India Cricket Team: టీమిండియా ఇన్ని విజయాలకు సూత్రధారి అతడే.. కానీ ఎవరూ గుర్తించడం లేదు…

ఇక ఈ మ్యాచ్ అనే కాదు వరల్డ్ కప్ స్టార్ట్ అయినప్పటి నుంచి మొదటి మ్యాచ్ మినహాయిస్తే ఆయన ప్రతి మ్యాచ్ లో కూడా తనదైన రీతిలో బ్యాటింగ్ చేస్తూ ఇండియన్ టీం కి అద్భుతమైన పరుగులను సాధిస్తున్నాడు.

Written By: Neelambaram, Updated On : November 6, 2023 1:43 pm
Follow us on

India Cricket Team: 2023 వరల్డ్ కప్ లో భాగంగా ఇండియన్ టీమ్ వరుస విజయాల్ని అందుకుంటూ ప్రపంచంలోనే నెంబర్ వన్ టీమ్ గా గుర్తింపు పొందటమే కాకుండా ప్రస్తుతం ఈ టోర్నీలో కూడా వరుసగా 8 విజయాలను సొంతం చేసుకుని మనకు ఎవరు పోటీలేరని మరొకసారి ప్రూవ్ చేసుకుంది. ఇక ఇదే క్రమంలో నిన్న సౌతాఫ్రికా మీద ఆడిన మ్యాచ్ లో కోహ్లీ అద్భుతమైన సెంచరీ చేశాడు. దానికి తగ్గట్టుగానే రవీంద్ర జడేజా 5 వికెట్లు తీసి సౌతాఫ్రికా టీం ని భారీగా దెబ్బ కొట్టాడు.ఇక ఇలాంటి క్రమంలో ఈ మ్యాచ్ లో ఇండియా సౌతాఫ్రికా ని 83 పరుగులకు ఆలౌట్ చేసి 243 పరుగుల భారీ తేడాతో విజయం సాధించడం జరిగింది. కోహ్లీతో పాటుగా ఈ మ్యాచ్ లో మరొక వ్యక్తి కూడా చాలా ఉత్సాహం చూపిస్తూ తనదైన రీతిలో బ్యాటింగ్ చేశాడు.ఆయన ఎవరు అంటే రోహిత్ శర్మ అనే చెప్పాలి…

ఈయన ఈ మ్యాచ్ లో మొదటి నుంచి దూకుడుగా ఆడి 40 పరుగులు చేసి దురదృష్టవశాత్తు అవుట్ అయిపోయాడు, కానీ రోహిత్ శర్మకు తగినంత గుర్తింపు రాలేదనే చెప్పాలి… ఇక ఈ మ్యాచ్ అనే కాదు వరల్డ్ కప్ స్టార్ట్ అయినప్పటి నుంచి మొదటి మ్యాచ్ మినహాయిస్తే ఆయన ప్రతి మ్యాచ్ లో కూడా తనదైన రీతిలో బ్యాటింగ్ చేస్తూ ఇండియన్ టీం కి అద్భుతమైన పరుగులను సాధిస్తున్నాడు. ఇండియన్ గెలుపులో కూడా కెప్టెన్ గా కీలక పాత్ర పోషిస్తున్నాడు.అయితే రోహిత్ శర్మ ఇప్పటివరకు ఎనిమిది మ్యాచ్ లు ఆడితే అందులో 442 పరుగులు చేశాడు. అందులో ఒక సెంచరీ చేయగా, రెండు హాఫ్ సెంచరీలను కూడా నమోదు చేసుకున్నాడు.ఇక ఇలాంటి క్రమంలో ఆయనని ఎవరు గుర్తించడం లేదు అద్భుతమైన బ్యాటింగ్ పర్ఫామెన్స్ ను ఇస్తూనే కెప్టెన్ గా కూడా వరుసగా 8 విజయాలను అందుకొని ఇప్పటివరకు ఎవ్వరికీ సాధ్యం కానీ రికార్డ్స్ ని తన ఖాతాలో వేసుకున్నాడు.

ఇక ఇదంతా చూసిన క్రికెట్ మేధావుల సైతం రోహిత్ శర్మ కి వరల్డ్ కప్ లో ఆయన ప్రతిభకి సరిపడా గుర్తింపు అయితే రావడం లేదు అంటూ తీవ్రమైన ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. రోహిత్ ప్లేస్ లో వేరే కెప్టెన్ ఉంటే మాత్రం ఇప్పటికే వాళ్ళని ఆకాశానికి ఎత్తేసేవారు. కానీ ఎందుకు రోహిత్ శర్మ ని ఎవరు పట్టించుకోకుండా ఉంటున్నారు అనే దాని మీదనే రకరకాల ప్రశ్నలు వెలువడుతున్నాయి.

కానీ రోహిత్ మాత్రం వీటి వేటిని పట్టించుకోకుండా మూడోసారి ఇండియాకు వరల్డ్ కప్ అందించిన మూడో కెప్టెన్ గా తను కూడా ఒక రికార్డు సాధించాలని చూస్తున్నాడు.అందుకే ఎవరు ఆయనని గుర్తించిన, గుర్తించకపోయిన కూడా ఆయనేం పట్టించుకోకుండా తన మ్యాచులు తను ఆడుతూ టీం ను వరల్డ్ కప్ లో ఎలా గెలిపించాలనే దానిమీదనే వ్యూహాలు రచిస్తున్నాడు.ఇక ఇప్పటికే వరల్డ్ కప్ లో ఆయన ఆట తీరు చూస్తేనే మనకు అర్థమవుతుంది ఆయన ప్లేయర్ గా కూడా ఎంత మంచి ఫామ్ లో అన్నాడు అనేది…మరి రోహిత్ తను అనుకున్నట్టుగా ఇండియన్ టీమ్ కి వరల్డ్ కప్ అందించిన మూడోవ కెప్టెన్ గా రికార్డ్ క్రియేట్ చేస్తాడో లేదో చూడాలి…