Homeక్రీడలుSunil Narine : ఐపీఎల్ లో చరిత్ర సృష్టించిన సునీల్ నరైన్

Sunil Narine : ఐపీఎల్ లో చరిత్ర సృష్టించిన సునీల్ నరైన్

Sunil Narine : చెన్నై జట్టుతో కోల్ కతా లోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా బుధవారం జరుగుతున్న మ్యాచ్లో కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు తరఫున ఓపెనర్ గా బరిలోకి దిగిన సునీల్ సరికొత్త చరిత్ర సృష్టించాడు.. కొద్దిరోజులుగా సరైన ఆట తీరు ప్రదర్శించకుండా ఇబ్బంది పడుతున్న అతడు.. ఈ మ్యాచ్లో మాత్రం ఆకట్టుకున్నాడు. 17 బంతుల్లో 26 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్ లో నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి. కోల్ కతా జట్టులో రహానే 48, రస్సెల్ 38, మనీష్ పాండే 36* పరుగులు చేసి ఆకట్టుకున్నారు. స్లో పిచ్ పై కోల్ కతా ప్లేయర్లు నిదానంగా బ్యాటింగ్ చేశారు. 20 ఓవర్లు పూర్తిస్థాయిలో బ్యాటింగ్ చేసి ఆరు వికెట్లు నష్టపోయి 179 పరుగులు చేసింది. ప్రస్తుత ఐపీఎల్లో ప్లే ఆఫ్ వెళ్లాలంటే కోల్ కతా నైట్ రైడర్స్ ఈ మ్యాచ్లో కచ్చితంగా విజయం సాధించాలి. ఇక చెన్నై బౌలర్లలో నూర్ అహ్మద్ 4 వికెట్లు సాధించాడు.

Also Read : లక్నో 238 కొట్టినా.. ఇదే హైయెస్ట్ కాదు.. గతంలో ఎవరి మీద చేసిందంటే..

అద్భుతమైన రికార్డు

ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతున్న మ్యాచ్లో కోల్ కతా నైట్ రైడర్స్ ఆటగాడు సునీల్ నరైన్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఒక ప్లేయర్ (రవిచంద్రన్ అశ్విన్) బౌలింగ్లో 50+ బాల్స్ ఎదుర్కొని.. అత్యధిక స్ట్రైక్ రేట్ (244.44) తో చాటింగ్ చేసిన ప్లేయర్గా నిలిచాడు. రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్ లో అతడు 54 బంతులు ఎదుర్కొని.. 132 పరుగులు చేశాడు. సునీల్ తర్వాతి స్థానంలో పోలార్డ్ కొనసాగుతున్నాడు. రవీంద్ర జడేజా బౌలింగ్లో 51 బంతులు ఎదుర్కొని అతడు114 పరుగులు చేశాడు. ఇతడి స్ట్రైక్ రేట్ 223.52 గా ఉంది. సురేష్ రైనా తర్వాత స్థానంలో ఉన్నాడు. సందీప్ శర్మ బౌలింగ్లో 53 బంతులు ఎదుర్కొని రైనా 110 పరుగులు చేశాడు. ఇతడి స్ట్రైక్ రేట్ 207.54 గా ఉంది. రైనా తర్వాత డివిలియర్స్ కొనసాగుతున్నాడు. మలింగ బౌలింగ్లో డివిలియర్స్ 61 బంతులు ఎదుర్కొని 124 పరుగులు చేశాడు. ఇతడు స్ట్రైక్ రేట్ 203.27 గా ఉంది. రవిచంద్ర అన్న అశ్విన్ బౌలింగ్ లో ఎప్పుడూ సునీల్ వెనకడుగు వేయలేదు. వెన్ను చూపించలేదు. దూకుడుగా బ్యాటింగ్ చేశాడు. ధాటిగా పరుగులు సాధించాడు. అందువల్లే ఐపిఎల్ లో సునీల్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఈ సీజన్లో సునీల్ గొప్పగా బ్యాటింగ్ చేయలేదు. కోల్ కతా జట్టు మేనేజ్మెంట్ ఎన్నో ఆశలు పెట్టుకున్నప్పటికీ.. అతడు వాటిని నెరవేర్చలేకపోయాడు. చివరికి చెన్నై జట్టుతో జరుగుతున్న మ్యాచ్ లోను సునీల్ భారీ ఇన్నింగ్స్ నిర్మించలేకపోయాడు. అది ఒక రకంగా కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు భారీ పరుగులు చేయకపోవడానికి కారణమైంది.

Also Read : మొన్ననేమో సంతకం.. నేడేమో బంతి.. ఎవడ్రా నువ్వు ఇలా ఉన్నావ్?

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version