Homeక్రీడలుక్రికెట్‌Sri Charani ICC T20 Rankings: అడుగుపెట్టి ఏడాది కాలేదు.. అంతలోనే నెంబర్ వన్.. ఇది...

Sri Charani ICC T20 Rankings: అడుగుపెట్టి ఏడాది కాలేదు.. అంతలోనే నెంబర్ వన్.. ఇది మన శ్రీ చరణి సత్తా

Sri Charani ICC T20 Rankings: సరిగ్గా గత ఏడాది ఈ సమయానికి ఆ అమ్మాయి ఇంకా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టలేదు. ఏడాదికాకముందే అంతర్జాతీయ క్రికెట్ మొత్తాన్ని షేక్ చేసింది. సరికొత్త ఆట తీరుతో అదరగొట్టింది. అంతేకాదు మువ్వన్నెల జాతీయ జెండాను రెపరెపలాడించింది. గొప్ప గొప్ప ప్లేయర్లు సాధించలేనిది.. సీనియర్ క్రికెటర్లు అందుకోలేనిది.. తాను సొంతం చేసుకుంది. అటు అంతర్జాతీయ స్థాయిలో భారత దేశానికి.. రెండు తెలుగు రాష్ట్రాలకు అద్భుతమైన పేరు తీసుకొచ్చింది. ఆ అమ్మాయి మరెవరో కాదు శ్రీ చరణి.

గత ఏడాది జూన్ 28న ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లోకి ప్రవేశించింది శ్రీ చరణి. తొలి మ్యాచ్ లోనే సత్తా చూపించింది. ఆ తర్వాత మహిళల టి20 వరల్డ్ కప్ లో అదరగొట్టింది. మెలి తిరిగే బంతులు వేస్తూ ప్రత్యర్థి ప్లేయర్లకు చుక్కలు చూపించింది. చిన్న వయసులోనే అద్భుతమైన ప్రతిభ ప్రదర్శించింది. అంతేకాదు టీమిండియా టి20 వరల్డ్ కప్ గెలవడం లో ముఖ్యపాత్ర పోషించింది. ఆ తర్వాత ఆమె ఎదుగుదల మరింత జోరుగా సాగిపోయింది.

నాడు టి20 వరల్డ్ కప్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన
శ్రీ చరణిని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆమెను సన్మానించారు. అంతేకాదు.. కోటి రూపాయల నగదు బహుమతిని.. విలువైన ఇంటి స్థలాన్ని.. ప్రభుత్వ ఉద్యోగాన్ని ఆమెకు కేటాయించారు. నాడు ఆమెతో చంద్రబాబు ప్రత్యేకంగా మాట్లాడారు. అప్పుడు నారా లోకేష్.. మిథాలీ రాజ్ వంటి క్రికెటర్ కూడా ఉన్నారు.

తాజాగా అంతర్జాతీయ టి20 ర్యాంకింగ్స్ లో శ్రీ చరణి దుమ్మురేపింది. నెంబర్ వన్ ఉమెన్ టి20 బౌలర్ గా నిలిచింది. అంతర్జాతీయ టి20 బౌలర్ల ర్యాంకింగ్స్ లో శ్రీ చరణి మొదటి స్థానంలో నిలిచింది. ఇంగ్లాండ్ స్పిన్నర్ లిన్సే స్మిత్ ను ఆమె అధిగమించింది. అగ్రస్థానంలోకి చేరుకుంది. ఇక ప్రస్తుత టి20 వరల్డ్ కప్ లో మూడు మ్యాచ్లు ఆడిన మన తెలుగు అమ్మాయి.. 10 వికెట్లను సొంతం చేసుకుంది. శ్రీ చరణి ఈ స్థాయిలో బౌలింగ్ చేయడం పట్ల.. నెంబర్ వన్ స్థానాన్ని చేరుకోవడం పట్ల ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. ఆమె ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రపంచ వేదికమందు గొప్ప పేరు తీసుకొచ్చారని వ్యాఖ్యానించారు. ఆమె మరిన్ని విజయాలు సాధించాలని కోరారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version