Anam Venkata Ramana Reddy : సినిమాల్లో బఫూన్లు, కమెడియన్లు ఉంటారు. వారిని చూసి నవ్వుకుంటాం.. ఇప్పుడు రాజకీయాల్లోనూ వారు చొచ్చుకొస్తున్నారు. సీరియస్ పాలిటిక్స్ వేల పిచ్చ కామెడీ పండిస్తున్నారు. వారి వేషాలు చూసి టీవీల ముందు జనాలు బాగా నవ్వుకుంటున్నారు.
టీడీపీ నేత ఆనం వెంకటరమణ రెడ్డి ఇప్పుడు రాజకీయాల్లో కామెడీ పండిస్తున్నాడు. ఎంతలా అంటే తాజాగా ఆయన ప్రెస్ మీట్లు పెడితే చాలు యూట్యూబర్లు రెడీ అయిపోతున్నారు. షాట్లుగా కట్ చేసి లక్షల వ్యూస్ తీసుకొస్తున్నారు. కేఏ పాల్ ను మించి ఆనం ప్రెస్ మీట్లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
తాజాగా బిచ్చగాడి బొచ్చె పట్టుకొని ఆనం వెంకట రమణా రెడ్డి బిచ్చగాడిలా ‘అమ్మా.. అయ్యా.. అక్కా’ అంటూ అడుక్కోవడం మొదలుపెట్టాడు. ఇది చూసి విలేకరులకు మైండ్ బ్లాంక్ అయిపోయింది. వైసీపీని విమర్శించేందుకని ప్రెస్ మీట్ పెట్టేసి ఇలా అడుక్కోవడం ఏంటీ సార్ అని అందరూ నవ్వుకున్నారు.
ఈ వెరైటీ ఆనం చేష్టలు రాజకీయాల్లో ఫుల్ కామెడీ పండిస్తున్నాయి.. ఆయన ప్రెస్ మీట్ అంటే చాలు కామెడీ పీస్ వచ్చిందని జనాలు తెగ చూసేస్తున్న పరిస్థితి నెలకొంది.
— Vikatakavi (@vikatakavi1231) November 6, 2023