T20 World Cup 2024: టి20 వరల్డ్ కప్ బ్రాడ్ కాస్టింగ్ లో స్టార్ స్పోర్ట్స్ కొత్త ప్రయోగం.. వాళ్లకు కూడా క్రికెట్ మజా

గత ఏడాది వన్డే వరల్డ్ కప్ ప్రసార హక్కులనూ స్టార్ స్పోర్ట్స్ దక్కించుకుంది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఉచితంగా స్ట్రిమింగ్ చేసింది. అప్పుడు వర్టికల్ ఫీడ్ ను తిర పైకి తీసుకొచ్చింది.

Written By: Anabothula Bhaskar, Updated On : June 1, 2024 9:15 am

T20 World Cup 2024

Follow us on

T20 World Cup 2024: క్రికెట్ అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్న టి20 వరల్డ్ కప్ పండగ రానే వచ్చింది.. శనివారం డల్లాస్ వేదికగా అమెరికా, కెనడా జట్ల మధ్య తొలి మ్యాచ్ జరగనుంది.. ఈ మెగా టోర్నీలో పాల్గొనేందుకు టీమిండియా ఇప్పటికే అమెరికా వెళ్ళిపోయింది. అక్కడి మైదానాలలో ప్రాక్టీస్ చేస్తోంది. రోహిత్ ఆధ్వర్యంలోని టీమిండియా జూన్ 5న న్యూయార్క్ వేదికగా ఐర్లాండ్ జట్టుతో తన తొలి మ్యాచ్ ఆడనుంది. ఆ తర్వాత జూన్ 9న పాకిస్తాన్, టీమిండియా కీలక పోరు జరగనుంది.. ఈ మ్యాచ్ కోసం ప్రపంచ వ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గత సీజన్లో జరిగిన పోటీలో పాకిస్తాన్ పై భారత్ గెలిచింది. ఉత్కంఠ గా సాగిన ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ తన బ్యాటింగ్ పరాక్రమాన్ని ప్రదర్శించాడు.

ఇక ఈ టి20 వరల్డ్ కప్ కు సంబంధించి ఇండియాలో ప్రసార హక్కులను స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్ దక్కించుకుంది. స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్ ఛానల్స్ తో పాటు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లోనూ టి20 క్రికెట్ మ్యాచ్ లు ప్రత్యక్ష ప్రసారం అవుతాయి.. క్రికెట్ కు మరింత చరిష్మా కల్పించేందుకు స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్ ఈసారి కూడా హిందీ, తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో కామెంట్రీ సాలభ్యాన్ని తెరపైకి తీసుకువచ్చింది. ఈసారి ఆడియో డిస్క్రిప్టివ్ కామెంట్రీ అనే విధానాన్ని తెరపైకి తెచ్చింది. దీంతోపాటు ఇండియన్ సైన్ లాంగ్వేజ్ లోనూ ఫీడ్ బ్యాక్ అందిస్తుంది. దీనివల్ల వినికిడి లోపం ఉన్నవారు కూడా క్రికెట్ మ్యాచ్ ను సులభంగా అర్థం చేసుకోవచ్చు. ఈ విధానం లేకపోవడం వల్ల గతంలో వినికిడి లోపం ఉన్నవారికి క్రికెట్ కామెంట్రీ అర్థమయ్యేది కాదు. అయితే వారి బాధను అర్థం చేసుకున్న స్టార్ స్పోర్ట్స్ యాజమాన్యం ఈసారి ఈ సౌలభ్యాన్ని తెరపైకి తీసుకువచ్చింది.

ఇక గత ఏడాది వన్డే వరల్డ్ కప్ ప్రసార హక్కులనూ స్టార్ స్పోర్ట్స్ దక్కించుకుంది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఉచితంగా స్ట్రిమింగ్ చేసింది. అప్పుడు వర్టికల్ ఫీడ్ ను తిర పైకి తీసుకొచ్చింది. ఆ ఫార్మాట్లో మ్యాచ్లను ప్రసారం చేసింది. దీనివల్ల అభిమానులకు మరింత స్పష్టమైన మొబైల్ వ్యూ అనుభవం లభించింది. ఈసారి కూడా వర్టికల్ ఫీడ్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది.. ఫలితంగా ప్రేక్షకులు మరింత సులభంగా, స్పష్టంగా మొబైల్ ఫోన్ వీక్షణ అనుభవాన్ని పొందేందుకు అవకాశం ఉంటుంది.. క్రికెట్ కు ఉన్న ఆదరణ.. ఇతర సంస్థల నుంచి ఎదురవుతున్న పోటీని దృష్టిలో పెట్టుకొని.. స్టార్ స్పోర్ట్స్, డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో టి20 వరల్డ్ కప్ మ్యాచ్లను ఉచితంగా చూసే అవకాశం కల్పిస్తున్నట్టు బ్రాడ్ కాస్టర్లు చెబుతున్నారు.