https://oktelugu.com/

Odi World Cup 2023: ఇండియాతో నాడు గ్రేమ్ స్మిత్ చేసింది.. నేడు షకీబుల్ చేయనిది.. ఇద్దరి మధ్య తేడా అదే…

నిన్న జరిగిన శ్రీలంక, బంగ్లాదేశ్ మ్యాచ్ కి సంబంధించి మాథ్యూస్ ఔట్ అయిన దాని మీదనే ఇప్పుడు క్రికెట్ అభిమానులు అందరు స్పందించడం జరుగుతుంది.

Written By:
  • Gopi
  • , Updated On : November 7, 2023 / 08:54 AM IST

    Odi World Cup 2023

    Follow us on

    Odi World Cup 2023: వరల్డ్ కప్ లో భాగంగా ప్రస్తుతం ఇండియన్ టీం తనదైన రీతిలో మ్యాచ్ లను ఆడుతూ ముందుకు దూసుకెళ్తుంది.ఇక ఇలాంటి క్రమంలో ఇండియన్ టీమ్ సెమీ ఫైనల్ లో తనతో ఆడే టీం ఏదో తెలుసుకోవడానికి ఆరాట పడుతుంది. ఎందుకంటే మొదటి సెమీ ఫైనల్ మ్యాచ్ గా ఇండియా టీమ్ కి నాలుగో ప్లేస్ లో సెమీఫైనల్ కి క్వాలిఫై అయ్యే టీమ్ కి మధ్య సెమి ఫైనల్ మ్యాచ్ అనేది జరుగుతుంది.

    ఇక ఇదిలా ఉంటే నిన్న జరిగిన శ్రీలంక, బంగ్లాదేశ్ మ్యాచ్ కి సంబంధించి మాథ్యూస్ ఔట్ అయిన దాని మీదనే ఇప్పుడు క్రికెట్ అభిమానులు అందరు స్పందించడం జరుగుతుంది. ఇక ఈ విషయంలో ఎవరిది తప్పు అనే విషయం పక్కన పెడితే ఉన్న రూల్స్ ని సక్రమంగా ప్లేయర్లు వాడుకున్నారు అనే విషయం అయితే మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది.

    ఇక గతంలో ఇలాంటి సిచువేషన్ ఇండియన్ టీం కి ఒకసారి ఎదురైంది. అదేప్పుడు అంటే 2006 వ సంవత్సరంలో ఇండియా సౌతాఫ్రికా టీం తో టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న క్రమంలో సచిన్ టెండూల్కర్ నెంబర్ ఫోర్ లో బ్యాటింగ్ కి రావాల్సింది.అయితే ఆయన వికెట్లు ఉన్నాయి కదా నిదానంగా ఆడతారులే వాళ్లే అనుకొని పైన డ్రెస్సింగ్ రూమ్ లోనే ఉన్నాడు.ఇక వెంట వెంటనే రెండు వికెట్లు కోల్పోవడంతో సచిన్ టెండూల్కర్ క్రీజ్ లోకి రావాల్సిన అవసరం ఏర్పడింది అయితే అప్పటికే సచిన్ కి కొంత ఇబ్బంది ఎదురవ్వడం తో ఆయన క్రీజ్ లోకి రాలేకపోయాడు. దాదాపు 15 నిమిషాల పైన అయింది.ఇక అప్పుడు నిదానంగా క్రీజ్ లోకి సౌరవ్ గంగూలీ రావడం జరిగింది.

    ఇక దాంతో సౌతాఫ్రికా కెప్టెన్ అయిన గ్రీమ్ స్మిత్ కూడా జరిగిన విషయం ఏంటని తెలుసుకుని టైమ్డ్ అవుట్ కి అప్లై చేయాలేదు, కానీ ఈ విషయంలో ఆయన టైమ్డ్ ఔట్ కింద అప్పిల్ చేయలేకపోయాడు ఇక తర్వాత ఇప్పుడు మాథ్యూస్ టైమ్డ్ అవుట్ కింద ఒక ప్లేయర్ అవుట్ అవ్వడం అనేది ఇదే మొదటిసారి కావడం నిజంగా మాథ్యూస్ బ్యాడ్ లక్ అనే చెప్పుకోవాలి. అయితే అప్పుడు గ్రేమ్ స్మిత్ చూపించిన స్పిరిట్ ఆఫ్ ది గేమ్ ఈ సిచువేషన్ లో షకిబుల్ హాసన్ చూపించలేదు అని చాలా రకాల విమర్శలని ఎదుర్కొంటున్నాడు.

    ఇలాంటి సిచువేషన్ లో మాథ్యూస్ ని ఆడనివ్వాల్సింది కానీ తనని ఆడనివ్వకుండా టైమ్డ్ ఔట్ కింద ఔట్ చేసి పంపించారు.అయితే అందరూ స్పిరిట్ ఆఫ్ ది గేమ్ ని చూపించాల్సిన పనిలేదు అయితే మ్యాచ్ లో స్పీరిట్ అఫ్ ది గేమ్ చూపిస్తేనే మంచి వాడు లేకపోతే చెడ్డవాడు అని ఏమీ లేదు ఒక మ్యాచ్ గెలవడానికి కెప్టెన్ తీసుకునే నిర్ణయాలు అవతలి టీమ్ ని భారీ దెబ్బ కొట్టిన కూడా మన టీం గెలుపుకి దోహదపడుతుందంటే అలాంటివి చేయడమే కరెక్ట్ అని మరికొంత మంది మాజీ క్రికెటర్లు… అభిప్రాయ పడుతున్నారు…