Shikhar Dhawan son Zorawar
Shikhar Dhawan: శిఖర్ ధావన్ ఆస్ట్రేలియాలో స్థిరపడిన భారతీయ మూలాలు ఉన్న బాక్సర్ ఆయేషాముఖర్జీ(aayesha Mukherjee) ని వివాహం చేసుకున్నాడు. 2012లో వీరిద్దరి వివాహం జరిగింది. వివాహానికి అంటే ముందు ఆయేషాను శిఖర్ ధావన్ ప్రేమించాడు. శిఖర్ కంటే ముందే ఆయేషా కు వివాహం జరిగింది. ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. అయితే హర్భజన్ ద్వారా శిఖర్ కు ఆయేషా పరిచయమైంది. అది కాస్త ప్రేమగా మారింది. మొదట్లో ఆయేషా తో ప్రేమను దావన్ తరపు కుటుంబ సభ్యులు తిరస్కరించారు. ఆ తర్వాత పెళ్లికి ఒప్పుకున్నారు. శిఖర్ తో వివాహం జరిగిన తర్వాత ఆయేషా గర్బం దాల్చింది. ఆమె జొరావర్ కు జన్మనిచ్చింది. అయితే మొదట్లో దావన్, ఆయేషా మధ్య సఖ్యత బాగానే ఉండేది.. వారిద్దరు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవారు. తమకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పంచుకునేవారు. అయితే ఇద్దరి మధ్య ఏం జరిగిందో తెలియదు కానీ 2021 నుంచి వారిద్దరు విడిగా ఉండడం మొదలుపెట్టారు. సోషల్ మీడియాలో ఒకరిని ఒకరు అన్ ఫాలో చేసుకున్నారు. ఆ తర్వాత ఏడాదికి తాము విడిపోతున్నామని ఆయేషాముఖర్జీ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. దీంతో వీరిద్దరూ విడాకులు తీసుకున్నారని అందరూ నిర్ధారించుకున్నారు.
వేధిస్తోందని విడాకులు
విడాకుల కంటే ముందు శిఖర్ ఆయేషా మీద సంచలన ఆరోపణలు చేశాడు. తనను ఆమె మానసికంగా వేధిస్తోందని.. తీవ్రంగా ఇబ్బంది పడుతోందని ఆరోపించాడు. ఆమె వేధింపులు తట్టుకోలేక విడాకులు ఇస్తున్నట్టు వెల్లడించాడు. కోర్టు తీర్పు ప్రకారం జొరావర్ ఆస్ట్రేలియాలోని ఆయేషా ముఖర్జీ వద్ద ఉంటున్నాడు. అయితే జొరావర్ తో మాట్లాడక ఏడాది అవుతోందని.. చూడక రెండు సంవత్సరాలు అవుతుందని శిఖర్ ధావన్ భావోద్వేగానికి గురయ్యాడు . ఆ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నాడు. ” నా కొడుకును చూడక రెండు సంవత్సరాలు అయింది. మాట్లాడక ఏడాది గడిచింది. నా నెంబర్ బ్లాక్ లో పెట్టారు. అతడిని నేను చాలా మిస్ అవుతున్నాను. ఎప్పటికైనా అతడిని కలుస్తాననే నమ్మకం నాకుంది. తండ్రిగా నా ప్రేమను అతడికి పంచాలని ఉంది. నా కుమారుడు నిత్యం కలలోకి వస్తున్నాడు. అతడిని తలుచుకొనప్పుడల్లా గుండె బరువెక్కుతోంది. గతంలో మా నాన్నను మళ్లీ పెళ్లి చేసుకోనా అని అడిగాను. దానికి అతడు నీ తొలి పెళ్లికే హెల్మెట్ ధరింపజేసి ఆ క్రతువు నిర్వహించాం ఇప్పుడు మళ్లీ పెళ్లా అని మా నాన్న అన్నాడని” శిఖర్ వ్యాఖ్యానించాడు.