Jeffrey vandersay : తొమ్మిది ఏళ్ల తర్వాత మైదానంలోకి.. ఆరు వికెట్లు పడగొట్టాడు.. టీమిండియానే హడలెత్తించిన శ్రీలంక బౌలర్ వాండర్సే ఎవరు? బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే?

వాండర్సే మాయాజాలానికి టీమిండియాలో ఆరుగురు బ్యాటర్లు బలయ్యారు. రోహిత్ శర్మ, గిల్, శివం దుబే, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ వంటి కీలక ఆటగాళ్లు వాండర్సే బౌలింగ్ ధాటికి తట్టుకోలేక పెవిలియన్ చేరుకున్నారు. తొలి వికెట్ కు రోహిత్ - గిల్ 97 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ దశలో భారత్ విజయం వైపు పరుగులు తీస్తున్నట్లు కనిపించింది.

Written By: NARESH, Updated On : August 5, 2024 1:29 pm
Follow us on

Jeffrey vandersay : టీమిండియా ప్రస్తుతం శ్రీలంకలో పర్యటిస్తోంది. టి20 సిరీస్ ను 3-0 తో వైట్ వాష్ చేసింది. ఇదే ఊపులో మూడు వన్డేల సిరీస్ కూడా దక్కించుకోవాలని భావించింది.. దుర్భేద్యమైన టీం ఉన్నప్పటికీ టీమిండియా కు సిరీస్ ద కే అవకాశం కనిపించడం లేదు. తొలి వన్డే అర్ష్ దీప్ సింగ్ వల్ల టై అయింది. రెండవ వన్డే మిడిల్ ఆర్డర్ వైఫల్యం, బౌలర్ల ఎక్స్ ట్రాలు, శ్రీలంక బౌలర్ వాండర్సే మాయాజాలం వల్ల తుడిచిపెట్టుకుపోయింది. టీమిండియా శ్రీలంకలో వన్డే సిరీస్ నెగ్గి 27 సంవత్సరాలు అవుతోంది. అయితే ఈసారి మెరుగ్గా ఆడి సిరీస్ దక్కించుకోవాలనే భారత్ ఆశలను వాండర్సే ఆడియాసలు చేశాడు. శ్రీలంక విధించిన 241 రన్ టార్గెట్ తో బరిలోకి దిగిన టీమిండియా.. ఒకానొక దశలో 97-0 తో పటిష్టంగా ఉంది. ఎప్పుడైతే బంతి వాండర్సే చేతుల్లోకి వెళ్లిందో అప్పుడే మ్యాచ్ కూడా శ్రీలంక వైపు మొగ్గింది.

వాండర్సే మాయాజాలానికి టీమిండియాలో ఆరుగురు బ్యాటర్లు బలయ్యారు. రోహిత్ శర్మ, గిల్, శివం దుబే, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ వంటి కీలక ఆటగాళ్లు వాండర్సే బౌలింగ్ ధాటికి తట్టుకోలేక పెవిలియన్ చేరుకున్నారు. తొలి వికెట్ కు రోహిత్ – గిల్ 97 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ దశలో భారత్ విజయం వైపు పరుగులు తీస్తున్నట్లు కనిపించింది.. ఈ క్రమంలో శ్రీలంక కెప్టెన్ వాండర్సే కు అవకాశం ఇచ్చాడు. 2015 తర్వాత రెండవ వన్డే ఆడేందుకు 9 సంవత్సరాల విరామం తీసుకున్న వాండర్సే.. తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. అద్భుతమైన బంతులు వేస్తూ టీమ్ ఇండియా ఆటగాళ్లను ముప్పు తిప్పలు పెట్టాడు. పోయిందనుకున్న మ్యాచ్ ను తిరిగి శ్రీలంక చేతుల్లోకి తీసుకొచ్చాడు.. మరోవైపు శ్రీలంక బౌలర్ అసలంక కూడా అద్భుతంగా బౌలింగ్ చేసి మూడు కీలకమైన వికెట్లు పడగొట్టాడు. దీంతో భారత్ 208 పరుగులకే కుప్ప కూలింది. 32 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.

కాగా, ఈ మ్యాచ్ లో 10 ఓవర్ల పాటు బౌలింగ్ వేసిన వాండర్సే.. 33 పరుగులు ఇచ్చి ఆరు వికెట్లు పడగొట్టాడు. విలక్షణమైన లెగ్ స్పిన్ బౌలింగ్ వేసి.. భారత బ్యాటర్లను తీవ్రంగా ఇబ్బంది పెట్టాడు.. వాస్తవానికి శ్రీలంక నెంబర్ వన్ స్పిన్నర్ హసరంగ ఈ మ్యాచ్ కు దూరమయ్యాడు. దీంతో వాండర్సే కు అవకాశం లభించింది. 2015లో తొలి వన్డే ఆడిన వాండర్సే.. ఆ తర్వాత తొమ్మిదేళ్లు గ్యాప్ తీసుకున్నాడు. తీరా ఇన్నాళ్లకు అవకాశం లభించడంతో.. దానిని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకున్నాడు. గట్టి కం బ్యాక్ ఇచ్చి.. సత్తా చాటాడు. ఆరు వికెట్లు పడగొట్టి.. టీమిండియా 27 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణను అలానే కొనసాగించేలా తన వంతు ప్రయత్నం చేశాడు.. వాస్తవానికి ఈ మ్యాచ్ కనుక టీమిండియా గెలిస్తే.. మూడవ మ్యాచ్ లోనూ సత్తా చాటితే.. సిరీస్ దక్కించుకునేది. తద్వారా టి20, వన్డే ట్రోఫీలను సగర్వంగా ఎగిరేసుకుపోయిన చరిత్రను తన పేరు మీద లిఖించుకునేది. టి20 సిరీస్ కోల్పోయిన శ్రీలంక.. వన్డే సిరీస్ లో ఆ తప్పు జరగకుండా ఉండేందుకు శత విధాలా ప్రయత్నించింది. తొలి వన్డేలో టీమిండియా కు విజయాన్ని దూరం చేసి.. రెండవ వన్డేలో దర్జాగా గెలిచేసి 3 వన్డేల సిరీస్ లో 1-0 లీడ్ తో కొనసాగుతోంది. ఒకవేళ మూడో వన్డేలో టీమిండియా గెలిచినప్పటికీ.. సిరీస్ దక్కించుకునే అవకాశం ఉండదు.