SRH Vs PBKS: సన్ రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ 11 జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్లో.. పంజాబ్ జట్టు ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. 13 బంతుల్లో రెండు ఫోర్లు, నాలుగు సిక్సర్ల సహాయంతో 36 పరుగులు చేశాడు. హర్షల్ పటేల్ బౌలింగ్ లో నితీష్ కుమార్ రెడ్డి పట్టిన క్యాచ్ కు ప్రియాన్ష్ ఆర్య అవుట్ అయ్యాడు. తద్వారా 66 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. 3.6 ఓవర్లలోనే పంజాబ్ జట్టు ఈ స్కోర్ చేయడం విశేషం. ఇక ఓపెనర్ ప్రభ్ సిమ్రాన్ సింగ్ కూడా 22 బంతుల్లో 7 ఫోర్లు, ఒక సిక్సర్ తో 42 పరుగులు చేశాడు. శ్రేయస్ అయ్యర్ ఐదు బంతుల్లో ఒక సిక్సర్ సహాయంతో 10* పరుగులు చేశాడు..వీరిద్దరూ రెండో వికెట్ కు 25 పరుగులు జోడించారు.. అయితే ప్రభ్ సిమ్రాన్ సింగ్ ఏషాన్ మలింగ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ఇక ప్రస్తుతం క్రీజ్ లో శ్రేయస్ అయ్యర్ 10*, నేహల్ వదేరా 2* క్రీజ్ లో ఉన్నారు. ఈ కథనం రాసే సమయం వరకు పంజాబ్ జట్టు 7.3 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 95 పరుగులు చేసింది.
Also Read: వాడి పేరు పూరన్.. పూనకం వచ్చినట్టు కొడతాడు..పాపం గుజరాత్!
హైదరాబాద్ జట్టు మాదిరిగా..
గత సీజన్లో హైదరాబాద్ జట్టు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయి ఆడింది.. ఇక ఈ సీజన్లో తొలి మ్యాచ్లో రాజస్థాన్ జట్టుపై కూడా సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు అదే స్థాయిలో ఆడింది. ఆ తర్వాత వరుసగా విఫలమవుకుంటూ వస్తోంది. ఇక శనివారం పంజాబ్ జట్టుతో జరుగుతున్న మ్యాచ్ లో హైదరాబాద్ కచ్చితంగా గెలవాలి. అందువల్లే ఈ మ్యాచ్ హైదరాబాద్ జట్టుకు అత్యంత ముఖ్యం. అయితే ఇప్పటికే పంజాబ్ జట్టు రెండు వికెట్లు నష్టపోయి ఎనిమిది ఓవర్లలో 99 పరుగులు చేసింది. అయితే ఈ మ్యాచ్లో కచ్చితంగా హైదరాబాద్ గెలవాలి. హైదరాబాద్ గెలిస్తేనే ప్లే ఆఫ్ వెళ్లడానికి అవకాశం ఉంటుంది. లేనిపక్షంలో హైదరాబాద్ ప్లే ఆఫ్ వెళ్లే అవకాశాలు సంక్లిష్టంగా మారిపోతాయి.
PRIYANSH ARYA SMASHING PAT CUMMINS…!!! pic.twitter.com/cRjlsGWJWS
— Johns. (@CricCrazyJohns) April 12, 2025