Salt: శరీరంలోని అవయవాలు, జీర్ణక్రియ సక్రమంగా ఉండడానికి లవణం అవసరం. దీనిని సోడియం క్లోరైడ్, అయోడిన్ రూపంలో తీసుకోవాల్సి ఉంటుంది. లవణం శాతం తక్కువైనా.. ఎక్కువైనా.. ప్రమాదమే సమతుల్యం ఉండేలా చూస్తుకోవాలి. ఇందుకోసం కొన్ని ఆహారపు అలవాట్లు మార్చుకోవాల్సి ఉంటుంది. కొందరు ఆహరంలో ఉప్పు తక్కువగా ఉందని అదనంగా వేసుకుంటారు. రుచి లేదనే ఉద్దేశంతో పచ్చి ఉప్పును వాడుతారు. ఇలా అదనంగా ఉప్పు వేసుకోవడం వల్ల తాత్కాలికంగా రుచికరమైన ఆహారం అందుతుంది. కానీ ఆ తరువాత అనేక దీర్ఘకాలిక వ్యాధులు వస్తాయని అమెరికా హెల్త్ యూనివర్సిటీ కి చెందిన లు నిర్వహించిన పరిశోధనల్లో తేలింది. వారు నిర్వహించిన అధ్యయనంలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆ వివరాల్లోకి వెళితే..
అమెరికాలోని టులానే యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ట్రాపికల్ మెడిసిన్ వారు ఉప్పు తినేవారిపై తాజాగా పరిశోధణ నిర్వహించరు. మొత్తం 4 లక్షల మందిని వీరి పరిశోధనలకు ఉపయోగించుకుని వారి ఆహారపు అలవాట్లు, వారికి వచ్చే వ్యాధులను గమనించారు. ఇందులో భాగంగా బ్రిటన్ నేషనల్ హెల్త్ సర్వీస్ లో నమోదైన ఆరోగ్య వివరాలను విశ్లేషించారు. మొత్తంగా వీరి ఒక నిర్ణయానికి వచ్చారు.
ఆహారంలో అదనంగా ఉప్పు వేసుకోని వారిలో 13 శాతం, అప్పుడప్పుడు ఉప్పు వేసుకోనే వారిలో 20 శాతం, తరుచూ అదనంగా ఉప్పు వేసుకునేవారిలో 39 శాతం మధుమేహం ఉన్నట్లు గుర్తించారు. చాలా మందికి జీవనశైలి, వారసత్వం తదితర కారణాతో మధుమేహం వస్తుంది. కానీ తరుచూ ఇలా పచ్చి ఉప్పును వాడడం వల్ల కూడా డయాబెటిస్ బారిన పడే ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయని తేల్చారు. అందువల్ల పచ్చి ఉప్పు వాడడం తగ్గించుకోవడం చాలా మంచిదని అంటున్నారు.
ఒకసారి కూరలో ఉప్పు వాడిన తరువాత అదనంగా ఉప్పు వాడితేనే ఈ సమస్యలు వస్తాయని పరిశోధకులు చెబుతున్నారు. అందువల్ల అదనంగా ఉప్పువేసుకోవడం మానేయండి. కూరలో ఉప్ప ఒకసారి తగ్గినంత మాత్రన ఎలాంటి నష్టం ఉండదు. మరోసారి సరి చేసుకుంటే సరిపోతుంది. కానీ పచ్చి ఉప్పువాడడం వల్ల మధుమేహం త్వరగా సక్రమించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పరిశోధకులు వెల్లడించారు.