SRH Vs RR (6)
SRH Vs RR: ఎవడైనా ఎదురు వచ్చే సముద్ర అలలకు ఎదురు వెళ్తాడా.. మండుటెండలో చెప్పులు లేకుండా తారు రోడ్డు మీద నడుస్తాడా.. దట్టమైన అడవిలో సింహం ముందు తొడకొడతాడా.. బుద్ధి ఉన్నవాడు ఎవడూ చేయడు. అలాంటి పనికి ఎవడూ సాహసించడు.
కానీ అలాంటి పనిని రాజస్థాన్ రాయల్స్ ( Rajasthan royals) రియాన్ పరాగ్ (Riyan paraag) చేశాడు. హైదరాబాద్ జట్టుతో (SRH) జరిగిన మ్యాచ్లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. అది ఎంత బుద్ధి తక్కువ నిర్ణయమో.. అతడికి తొలి ఓవర్ లోనే తెలిసి వచ్చింది. హైదరాబాద్ బ్యాటర్లు తమ సొంత మైదానమైన ఉప్పల్ గ్రౌండ్లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. అభిషేక్ శర్మ (24), హెడ్(67), నితీష్ కుమార్ రెడ్డి (30), క్లాసెన్(34), ఇషాన్ కిషన్(106*) పరుగులు చేయడంతో హైదరాబాద్ జట్టు స్కోర్ రాకెట్ వేగంతో దూసుకుపోయింది. నిర్ణీత 20 ఓవర్లలో హైదరాబాద్ జట్టు ఆరు వికెట్ల నష్టానికి 286 పరుగులు చేసింది. గత సీజన్లో బెంగళూరు జట్టుపై హైదరాబాద్ 287 పరుగులు చేసి.. ఐపీఎల్ లో హైయెస్ట్ స్కోర్ చేసిన జట్టుగా నిలిచింది. అయితే క్లాసెన్ అవుట్ కావడం హైదరాబాద్ జట్టు స్కోర్ మీద ప్రభావం చూపించింది. ఒకవేళ అతడు గనుక అలాగే ఉండి ఉంటే హైదరాబాద్ స్కోర్ కచ్చితంగా 300 మార్క్ దాటేది.
Also Read: ఇదేం బ్యాటింగ్ భయ్యా.. హెడ్ కంటే ఇషాన్ కిషన్ మోస్ట్ డేంజర్..
తిక్క నిర్ణయం
సంజు శాంసన్ చేతి వేలికి గాయం కావడంతో తొలి మ్యాచ్ కు అతడు దూరమయ్యాడు.. దీంతో రియాన్ పరాగ్ తొలి మ్యాచ్ కు కెప్టెన్ గా వ్యవహరించాడు. టాస్ గెలిచిన తర్వాత బౌలింగ్ ఎంచుకున్నాడు. అయితే ప్లాట్ మైదానంపై హైదరాబాద్ ఆటగాళ్ళు విధ్వంసం సృష్టించారు. రాజస్థాన్ బౌలర్ల పై ఏమాత్రం కనికరం లేకుండా బ్యాటింగ్ చేశారు.. జోప్రా ఆర్చర్, మహేష్ తీక్షణ, సందీప్ శర్మ, ఫారుఖీ, నితీష్ రాణా, తుషార్ దేశ్ పాండే.. ఇలా అందరి బౌలర్లను ఒక ఆట ఆడుకున్నారు. టాస్ గెలిచిన రియాన్ పరాగ్ బ్యాటింగ్ ఎంచుకొని ఉంటే బాగుండేది. ఎందుకంటే హైదరాబాద్ జట్టు ఆడేది ఉప్పల్ మైదానంలో… ఈ ఫ్లాట్ మైదానం. హైదరాబాద్ జట్టుకు అచ్చి వచ్చిన మైదానం. దీంతో హైదరాబాద్ ఆటగాళ్లు రెచ్చిపోయారు. ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. రాజస్థాన్ బౌలర్లపై జాలి, దయ, కరుణ వంటివి లేకుండా దూకుడుగా ఆడారు. ఫలితంగా హైదరాబాద్ జట్టు స్కోరు బుల్లెట్ ట్రైన్ స్పీడ్ తో దూసుకుపోయింది. రాజస్థాన్ జట్టుపై 286 పరుగులు చేసి.. ఐపీఎల్ లో సెకండ్ హైయెస్ట్ స్కోర్ చేసిన జట్టుగా హైదరాబాద్ నిలిచింది. గత సీజన్లో బెంగళూరు జట్టుపై హైదరాబాద్ మూడు వికెట్ల నష్టానికి 287 పరుగులు చేసింది. ఇప్పటివరకు ఐపీఎల్లో ఇదే హైయెస్ట్ స్కోర్ గా ఉంది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడం పట్ల.. రియాన్ పరాగ్ పై సోషల్ మీడియాలో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Srh vs rr match analysis ryan parag error
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com