https://oktelugu.com/

భారత్ వరుస క్షిపణుల ప్రయోగాలు.. యుద్ధానికి సిద్ధమా..?

చైనా సరిహద్దుల్లోని లడఖ్‌ ప్రాంతంలో ఉద్రిక్తతల దృష్ట్యా భారత్‌ వరుసగా క్షిపణి ప్రయోగాలు చేపట్టడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమవుతోంది. చైనాతో నిత్యం తగువులాట కారణంగా ఈ చర్యలను పూనుకుంది. పరిస్థితి చేయిదాటుతుండడంతో భారత్‌ తన శక్తి సామర్థ్యాలు, ఆయుధాలను పరీక్షించుకుంటోంది.  సామర్థ్యం ఇదేనంటూ క్షిపణి ప్రయోగాలను చేస్తోంది. 35రోజుల్లో భారత్‌ 10 క్షిపణి  ప్రయోగాలను చేపట్టడం చూస్తే యుద్ధ వాతావరణం నెలకొననుందా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. Also Read: చీఫ్ జస్టిస్ కు జగన్ లేఖ.. జాతీయ స్థాయిలో […]

Written By:
  • NARESH
  • , Updated On : October 11, 2020 / 02:14 PM IST
    Follow us on

    చైనా సరిహద్దుల్లోని లడఖ్‌ ప్రాంతంలో ఉద్రిక్తతల దృష్ట్యా భారత్‌ వరుసగా క్షిపణి ప్రయోగాలు చేపట్టడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమవుతోంది. చైనాతో నిత్యం తగువులాట కారణంగా ఈ చర్యలను పూనుకుంది. పరిస్థితి చేయిదాటుతుండడంతో భారత్‌ తన శక్తి సామర్థ్యాలు, ఆయుధాలను పరీక్షించుకుంటోంది.  సామర్థ్యం ఇదేనంటూ క్షిపణి ప్రయోగాలను చేస్తోంది. 35రోజుల్లో భారత్‌ 10 క్షిపణి  ప్రయోగాలను చేపట్టడం చూస్తే యుద్ధ వాతావరణం నెలకొననుందా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

    Also Read: చీఫ్ జస్టిస్ కు జగన్ లేఖ.. జాతీయ స్థాయిలో దుమారం!

    సరిహద్దుల్లో 60 వేల మంది సైనికులను చైనా మోహరించిందని అమెరికా వెల్లడించడంతో భారత్‌ అప్రమత్తమైంది. డీఆర్‌డీవో ఆధ్వర్యంలో గతనెలలో 4 రోజులకో క్షిపణి చొప్పున ప్రయోగం చేపట్టింది. ఆ తరువాత 400  కిలోమీటర్ల దూరంలో లక్ష్యాలను సునాయాసంగా చేరుకోగల బ్రహ్మాస్‌ సూపర్‌ సోనిక్‌ క్రూయిజ్‌ క్షిపణి, అణు సామర్థ్యం కలిగిన శౌర్య సూపర్‌ సోనిక్‌ క్షిపణి, సబ్‌మెరైన్లను ధ్వంసం చేయగల క్షిపణి సహాయక టోర్పెడో, లేజర్‌ గైడెడ్‌ యాంటీ టాంక్‌ క్షిపణి వంటి కీలయ ప్రయోగాలను విజయవంతంగా చేసింది.

    అణు సామర్థ్యంతో 300 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగల బాలిస్టిక్‌ క్షిపణి పృథ్వి-2 ప్రయోగాన్ని రాత్రివేళల్లో నిర్వహించిది. ఇప్పటికే సరిహద్దు వెంబడి నిర్భయ్‌ క్షిపణులు సిద్ధంగా ఉన్నాయి త్వరలో శౌర్య క్షిపణులు కూడా బరిలోకి దిగుతున్నాయి. ఇక మీడియం అల్టిట్యూట్‌ లాంగ్‌ ఎండ్యూరెన్స్‌ డ్రోన్‌ రుస్తోం-2ను కర్ణాటకలోని చిత్రదుర్గలో పరీక్షించింది.

    Also Read: ట్రంప్ కోసం ప్రత్యేక కరోనా ఔషధం.. దీంతో త్వరగా కోలుకున్నాడు

    పూర్తిస్థాయి స్వదేశీ పరిజ్ఞానంతో చేపడుతున్న ‘రుద్రమ్‌’ను సైతం భారత్‌ పరీక్షించింది. ఈ క్షిపణిని సుఖోయ్‌-30 ఎంకేఐ యుద్ధ విమానం ద్వారా ప్రయోగించింది. ఇజ్రాయిల్‌ నుంచి కొనుగోలు చేసిన హెరోన్‌ డ్రోన్లను సాయుధ డ్రోన్లుగా మార్చేందుకు ఇజ్రాయెల్‌ ఏరోస్పేస్‌ సంస్థ (ఐఏఐ) తో భారత్‌ చర్చలు జరుపుతోంది. చైనా ఆగడాలను తిప్పికొట్టేందుకు భారత్‌ ఈ విధంగా రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేస్తోంది.