https://oktelugu.com/

Anantapur : డామిట్ ‘చేప’ అడ్డం తిరిగింది.. అనంతపురం నగరానికి మూడు గంటల పాటు తాగునీరు కట్!

సాధారణంగా ప్రభుత్వ మంచినీటి పథకాలు రకరకాల కారణాలతో మొరాయిస్తుంటాయి. తాగునీటి సరఫరా నిలిచిపోతుంటుంది. ఆ సమయంలో అధికారులు చేసే ప్రకటన వింతగా ఉంటుంది. అనంతపురం నగరంలో సైతం ఇలానే ప్రకటించేసరికి ప్రజలు ఆశ్చర్యానికి గురయ్యారు.

Written By:
  • Dharma
  • , Updated On : August 5, 2024 / 01:20 PM IST
    Follow us on

    Anantapur : చిన్నప్పుడు రకరకాల చేప కథలు చెబుతుంటారు పెద్దలు. చేప చేప ఎక్కడికి వెళ్లావు అన్న కదా ఎన్నిసార్లు వినుంటామో మనకే తెలుసు. అయితే అటువంటి చేప కథ ఒకటి అనంతపురంలో విస్తు గొలిపింది. ప్రజల గొంతు ఎండేలా చేసింది. వినడానికి వింతగా ఉన్నా.. ఇది మాత్రం నిజం. ఒక్క చేప అనంతపురం నగరానికి నీరు రాకుండా చేసింది. అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది ముచ్చెమటలు పడేలా చేసింది. ఏమైంది అని చూస్తే కానీ అసలు విషయం తెలియలేదు.ఓసి నీ దుంప తెగ చేప ఇంత పని చేసిందా? అని జనాలు అవాక్కయ్యేలా చేసింది. అయితే కాస్త వినోదం పంచింది ఈ ఘటన. ఇందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.అనంతపురం నగరానికి పెన్నాహోబిలం రిజర్వాయర్ నుంచి నీటి సరఫరా అవుతుంది. ఇది అనంతపురం నగరానికి 42 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అక్కడ భారీ సామర్థ్యం కలిగిన రెండు మోటార్ల ద్వారా నీటిని పంపింగ్ చేస్తుంటారు. నగరంలోని 40000 కులాయిల ద్వారా నీటిని పంపిస్తుంటారు. 24 గంటల పాటు మోటార్లు తిరిగితే కానీ అనంతపురం నగరానికి నీరు అందదు. అయితే శనివారం సాయంత్రం అందులో ఒక మోటారు మొరాయించింది. మోటర్ ఆన్ లో ఉన్నా.. మీరు మాత్రం రావడం లేదు. ఈ విషయాన్ని తాగునీటి విభాగం ఇంజనీరింగ్ అధికారులు గుర్తించారు. ఏం జరిగిందో తెలియక సతమతమయ్యారు. వెంటనే 500 హెచ్పి సామర్థ్యం మోటారుకు ఉన్న 17 పైపులను తొలగించి చూశారు. బయటకు తీసి పరిశీలించారు. అయినా సరే సమస్యను గుర్తించలేకపోయారు. దాదాపు మూడు గంటలు కష్టపడ్డారు.

    * చేప అడ్డం తిరిగింది
    అయితే మోటారు రిపేరు చేసే నిపుణులైన మెకానిక్లను రప్పించారు. చివరకు మోటారుకు నీరు అందించే పంపును విడదీశారు. అందులో ఒక చేప ఇరుక్కొని కనిపించింది. దాదాపు ఏడున్నర కిలోల బరువు ఉన్న ఈ చేప కావడంతో నీరు రావడంలేదని అధికారులు, సిబ్బంది యుద్ధ ప్రాతిపదికన మరమత్తు పనులు పూర్తి చేశారు. సోమవారం నుంచి యధాతధంగా నీటి సరఫరా ప్రారంభమవుతుందని అనంతపురం కార్పొరేషన్ అధికారులు తెలపడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.

    * మూడు గంటల పాటు యాతన
    అయితే ఒక చేప మూడు గంటలపాటు ఒక నగరానికి నీరు లేకుండా చేసిందంటే.. ఇది ఎంతగా వైరల్ వార్త అవుతుందో తెలియాలి. చేప మూలంగానే నీటి సరఫరా నిలిచిపోయిందని అధికారులు చెప్పినా చాలామంది వినలేదు. తప్పించుకునేందుకు కుంటి సాకులు చెబుతున్నారని ఎక్కువమంది భావించారు. అయితే తరువాత నిజమని తెలిసి అందరూ ఆశ్చర్యపోయారు. ఏడున్నర కిలోల చేప అడ్డం తిరిగి.. పైప్ లైన్ లలో నీటి సరఫరాను నిలిపి వేసిందంటే.. ఆ చేప ఎంత స్ట్రాంగో ఇట్టే తెలిసిపోతోంది.

    * దశాబ్దాల కిందట పైప్ లైన్
    అనంతపురం నగరానికి ఎప్పటికప్పుడు నీటి సరఫరా నిలిచిపోతోంది. దశాబ్దాల కాలం నాటి కిందట పైప్ లైన్ ఏర్పాటు చేశారు. అప్పట్లో అనంతపురం మున్సిపాలిటీ గా ఉండేది. కానీ ఇప్పుడు నగరపాలక సంస్థగా మారింది. జనాభా పెరిగారు. నగరంలో శివారు కాలనీలు పెరిగాయి. కానీ ప్రజల అవసరాలకు తగ్గట్టు తాగునీటి సరఫరా జరగడం లేదు. ఇది ఇబ్బందికరంగా మారింది.