Team India: గల్లీ మ్యాచ్ దగ్గర నుంచి ఢిల్లీ వరకు క్రికెట్ ప్లేయర్లకు కొదవలేదు. టీమిండియా ఎంతో పటిష్టమైన జట్టు కావాలి అంటే సెలక్షన్ కమిటీ వాళ్లు తమ పక్షపాత బుద్ధిని కాస్త పక్కన పెట్టాలి అన్న విమర్శలు ఎప్పుడు వింటూనే ఉంటాం. అయినా గాని బీసీసీఐ ఎంపిక ఎప్పుడూ ఏకపక్షంగానే ఉంటుంది. ఈ నేపథ్యంలో వెండి స్ పర్యటనకు సంబంధించిన భారత్ జట్టు ఎంపికపై మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ మరొకసారి బీసీసీఐ కమిటీని తప్పు పట్టాడు.
పెద్దగా ప్రాముఖ్యత లేని పర్యటనలో కూడా జట్టుకి కేవలం సీనియర్ ప్లేయర్స్ అయినా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లాంటి వారిని తీసుకోవడంపై ప్రశ్నించారు. ఇటీవల విండీస్ లో జరిగిన రెండు టెస్టు సీరియస్ లో టీం ఇండియా 1 0 స్కోర్ తో మ్యాచ్ను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. మొదటి టెస్టులో అద్భుతంగా ఆడి భారత్ జట్టు విజయం సాధించింది కానీ రెండో మ్యాచ్ వర్షం కారణంగా డ్రాగ ముగిసింది. ఈ సిరీస్ లో రోహిత్ మరియు విరాట్ తో పాటు యశస్వి జైస్వాల్ టీమ్ ఇండియా తరఫున మెరుగైన ప్రదర్శన కనబరిచారు.
ఈ నేపథ్యంలో సిరీస్ కి ప్లేయర్స్ సెలెక్ట్ చేసిన సెలక్షన్ కమిటీ తీరుపై గవాస్కర్ మండిపడ్డారు. టెస్ట్ సిరీస్ లో ఎప్పటిలాగే వాళ్లు పరుగులు రాబట్టారు అంతకంటే చేసింది ఏమీ లేదు. అంటే వాళ్లకు ప్రత్యమ్నయంగా టీమిండియాలో ఇంకా ఏ ప్లేయర్ లేరు అనేది సెలక్షన్ కమిటీ ఉద్దేశమా అని గవాస్కర్ ప్రశ్నిస్తున్నారు. ఈ ఇద్దరిని మాత్రమే ప్రతి దగ్గరకు పంపితే టీమిండియా బలపడదు. వాళ్లని ఇటువంటి వాటికి పక్కన పెట్టి కొత్త ప్లేయర్లకు అవకాశం ఇవ్వాలి.. ఇటువంటి మ్యాచ్లు వాళ్ళ దగ్గర ఆడించినప్పుడే వాళ్లకు అంతర్జాతీయ క్రికెట్ ఎలా తట్టుకోవాలి, ఎలా ఆడాలి అన్న విషయాల్లో ఎక్స్పీరియన్స్ వస్తుంది.
అజిత్ అగర్కర్ రీసెంట్గా సెలక్షన్ కమిటీ చైర్మన్ గా బాధ్యతలను చేపట్టారు. కాబట్టి ఇక నుంచి అయినా జట్టు ఎంపికల విషయంలో కాస్త మార్పు ఉంటుంది అని తాను భావిస్తున్నట్లు సన్నీ పేర్కొన్నారు. అయితే సన్నీ మాటల్లో నిజం ఉంది అనేది క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయం. క్రికెట్ టీం లో ఉన్న ప్లేయర్స్ అందరూ టీం కి ముఖ్యం. క్రికెట్ అనేది కేవలం ఒకళ్ళిద్దరూ ఆడితే గెలుస్తాము అనుకునే ఆట కాదు కాబట్టి ప్రతి ప్లేయర్ సిద్ధంగా ఉండాలి. సీనియర్స్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం వల్ల జూనియర్స్ కు ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది లేకుండా పోతుంది. ఎక్కువ నీడ విస్తరిస్తే చెట్టు కూడా మొలవదు అంటారు.. మరి సీనియర్ల నీడ పెరిగే కొద్దీ జూనియర్లో ఎదుగుదల అంతంతమాత్రంగానే మిగిలిపోతుంది. ఇది టీమిండియా భవిష్యత్తుకే మంచిది కాదు.. ఇకనైనా సెలక్షన్ కమిటీ ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని వ్యవహరిస్తే బాగుంటుంది.