SRH: ఐపీఎల్ లో భాగంగా రాజస్థాన్ రాయల్స్ జట్టు(Rajasthan royals)తో జరిగిన తొలి మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్(sun risers Hyderabad) 286 పరుగులు చేసింది.. ఈ సీజన్లో ఏ జట్టుకైనా ఇప్పటివరకు ఇదే హైయెస్ట్ స్కోర్.. రాజస్థాన్ రాయల్స్ జట్టుతో జరిగిన మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లు అభిషేక్ శర్మ (24), హెడ్(67), ఇషాన్ కిషన్(106*) దుమ్ము లేపారు. అయితే ఆ తదుపరి మ్యాచ్ లలో వీరు ముగ్గురు దారుణంగా విఫలమయ్యారు.. లక్నో జట్టుతో జరిగిన మ్యాచ్లో అభిషేక్ శర్మ 6, హెడ్ 47, ఇషాన్ కిషన్ 0 పరుగులు మాత్రమే చేశారు.. ఢిల్లీ జట్టుతో జరిగిన మ్యాచ్లో అభిషేక్ శర్మ 1, హెడ్ 22, ఇషాన్ కిషన్ 2 రన్స్ చేశారు. ఇక గురువారం ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన మ్యాచ్లో అభిషేక్ శర్మ (2), ట్రావిస్ హెడ్(4), ఇషాన్ కిషన్(2) దారుణంగా విఫలమయ్యారు.. దీంతో సన్ రైజర్స్ హైదరాబాద్ 120 పరుగులకే ఆల్ అవుట్ అయింది. మొత్తంగా కోల్ కతా నైట్ రైడర్స్ చేతిలో 8 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ ఓటమి ద్వారా హైదరాబాద్ జట్టు పాయింట్ల పట్టికలో అన్ని జట్ల కంటే దిగువ స్థానానికి పడిపోయింది.
Also Read: ఎస్‌ఆర్‌హెచ్ టీం.. ఆటగాళ్లవి అడ్డిమారి గుడ్డిదెబ్బలే!
ఎందుకింత నిర్లక్ష్యం
సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు లో ఎన్నడూ లేనంత నిర్లక్ష్యంగా ఆటగాళ్లు బ్యాటింగ్ చేస్తున్నారు. గత మూడు మ్యాచ్లలో ఓపెనర్లు ఒక్క మెరుగైన భాగస్వామ్యం కూడా ఇవ్వలేకపోయారు. ఇక వన్ డౌన్ లో వస్తున్న ఇషాన్ దారుణంగా విఫలమవుతున్నాడు. మిడిల్ ఆర్డర్ చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడుతున్నప్పటికీ.. అవి జట్టుకు ఏమాత్రం ఉపకరించడం లేదు. గురువారం జరిగిన మ్యాచ్లో కామిందు మెండిస్, క్లాసెన్ ఉన్నంతలోనైనా కోల్ కతా నైట్ రైడర్స్ బౌలర్లను ప్రతిఘటించారు. లేకపోతే సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు పరిస్థితి మరింత దారుణంగా ఉండేది.. నిర్లక్ష్యంగా బ్యాటింగ్ చేయడం..షాట్ల ఎంపికలో కసరత్తు చేయకపోవడం.. వంటి కారణాలు సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్ల పరువు తీస్తున్నాయి.. వరుసగా మూడు మ్యాచ్లలో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆటగాళ్లు ఇలా విఫలం కావడం ఆ జట్టు అభిమానులను నిర్వేదానికి గురిచేస్తున్నది. ” రాజస్థాన్ రాయల్స్ మినహా.. మిగతా అందు జట్లపై జరిగిన మ్యాచ్లలో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ప్లేయర్లు విఫలమయ్యారు. మైదానంలో హోరాహోరీగా ఆడాల్సిన చోట గల్లి క్రికెట్ ఆడుతున్నారు. నిర్లక్ష్యపు షాట్లతో పరువు తీసుకుంటున్నారు. ఇలాంటి వారితో హైదరాబాద్ జట్టు ట్రోఫీ ఎలా గెలుస్తుందనేది ప్రశ్నార్థకంగా ఉందని” సోషల్ మీడియాలో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు. మిగతా మ్యాచ్లోనైనా కాస్త సత్తా చాటాలని.. లేకపోతే గ్రూప్ దశలోనే ఇంటికి వెళ్లాల్సి వస్తుందని పేర్కొంటున్నారు. ” ఆటగాళ్ల స్థానాన్ని మార్చాలి.. ప్రాక్టీస్ సెషన్లో సత్తా చాటిన వారికే అవకాశం ఇవ్వాలి. ఏదో ఒక మ్యాచ్ లో దూకుడుగా పరుగులు చేసిన ఆటగాళ్లకు మళ్ళీ మళ్ళీ అవకాశాలు ఇస్తే ఇలాంటి ఫలితాలే వస్తాయి. అందువల్ల తదుపరి మ్యాచ్లలో హైదరాబాద్ జట్టు యాజమాన్యం ప్రయోగాలకు సిద్ధం కాకపోతే మొదటికే మోసం వస్తుందని” సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు అభిమానులు పేర్కొంటున్నారు.