Sunil Gavaskar: సునీల్ గవాస్కర్ (Sunil Gavaskar) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. క్రికెట్ లో సమున్నత శిఖరాలను అధిరోహించిన ఆటగాడు అతడు. అద్భుతమైన రికార్డులను నెలకొల్పిన అనుభవశాలి అతడు. సచిన్ టెండూల్కర్( Sachin Tendulkar) గురించి కొలమానాలు అవసరం లేదు. ఉపమానాలు ఉపయోగించాల్సిన పనిలేదు. అతడు క్రికెట్ కు సరికొత్త అందాన్ని తీసుకొచ్చిన ఆటగాడు. అద్భుతమైన రికార్డులను నెలకొల్పిన క్రికెటర్.
ఈ ఇద్దరు లెజెండరీ క్రికెటర్లు సరికొత్తగా కనిపించారు. ఒకరు పాటలు పాడుతూ.. మరొకరు స్టెప్పులు వేస్తూ సందడి చేశారు. ఇందుకు ముంబై లోని వాంఖడే మైదానం వేదిక అయింది. సునీల్ గవాస్కర్ క్రికెట్ కు వీడ్కోలు పలికిన తర్వాత వ్యాఖ్యాత అవతారం ఎత్తారు. అప్పుడప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. సచిన్ తనకు మొదటి నుంచి అలవాటైన నిశ్శబ్దాన్ని పాటిస్తున్నారు. క్రమశిక్షణను కొనసాగిస్తున్నారు. కుటుంబంతో కలిసి విదేశీ పర్యటనకు వెళ్తున్నారు. ఐతే వీరిద్దరూ తమలో ఉన్న మరో టాలెంట్ బయటికి తీశారు. దీంతో సభికులు, ప్రేక్షకులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. ఆ తర్వాత వారు కూడా ఆనందంతో గంతులు వేశారు.
ముంబై లోని వాంఖడే మైదానం 50 ఏళ్ల వేడుకలు ఘనంగా నిర్వహించారు. చివరి రోజు సంబరాలను ఆదివారం ఆకాశమే హద్దుగా నిర్వహించారు.. ఈ వేడుకలకు రవి శాస్త్రి, సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్, రోహిత్ శర్మ లాంటి ఆటగాళ్లు హాజరయ్యారు. వారంతా కలిసి వేడుకల్లో పాలు పంచుకున్నారు. సంభాషణలతో, తమ జ్ఞాపకాలతో వేడుకకు హాజరైన ప్రేక్షకుల్లో ఆనందాన్ని నింపారు. ఈ వేడుకల్లో సచిన్, సునీల్ తమలో ఉన్న టాలెంట్ ను బయటపెట్టారు. ఈ వేదికపై నిర్వాహకు ఓం శాంతి ఓం పాటను లో చేశారు. సచిన్ కూడా ఆ పాటను పాడుతూ అత్యంత ఉత్సాహంగా కనిపించారు.. సునీల్ గవాస్కర్ ఈ పాట స్టెప్పులు వేసి అలరించారు. ” 1974 లో ఈ స్టేడియం నిర్మించినప్పుడు ఆటగాళ్ల డ్రెస్సింగ్ రూమ్ కింది భాగంలో ఉండేది. శిక్షణ కోసం ఈ మైదానంలోకి నేను అడిగి పెట్టినప్పుడు నాకు కొత్తగా అనిపించింది. అప్పుడే ఈ మైదానంతో నేను ప్రేమలో పడ్డాను. ఈ మైదానాన్ని నా సొంత గ్రౌండ్ లాగా అనుకుంటాను.. కామెంట్రీ కోసం ఇక్కడికి వచ్చినప్పుడు నా గుండె ఉద్వేగానికి గురవుతుందని” సునీల్ వ్యాఖ్యానించాడు. 1975 జనవరి 19న ఫస్ట్ ఇంటర్నేషనల్ మ్యాచ్ ఈ మైదానంలో జరిగింది. నాటి మ్యాచ్లో టీమిండియాలో గవాస్కర్ కీలక ఆటగాడిగా ఉన్నాడు. అంతేకాదు టెస్ట్ క్రికెట్లో 10,000 పరుగుల మార్కు అందుకున్న తొలి ఆటగాడిగా సునీల్ టీమ్ ఇండియా తరఫున రికార్డు సృష్టించాడు. సచిన్ పాట పాడుతున్నంత సేపు.. ఆ కార్యక్రమాన్ని చూసేందుకు వచ్చిన వారంతా అభినందించారు. వారు కూడా తమ గొంతును సవరించారు. ఇక సునీల్ గవాస్కర్ అయితే సరికొత్త స్టెప్పులతో ఆకట్టుకున్నారు.
Sunil Gavaskar singing & dancing for the famous song “Om Shanti Om” ❤️
– A beautiful video…!!!! pic.twitter.com/sYWgbReN1Q
— Johns. (@CricCrazyJohns) January 20, 2025