Team India Effect: టీమిండియా చేతిలో ఘోర ఓటమి ఎఫెక్ట్ : ఏకంగా ఆ దేశ క్రికెట్ బోర్డునే రద్దు చేసి షాకిచ్చిన ప్రభుత్వం..

మాజీ కెప్టెన్ అర్జున్‌ రణతుంగ నేతృత్వంలో ఒక తాత్కాలిక కమిటీని నియమించి దాని ద్వారా మిగితా కార్యక్రమాలు జరపాలని ఒక ప్రకటనను మంత్రిత్వ శాఖ కార్యాలయం విడుదల చేసింది.

Written By: Gopi, Updated On : November 6, 2023 1:52 pm
Follow us on

Team India Effect: ప్రస్తుతం 2023 వరల్డ్ కప్ లో భాగం గా ప్రతి టీం కూడా అద్భుతమైన విజయాలను అందుకోవడమే కాకుండా ప్రత్యర్థులను వాళ్ల ఆట తీరు తో భయపెడుతూ మ్యాచ్ లను ఓడించి మ్యాచులను గెలుచుకుంటూ ముందుకెళ్తున్నాయి.ఇక ఈ క్రమంలో శ్రీలంక టీమ్ మాత్రం వరుస గా అపజయాలను మూట కట్టుకుంటూ పాయింట్స్ టేబుల్ లో నెంబర్ 7 పొజిషన్ లో కొనసాగుతుంది.

ఒకప్పటి శ్రీలంక ప్రపంచంలోనే బెస్ట్ టీం గా ఉండేది, కానీ ఇప్పుడు శ్రీలంక పరిస్థితి మరి దారుణంగా తయారైంది.ఒక్క మ్యాచ్ గెలవడానికి నానా తంటాలు పడుతున్నారు. ఇక దానికి తోడుగా పసి కూన లు అయిన ఆఫ్గనిస్తాన్ టీం పైన కూడా ఓడిపోయి వాళ్ల పరువును వాళ్లే తీసుకున్నారు…ఇక వరల్డ్ కప్ లో ఇప్పటికే 7 మ్యాచు లను ఆడిన శ్రీలంక రెండు మ్యాచ్ ల్లో విజయం సాధించి 5 మ్యాచ్ ల్లో ఓడిపోయింది…ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం శ్రీలంక దేశానికి చెందిన మంత్రిత్వ శాఖ అధికారికంగా శ్రీలంకను క్రికెట్ బోర్డ్ ని రద్దు చేస్తున్నట్టుగా ప్రకటించింది…

ఇక ఇంతకుముందే శ్రీలంక వరుస ఓటములను జీర్ణించుకోలేని శ్రీలంక బోర్డు కార్యదర్శి రాజీనామా చేశారు. ఇక అంతలోనే ఇలా రద్దు చేయడం అనేది చాలా దారుణమైన విషయమనే చెప్పాలి. ఇక ఈ మేరకు శ్రీలంక స్పోర్ట్స్ మినిస్టర్ అయిన రోషన్ రణసింగే శ్రీలంక బోర్డుని రద్దు చేస్తున్నట్టుగా తెలియజేశాడు… ఒకప్పుడు శ్రీలంక క్రికెట్ కి మంచి సేవలు అందించిన మాజీ కెప్టెన్ అర్జున్‌ రణతుంగ నేతృత్వంలో ఒక తాత్కాలిక కమిటీని నియమించి దాని ద్వారా మిగితా కార్యక్రమాలు జరపాలని ఒక ప్రకటనను మంత్రిత్వ శాఖ కార్యాలయం విడుదల చేసింది. ఇక ఏడుగురు వ్యక్తులతో కూడిన ఈ ప్యానెల్‌లో సుప్రీం కోర్డు మాజీ న్యాయమూర్తి కూడా ఉన్నారు.

పాత బోర్డు కార్యదర్శిగా పని చేసిన మోహన్ డి సిల్వా రాజీనామా చేసిన మరుసటి రోజే ఈ నిర్ణయం వెలువడింది. ఇక ఇలాంటి క్రమంలో శ్రీలంక ఇవాళ్ళ బంగ్లాదేశ్ తో తన ఎనిమిదవ మ్యాచ్ ఆడాల్సి ఉంది…మరి ఈ మేరకు వాళ్ళు బోర్డ్ ని రద్దు చేయడం తో ఆ ప్లేయర్లు మీద వేటు అనేది భారీ గా పడే అవకాశం ఉంది…

ఇక ఇది ఇలా ఉంటే ముంబై వేదిక గా శ్రీలంక ఇండియా మీద ఆడిన మ్యాచ్ లో 55 పరుగులకు ఆల్ అవుట్ అవ్వడం అనేది ఆ దేశానికి జరిగిన ఘోర అవమానం గా ఫీల్ అయిన శ్రీలంక క్రీడల మినిస్టర్ ఈ బోర్డ్ లో చాలా అవక తవకలు ఉన్నాయి.అంత అవినీతి మయం అయిపోయింది అందుకే ప్లేయర్లు ఎంపిక లో క్వాలిటీ లేదు అని దానివల్లే మొత్తం బోర్డ్ ని రద్దు చేశామని తెలియజేశారు…