India vs Pakistan : ఐర్లాండ్ పై 1తో సరిపోయింది.. పాక్ తో విరాట్ కు ప్రమాదం పొంచి ఉంది..

మరోవైపు విరాట్ కోహ్లీ టీ20 ప్రపంచ కప్ చరిత్రలో చేజింగ్ మాస్టర్ గా చరిత్ర ఎక్కాడు.. భారత జట్టు తరఫున చేజింగ్ సమయంలో 78*, 36*, 54, 57*, 72*, 23, 55*, 82 పరుగులు చేసి అద్భుతమైన విజయాలు అందించాడు.

Written By: NARESH, Updated On : June 6, 2024 8:19 pm

Sunil Gavaskar says Virat Kohli will be key in ICC T20 World Cup 2024 match with Pakistan

Follow us on

India vs Pakistan : టి20 ప్రపంచ కప్ లో.. అత్యధిక పరుగులు చేసే సత్తా ఉన్న ఆటగాళ్లల్లో విరాట్ కోహ్లీ ముందు వరుసలో ఉంటాడు. అయితే అలాంటి ఆటగాడు ఐర్లాండ్ జట్టుతో జరిగిన మ్యాచ్లో ఒక్క పరుగు చేసి అవుట్ అయ్యాడు. దీంతో అభిమానుల్లో ఒక్కసారిగా ఆందోళన నెలకొంది. ఐపీఎల్ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసి, ఆరెంజ్ క్యాప్ దక్కించుకున్న విరాట్ కోహ్లీ.. ఐర్లాండ్ జట్టుపై ఒక్క పరుగు మాత్రమే చేసి అవుట్ కావడాన్ని అతడి అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. మరోవైపు ఇదే వేదికపై భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ఆర్ధ సెంచరీ తో ఆకట్టుకున్నాడు. రిషబ్ పంత్ దూకుడుగా బ్యాటింగ్ చేశాడు. అంతకుముందు బంగ్లాదేశ్ తో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్లో హార్దిక్ పాండ్యా వీర విహారం చేశాడు. అయితే ఇలాంటి వేదికపై విరాట్ కోహ్లీ ఒకే ఒక పరుగు చేసి అవుట్ కావడం పట్ల సోషల్ మీడియాలో రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. మరీ ముఖ్యంగా పాకిస్తాన్ జట్టుతో జరిగే మ్యాచ్ కు ముందు విరాట్ కోహ్లీ ఇలా అవుట్ కావడాన్ని మాజీ క్రికెటర్లు తప్పబడుతున్నారు. అలాంటి వారిలో సునీల్ గవాస్కర్ కూడా ఉన్నాడు.

విరాట్ కోహ్లీ ఒక పరుగు చేసి అవుట్ కావడం పట్ల సునీల్ గవాస్కర్ విస్మయం వ్యక్తం చేశాడు..” విరాట్ కోహ్లీ లాంటి ఆటగాళ్లు ఇలా అత్యల్ప స్కోర్లు నమోదు చేయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. పాకిస్తాన్ జట్టుతో జరిగే మ్యాచ్ కు ముందు అతడు ఇలా అవుట్ కావడం ఒకింత ఇబ్బందిగానే ఉంది. పాక్ జట్టుతో జరిగే మ్యాచ్ పై అతడు సత్తా చూపుతాడని ఆశిస్తున్నా. ఐర్లాండ్ పై ఒకే ఒక్క పరుగుతో సరిపోయింది. పాకిస్తాన్ జట్టుతో మాత్రం అతడికి ప్రమాదం పొంచి ఉంది. దాయాది జట్టుతో జరిగే మ్యాచ్లో అతడు అంచనాలను అందుకుంటాడని భావిస్తున్నా. స్టీవ్ స్మిత్, విరాట్ కోహ్లీ, బాబర్ అజాం, జో రూట్ వంటి వారు గొప్ప ఆటగాళ్లు. వారు ఒక మ్యాచ్లో విఫలమైనప్పటికీ.. దానిని మరో మ్యాచ్ తో భర్తీ చేస్తారు. రెట్టింపు పరుగులు చేస్తారు. అందువల్లే విరాట్ కోహ్లీ ఐర్లాండ్ జట్టుపై ఎటువంటి పరుగులు సాధించి ఉండకపోవచ్చు. పాకిస్తాన్ జట్టుపై అతడు రెట్టింపు పరుగులు చేయాలని భావిస్తున్నాడు కావచ్చు. అలాంటి అవకాశాన్ని భారత్ మాత్రం ఎందుకు వదులుకుంటుందని” సునీల్ గవాస్కర్ వ్యాఖ్యానించాడు.

మరోవైపు విరాట్ కోహ్లీ టీ20 ప్రపంచ కప్ చరిత్రలో చేజింగ్ మాస్టర్ గా చరిత్ర ఎక్కాడు.. భారత జట్టు తరఫున చేజింగ్ సమయంలో 78*, 36*, 54, 57*, 72*, 23, 55*, 82 పరుగులు చేసి అద్భుతమైన విజయాలు అందించాడు. టి20 ప్రపంచ కప్ చరిత్రలో 4000+ పరుగులు సాధించిన తొలి ఆటగాడిగా కోహ్లీ నిలిచాడు. కేవలం 110 ఇన్నింగ్స్ లలో 4,038 పరుగులు చేసి రికార్డు సృష్టించాడు.. ఇక గత వరల్డ్ కప్ లో పాకిస్తాన్ జట్టుపై జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ ఆదరగొట్టాడు. అద్భుతంగా బ్యాటింగ్ చేసి ఓడిపోతుందనుకున్న మ్యాచ్ ను తిరిగి భారత జట్టు చేతిలోకి తెచ్చాడు.