https://oktelugu.com/

SRH vs PBKS : పంజాబ్ పై సన్ రైజర్స్ గెలుపు.. టాప్ – 2 లోకి ఎంట్రీ..

కోల్ కతా జట్టు తో క్వాలిఫైయర్ - 1 మ్యాచ్ ఆడుతుంది. ఒకవేళ రాజస్థాన్ విజయాన్ని దక్కించుకుంటే హైదరాబాద్ మూడో స్థానానికి పడిపోయి.. బెంగళూరు తో ఎలిమినేటర్ మ్యాచ్ ఆడుతుంది..

Written By:
  • NARESH
  • , Updated On : May 19, 2024 / 10:13 PM IST

    SRH vs PBKS

    Follow us on

    SRH vs PBKS : ఇప్పటికే ప్లే ఆఫ్ చేరుకున్న సన్ రైజర్స్ హైదరాబాద్.. ఆదివారం పంజాబ్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది.. సొంత మైదానంపై ఏకపక్షంగా జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ ఆటగాళ్లు అద్భుతంగా ఆడారు.. ఇప్పటికే పాయింట్ల పట్టికలో మూడవ స్థానంలో కొనసాగుతున్న హైదరాబాద్.. ఈ విజయంతో టాప్ – 2 లోకి ఎంట్రీ ఇచ్చింది. సోమవారం కోల్ కతా, రాజస్థాన్ జట్ల మధ్య జరిగే మ్యాచ్ లో కోల్ కతా గెలిస్తే.. హైదరాబాద్ టాప్ – 2 లో స్థిరంగా ఉంటుంది.

    ఆదివారం ఉప్పల్ మైదానం వేదికగా జరిగిన మ్యాచ్ లో టాస్ గెలిచిన పంజాబ్ బ్యాటింగ్ ఎంచుకుంది.. ఇప్పటికే ప్లే ఆఫ్ నుంచి నిష్క్రమించిన పంజాబ్ జట్టు.. ఈ మ్యాచ్ గెలిచి టోర్నీ నుంచి ఎగ్జిట్ కావాలని ఆ జట్టు ఆటగాళ్లు భావించారు.. ఇందులో భాగంగానే ధాటిగా బ్యాటింగ్ చేశారు. ఓపెనర్లు అథర్వ (46), ప్రభ్ సిమ్రాన్ సింగ్ (71) దూకుడుగా ఆడారు. తొలి వికెట్ కు 97 పరుగులు జోడించారు.. రిలీ రోసోవ్ (49), జితేష్ శర్మ (32) పరుగులు చేయడంతో పంజాబ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లకు 214 రన్స్ చేసింది. నటరాజన్ 2 వికెట్లు, కమిన్స్, విజయ్ కాంత్ వియస్కాంత్ తలా ఒక వికెట్ దక్కించుకున్నారు.

    అనంతరం 215 పరుగుల విజయ లక్ష్యంతో చేజింగ్ ప్రారంభించిన హైదరాబాద్ జట్టు 19.1 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి గెలుపొందింది. ఈ సీజన్లో ప్రమాదకరంగా ఆడుతున్న హైదరాబాద్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ తాను ఎదుర్కొన్న తొలి బంతికే అర్ష్ దీప్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత అభిషేక్ శర్మ (66), రాహుల్ త్రిపాఠి (33) పరుగులు చేసి ఆకట్టుకున్నారు. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడిని హర్షల్ పటేల్ విడదీశాడు. 33 పరుగులు చేసిన రాహుల్ త్రిపాఠిని అద్భుతమైన బంతితో హర్షల్ పటేల్ బోల్తా కొట్టించాడు. ఆ తర్వాత అభిషేక్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డి (37), క్లాసెన్ (42) ధాటిగా బ్యాటింగ్ చేయడంతో హైదరాబాద్ గెలుపు దారిలో పయనించింది. చివర్లో అబ్దుల్ సమద్ 11, సన్ వీర్ సింగ్ 6 పరుగులు చేయడంతో హైదరాబాద్ నాలుగు వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది.

    ఈ విజయంతో హైదరాబాద్ జట్టు పాయింట్ల పట్టికలో రెండవ స్థానానికి చేరింది. ప్రస్తుతం ఆ జట్టు ఖాతాలో 17 పాయింట్లు ఉన్నాయి. అయితే సోమవారం కోల్ కతా, రాజస్థాన్ మ్యాచ్ ఫలితం పై హైదరాబాద్ రెండవ స్థానం ఆధారపడి ఉంది. ఒకవేళ రాజస్థాన్ ఓడిపోతే హైదరాబాద్ రెండో స్థానంలో ఉంటుంది. కోల్ కతా జట్టు తో క్వాలిఫైయర్ – 1 మ్యాచ్ ఆడుతుంది. ఒకవేళ రాజస్థాన్ విజయాన్ని దక్కించుకుంటే హైదరాబాద్ మూడో స్థానానికి పడిపోయి.. బెంగళూరు తో ఎలిమినేటర్ మ్యాచ్ ఆడుతుంది..