉంది అని అభిమానులు అందరూ తీవ్ర నిరాశకు గురైనప్పటికీ ఇప్పుడు ఈ ముగ్గురు ప్లేయర్ల రాకతో టీం చాలా స్ట్రాంగ్ గా తయారైంది. మిగతా అన్ని టీమ్ లకు సవాళ్లు విసిరేంత స్ట్రాంగ్ గా తయారయింది.ఇక దానివల్ల హైదరాబాద్ టీం ఈసారి కప్పు పక్క గా కొట్టగలదు అనే కాన్ఫిడెన్స్ అయితే వ్యక్తం అవుతుంది…