Afghanistan Vs Sri Lanka: ప్చ్.. చివరి వరకు పోరాటం చేసినా 4 పరుగులతో తేడాతో ఓటమి

ఆఫ్ఘనిస్తాన్ బౌలర్ లలో ఫజల్ హక్ రెండు వికెట్లు, నవీన్ ఉల్ హక్ 2 వికెట్లు, అజ్మతుల్లా 2 వికెట్లు, నూర్ అహ్మద్ 1, కరీం జనత్ 1 వికెట్ తీశారు. వీరి ధాటికి శ్రీలంక 160 పరుగులకు ఆల్ అవుట్ అయింది.

Written By: Suresh, Updated On : February 18, 2024 4:23 pm

Afghanistan Vs Sri Lanka

Follow us on

Afghanistan Vs Sri Lanka: అదేం పెద్ద స్కోర్ కాదు. అలాగని చేజింగ్ కు దిగిన జట్టు పెద్ద తోపేం కాదు. దానికి పెద్ద పెద్ద టోర్నీలు గెలిచిన రికార్డు కూడా లేదు. ఒకరు లేదా ఇద్దరు మినహా మిగతా వారంతా అనామక ఆటగాళ్లే.. సాధారణంగా ఇలాంటి జట్టుపై ఎటువంటి అంచనాలు ఉండవు. కానీ అందరి అంచనాలను ఆ జట్టు దాదాపు తలకిందులు చేసింది. వెన్ను చూపకుండా వీరోచిత పోరాటం చేసింది. చివర్లో కీలక ఆటగాడు ఒత్తిడికి గురికాకుండా ఉండి ఉంటే విజయం వరించేది. మూడు టి20 మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా బోణీ చేసేదే.

మూడు మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా తొలి టీ 20 మ్యాచ్ లో శ్రీలంక ఆఫ్ఘనిస్తాన్ పై విజయం సాధించింది. డంబుల్లా వేదికగా ఆఫ్గనిస్తాన్ తో జరిగిన తొలి టీ_20 మ్యాచ్ లో శ్రీలంక నాలుగు పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి శ్రీలంక బ్యాటింగ్ ఎంచుకుంది. హసరంగ 32 బంతుల్లో 67: 7 ఫోర్లు మూడు సిక్సర్లతో చూపించడంతో శ్రీలంక 19 ఓవర్లలో 160 పరుగులకు ఆల్ అవుట్ అయింది.. సమర విక్రమ (25), ధనుంజయ డిసిల్వ(24) పర్వాలేదనిపించారు. కుశాల్ మెండీస్(10), నిస్సాంక(6), అసలంక(3), షనక(6), మాథ్యూస్(6), తీక్షణ(2), ఫెర్నాండో(0) అంచనాలు అందుకోవడంలో విఫలమయ్యారు.

ఆఫ్ఘనిస్తాన్ బౌలర్ లలో ఫజల్ హక్ రెండు వికెట్లు, నవీన్ ఉల్ హక్ 2 వికెట్లు, అజ్మతుల్లా 2 వికెట్లు, నూర్ అహ్మద్ 1, కరీం జనత్ 1 వికెట్ తీశారు. వీరి ధాటికి శ్రీలంక 160 పరుగులకు ఆల్ అవుట్ అయింది.

అనంతరం లక్ష్య చేదనకు దిగిన ఆఫ్ఘనిస్తాన్ జట్టు చివరి వరకు పోరాడి 5 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. కెప్టెన్ ఇబ్రహీం (67) స్ఫూర్తిదాయకమైన ఇన్నింగ్స్ ఆడాడు. చివరి వరకు క్రీజ్ లో ఉన్నప్పటికీ జట్టును గెలిపించలేకపోయాడు. జద్రాన్ తో పాటు రహ్మానుల్లా గుర్బాజ్(13), గుల్బ దిన్ నైబ్(16), కరీం జనత్(20) ఆకట్టుకున్నా ఉపయోగం లేకుండా పోయింది. ఒమర్ జాయ్(2), నబీ(9), జద్రాన్(0), కైస్ అహ్మద్ (7), నూర్ అహ్మద్ (9), నవీన్ ఉల్ హక్(1) నిరాశపరిచారు. శ్రీలంక బౌలర్లలో మతీశ పతిరణ నిప్పులు చెరిగాడు. ఏకంగా నాలుగు వికెట్లు తీసి ఆఫ్ఘనిస్తాన్ జట్టు పతనాన్ని శాసించాడు. షనక 2, హసరంగ 1, తీక్షణ 1, మాథ్యూస్ 1 వికెట్ దక్కించుకున్నారు. చివర్లో పతిరణ పదునైన బంతులు అందించడంతో ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్లు బెంబేలెత్తిపోయారు. చివరి వరకు పోరాడి నాలుగు పరుగుల తేడాతో ఓటమి పాలయ్యారు.