https://oktelugu.com/

YCP – YS Jagan : రాష్ట్రంలో వైసీపీ ఓడినా.. కేంద్రంలో జగన్ కీలకమే!

ఈ తరుణంలో బీజేపీ వైసీపీతో టచ్‌లోకి వెళ్లిందని తెలియడంతో టీడీపీ ఆశలు ఆవిరైనట్లు అన్న చర్చ జరుగుతోంది.

Written By:
  • NARESH
  • , Updated On : June 6, 2024 8:06 pm
    Jagan- Modi

    Jagan- Modi

    Follow us on

    YCP – YS Jagan : దేశ ప్రజలు ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో విలక్షణ తీర్పు ఇచ్చారు. ఎవరికీ మెజారిటీ ఇవ్వలేదు. అయితే కూటమిగా ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు రెండింటికీ అవకాశం కల్పించారు. ఎన్డీఏ కూటమికి ఇండియా కుటమికన్నా కాస్త ఎక్కువ సీట్లు ఇచ్చారు. దీంతో కేంద్రంలో మూడోసారి ప్రభుత్వం ఏర్పాటుకు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే బుధవారం(జూన్‌ 5న) నిర్వహించిన ఎన్డీఏ పక్షాల సమావేశంలో అన్ని పార్టీలు ప్రధానిగా మోదీకి ఏకగ్రీవంగా మద్దతు ప్రకటించాయి.

    ఎన్డీఏలో ఆ రెండు పార్టీలే కీలకం..
    లోక్‌సభ ఎన్నికల్లో డబుల్‌ డిజిట్‌ సీట్లు సాధించిన ఎన్డీఏ భాగస్వామ పార్టీలు టీడీపీ, జేడీయూ కీలకంగా మారాయి. టీడీపీకి 16, జేడీయూకు 12 మంది ఎంపీల బలం ఉంది. ఈ రెండు పార్టీలు ఎన్డీఏను వీడితే మోదీ సర్కార్‌ సంక్షోభవంలో పడుతుంది. దీంతో ఆ పార్టీలు అడిగిన పదవులు ఇచ్చేందుకు కూడా మోదీ సర్కార్‌ సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది.

    మరోవైపు కూటమిలో కొత్త భాగస్వాములు..
    ఇక ఎన్డీఏ కూటమిలో కొత్త భాగస్వాములను చేర్చుకునేందుకు బీజేపీ కసరత్త మొదలు పెట్టింది. ప్రస్తుతం కీలకంగా ఉన్న టీడీపీ, జేడీయూ రెండూ నమ్మదగిన పార్టీలు కాదు. ఇండియా కూటమి నుంచి మంచి ఆఫర్‌ వస్తే ఎన్డీఏను వీడేందుకు వెనుకాడరు. ఈ నేపథ్యంలో బీజేపీ పా‍్లన్‌ -బిని అమలు చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తోంది. ఈ క్రమంలో ఇండియా కూటమిలోని పార్టీలతోపాటు ఏ కూటమిలో లేని పార్టీలను ఎన్డీఏలో చేర్చుకునేందుకు సంప్రదింపులు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది.

    కూటమిలో లేని పార్టీలు..
    ప్రస్తుతం అటు ఇండియా, ఇటు ఎన్డీఏ కూటమిలో లేని పార్టీలు వైసీపీ, బీజేడీ మాత్రమే. వైసీపీకి నలుగురు ఎంపీలు ఉన్నారు. బీజేడీకి ఏడుగురు ఎంపీలు ఉన్నారు. ఒడిశాలో రాజకీయ పరిస్థితుల దృష్ట్యా బీజేపీకి నవీన్‌ పట్నాయక్‌ మద్దతిచ్చే పరిస్థితి లేదు. దీంతో బీజేపీ జగన్‌తో టచ్‌లో ఉందని తెలుస్తోంది.

    పెద్దగా అవసరం ఉండదని.. టీడీపీ బీజేపీ భుజంపై తుపాకీ పెట్టి జగన్‌ను కేసుల పేరుతో ఇబ్బంది పెట్టే అవకాశాలున్నాయంటూ ప్రచారం జరుగుతోంది. అయితే ప్రస్తుత పరిస్థితులు చూస్తే అలా కనిపించడం లేదు. దీనికి ప్రధాన కారణం ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ 240 స్థానాలకే పరిమితమైంది. సొంతంగా మెజార్టీకి 32 సీట్ల దూరంలో నిలిచిపోయింది. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు మిత్రపక్షాల అవసరం ఏర్పడింది. ఇదే సమయంలో బయట నుంచి మద్దతు ఇచ్చే పార్టీలు కూడా బీజేపీకి అవసరం. టీడీపీకి ఒక్క రాజ‍్యసభ సభ్యుడు కూడా లేడు. మరోవైపు వైసీపీకి రాజ్యసభలో 11 మంది సభ్యులు ఉన్నారు. కేంద్రం బిల్లులు పెద్దల సభలో పాస్‌ కావడానికి ఆ పార్టీ మద్దతు అవసరం ఉంటుంది. ఈ నేపథ్యంలో వైసీపీ దూరం చేసుకోవద్దనే ఆలోచనలో బీజేపీ ఉన్నట్లు తెలుస్తోంది.

    టీడీపీకి నిరాశే..
    ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో బీజేపీ భుజంపై తుపాకి పెట్టి జగన్‌ను కాల్చాలని టీడీపీ ప్లాన్‌ వేసుకుంటోంది. అక్రమాస్తుల కేసు విచారణను స్పీడప్‌ చేయాలని భావించింది. ఈ తరుణంలో బీజేపీ వైసీపీతో టచ్‌లోకి వెళ్లిందని తెలియడంతో టీడీపీ ఆశలు ఆవిరైనట్లు అన్న చర్చ జరుగుతోంది.