https://oktelugu.com/

హాట్ టాపిక్: కేటీఆర్‌‌తో ప్రశాంత్‌ కిషోర్‌‌ భేటీ అందుకేనా?

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌‌రావు చూపు మరోసారి దేశ రాజకీయాలపై పడిందా..? కేంద్రంలోని బీజేపీ సర్కార్‌‌ మీద వస్తున్న వ్యతిరేకతను క్యాచ్ చేసుకోవాలని చూస్తున్నారా..? ఇప్పటికే కేంద్రంతో ఢీకొంటున్న కేసీఆర్‌‌.. మరింత దూకుడు పెంచాలని చూస్తున్నారా..? బీజేపీ వైఫల్యాలను ప్రజల్లోకి మరింత తీసుకెళ్లాలని ప్లాన్‌ చేశారా..? ఇప్పుడు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌‌ కేటీఆర్‌‌తో భేటీ కేసీఆర్‌‌కు కలిసిరానుందా..? Also Read: రూల్స్ అంటే రూల్సే.. కేసీఆర్‌‌ ఆస్తులు సైతం నమోదు అయితే.. ఈ విషయంలో ఎన్నికల […]

Written By:
  • NARESH
  • , Updated On : October 11, 2020 / 02:01 PM IST
    Follow us on

    తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌‌రావు చూపు మరోసారి దేశ రాజకీయాలపై పడిందా..? కేంద్రంలోని బీజేపీ సర్కార్‌‌ మీద వస్తున్న వ్యతిరేకతను క్యాచ్ చేసుకోవాలని చూస్తున్నారా..? ఇప్పటికే కేంద్రంతో ఢీకొంటున్న కేసీఆర్‌‌.. మరింత దూకుడు పెంచాలని చూస్తున్నారా..? బీజేపీ వైఫల్యాలను ప్రజల్లోకి మరింత తీసుకెళ్లాలని ప్లాన్‌ చేశారా..? ఇప్పుడు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌‌ కేటీఆర్‌‌తో భేటీ కేసీఆర్‌‌కు కలిసిరానుందా..?

    Also Read: రూల్స్ అంటే రూల్సే.. కేసీఆర్‌‌ ఆస్తులు సైతం నమోదు

    అయితే.. ఈ విషయంలో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌‌ కూడా పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది. బీజేపీకి వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీల వేదికను ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసి అమలుచేస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, తెలంగాణ సీఎం కేసీఆర్‌‌ తనయుడు కేటీఆర్‌‌తో సమావేశమైనట్లు తెలుస్తోంది.

    జాతీయ స్థాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేసే దిశగా ప్రశాంత్‌ కిషోర్‌‌ ముందుకు సాగుతున్నారట. అందుకే కేటీఆర్‌‌ను మీట్‌ అయినట్లు తెలుస్తోంది. బీజేపీ, కాంగ్రెస్‌లకు వ్యతిరేకంగా జాతీయ రాజకీయాల్లో తాను కీలక పాత్ర పోషించేందుకు సిద్ధంగా ఉన్నానంటూ కేసీఆర్‌‌ ఎప్పటినుంచో చెప్పుకొస్తున్నారు. అంతకుముందే ఆయన మమతా బెనర్జీ, స్టాలిన్‌, కుమార స్వామి వంటి నేతలనూ కలిశారు. వివిధ కారణాలతో ఆయన తన ప్రయత్నాలను మానుకున్నారు.

    ఇప్పుడు తెలంగాణలో బీజేపీ రోజురోజుకూ పుంజుకుంటోంది. దీంతో బీజేపీనే ప్రధాన ప్రత్యర్థిక భావిస్తోంది అధికార టీఆర్‌‌ఎస్‌ పార్టీ. కాంగ్రెస్‌ పని ఖతమైందని అంచనాకు వచ్చింది. ఈ పరిస్థితుల్లో తన వేదికలో లేదా కూటమిలో టీఆర్‌‌ఎస్‌ కూడా భాగస్వామిని చేయడానికి ప్రశాంత్‌ కిషోర్‌‌ రిషితో కేటీఆర్‌‌ఎస్‌ కలిసినట్లుగా వినిపిస్తోంది.

    ఈ రిషి ప్రశాంత్‌ కిషోర్‌‌ జట్టులోని కీలక సభ్యుడు. రిషి పెళ్లి రిసెప్షన్‌కు వైఎస్‌ జగన్‌ తన సతీమణి భారతితో కలిసి హాజరయ్యారు. దీంతో ప్రశాంత్‌ కిషోర్‌‌తో జగన్‌ బంధం కొనసాగుతూనే ఉంది. మరోవైపు జగన్‌ను చూస్తే అటు కేంద్రంలోని బీజేపీతో సఖ్యతతో ఉంటున్నారు. అలాగనీ ప్రశాంత్‌ కిషోర్‌‌ను వదులుకునేందుకు సిద్ధంగా లేరనేది తెలుస్తోంది. గత ఎన్నికల్లో జగన్‌కు ప్రశాంత్‌ కిషోర్‌‌ ఎన్నికల వ్యూహకర్తగా పనిచేసి అధికారంలోకి రావడానికి హెల్ప్‌ చేశారు కాబట్టి.

    Also Read: తెలంగాణ కేబినెట్‌లో కీలక నిర్ణయాలు

    ప్రశాంత్‌ కిషోర్‌‌ దేశవ్యాప్తంగా పలు బీజేపీ వ్యతిరేక పార్టీలతో కలిసి పనిచేస్తున్నారు. తమిళనాడులో స్టాలిన్‌ నాయకత్వంలోని డీఎంకే, మహారాష్ట్రలో ముఖ్యమంత్రి ఉద్దవ్‌ థాకరే నేతృత్వంలోని శివసేన, పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ నాయకత్వంలోని టీఎంసీ, ఢిల్లీలో అరవింద్‌ కేజ్రీవల్‌కు చెందిన ఆమ్‌ ఆద్మీ పార్టీలకు ప్రశాంత్‌ కిషోర్‌‌ వ్యూహకర్తగా పనిచేస్తున్నారు. కర్ణాటకలో కుమారస్వామిని కూడా ప్రశాంత్‌ కిషోర్‌‌ తన కూటమిలో చేర్చుకునే అవకాశం ఉంది. ప్రశాంత్‌ కిషోర్‌‌ జట్టు మాజీ సభ్యుడు రాబిన్‌ ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబుతో కలిసి పనిచేస్తున్నారు. కేసీఆర్‌‌, చంద్రబాబు చెప్తే కుమారస్వామి వినే అవకాశాలు చాలా ఉన్నాయి.అందుకే.. జాతీయ స్థాయిలో బలమైన సమాఖ్యను ఏర్పాటు చేయడానికి తగిన ప్రణాళికను సిద్ధం చేసి అమలు చేస్తున్నట్లు అర్థమవుతోంది.