టీవీలకు అతుక్కుపోండి: ఐపీఎల్‌లో నేడు హోరాహోరీ పోరు

ఇండియన్‌ ప్రీమియర్‌‌ లీగ్‌ (ఐపీఎల్‌) 2020 ఉత్సాహంగా సాగుతోంది. రోజురోజు జరుగుతున్న మ్యాచ్‌లు ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. చివరికి ఏ టీం విజయం సాధిస్తుందో తెలియకుండా ఉత్కంఠగా సాగుతున్నాయి. ఆదివారం రెండు కీలక మ్యాచ్‌లు జరగబోతున్నాయి. మరికొద్ది గంటల్లో మన హైదరాబాద్ కు చెందిన సన్‌రైజర్స్, రాజస్థాన్ మధ్య మ్యాచ్ ప్రారంభం కానుంది. శనివారం జరిగిన రెండు మ్యాచ్‌ల్లో.. పంజాబ్‌పై కోల్‌కతా, చెన్నైపై బెంగళూరు విజయం సాధించాయి. దీంతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉండే సన్‌రైజర్స్ […]

Written By: NARESH, Updated On : October 11, 2020 2:21 pm
Follow us on

ఇండియన్‌ ప్రీమియర్‌‌ లీగ్‌ (ఐపీఎల్‌) 2020 ఉత్సాహంగా సాగుతోంది. రోజురోజు జరుగుతున్న మ్యాచ్‌లు ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. చివరికి ఏ టీం విజయం సాధిస్తుందో తెలియకుండా ఉత్కంఠగా సాగుతున్నాయి.

ఆదివారం రెండు కీలక మ్యాచ్‌లు జరగబోతున్నాయి. మరికొద్ది గంటల్లో మన హైదరాబాద్ కు చెందిన సన్‌రైజర్స్, రాజస్థాన్ మధ్య మ్యాచ్ ప్రారంభం కానుంది. శనివారం జరిగిన రెండు మ్యాచ్‌ల్లో.. పంజాబ్‌పై కోల్‌కతా, చెన్నైపై బెంగళూరు విజయం సాధించాయి. దీంతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉండే సన్‌రైజర్స్ ఐదో స్థానానికి పడిపోయింది.

Also Read: మహేంద్ర సింగ్ ధోనీ ఖాతాలో మరో రికార్డు

ఆరు మ్యాచ్‌ల్లో ఐదు విజయాలు సాధించిన ఢిల్లీ క్యాపిటల్స్ 10 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. 8 పాయింట్ల చొప్పున సాధించాయి. కానీ మెరుగైన రన్ రేట్ కారణంగా ముంబై రెండో స్థానంలో, కోల్‌కతా మూడో స్థానంలో ఉన్నాయి.

ఆదివారం జరిగే మ్యాచ్‌లో ఢిల్లీపై ముంబై ఘన విజయం సాధిస్తే.. రన్ రేట్ ఆధారంగా పాయింట్ల పట్టికలో తొలి స్థానానికి చేరుకుంటుంది. ఒకవేళ ఢిల్లీ గెలిస్తే మాత్రం తన స్థానాన్ని మరింత పదిలం చేసుకుంటుంది. రాజస్థాన్ రాయల్స్‌పై సన్‌రైజర్స్ గెలిస్తే.. పాయింట్ల పట్టికలో తిరిగి మూడోస్థానాన్ని సొంతం చేసుకుంటుంది. ప్రస్తుతానికి కోల్‌కతా, బెంగళూరు కంటే ఆరెంజ్ ఆర్మీకే రన్ రేట్ మెరుగ్గా ఉంది. ఒకవేళ రాజస్థాన్ విజయం సాధిస్తే మాత్రం.. చెన్నైను వెనక్కి నెట్టి ఆరోస్థానానికి చేరుకుంటుంది.

Also Read: ఐపీఎల్‌లో ఢిల్లీ జోరు.. టాప్‌ ప్లేస్‌ సాధించిన జట్టు

ఇక ఆటగాళ్ల పర్సనల్‌ స్కోర్‌‌ విషయానికి వస్తే.. 387 రన్స్ చేసిన కేఎల్ రాహుల్ ఆరెంజ్ క్యాప్ హోల్డర్‌‌గా ఉన్నాడు. మయాంక్ అగర్వాల్ (337), డుప్లెసిస్ (307), బెయిర్‌స్టో (241), వార్నర్ (227), కోహ్లి (223) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఢిల్లీ బౌలర్ కగిసో రబాడ 15 వికెట్లతో పర్పుల్ క్యాప్ హోల్డర్‌గా ఉండగా.. జస్‌ప్రీత్ బుమ్రా (11), బౌల్ట్ (10), షమీ (10) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఇంకా మున్ముందు ఈ రికార్డులు ఎవరి సొంతం కానున్నాయో ఆసక్తిగా ఉంది.