Spam Calls: ఈ రోజుల్లో మనకు తెలియని నంబర్ల నుండి వచ్చే కాల్‌లను గుర్తించడం చాలా కష్టంగా మారింది. ఇది స్పామ్ కాల్.. ఇది ఇంపార్టెంట్ కాల్ అని చెప్పడం కూడా కష్టం. అయితే, టెలికాం కంపెనీలు దీనికి పరిష్కారం కనుగొన్నారు. టెలికాం కంపెనీల ఇంటర్ ఆపరేటర్ ట్రయల్ విజయవంతమైతే, తెలియని నంబర్‌లపై కాలర్ పేరు కూడా మీకు కనిపిస్తుంది. దీంతో ఏ కాల్ ముఖ్యమైనదో, ఏది స్పామ్ కాల్‌నో మీరు గుర్తించవచ్చు. ఈ ట్రయల్ గురించి ఇక్కడ పూర్తి వివరాలు తెలుసుకుందాం. టెలికమ్యూనికేషన్ డిపార్ట్‌మెంట్ టెలికాం కంపెనీలకు ఏప్రిల్ 18 వరకు ఈ ట్రయల్‌ను పూర్తి చేసి నివేదికను సమర్పించాలని ఆదేశించింది. దీని తర్వాత మీకు కొత్త అప్‌డేట్ కనిపిస్తుంది.
ఇన్‌కమింగ్ కాల్‌లో నంబర్‌తో పాటు పేరు కనిపించడం వల్ల చాలా సమస్యలు పరిష్కారమవుతాయి. ఏప్రిల్ 14లోగా అన్ని ఇంటర్ ఆపరేటర్ ట్రయల్‌లను పూర్తి చేసి ఏప్రిల్ 18లోగా నివేదికను సమర్పించాలని టెలికమ్యూనికేషన్ డిపార్ట్‌మెంట్ టెలికాం కంపెనీలను కోరింది. జియో, ఎయిర్‌టెల్ మధ్య ట్రయల్ పూర్తయింది. ఎయిర్‌టెల్, వొడాఫోన్ మధ్య ట్రయల్ వచ్చే వారం ప్రారంభమవుతుంది. టెలికాం కంపెనీలు హర్యానా, మహారాష్ట్రలలో ఈ ట్రయల్‌ను నిర్వహిస్తున్నాయి. ట్రయల్ సరిగ్గా ఉంటే, ప్రభుత్వం దీనిని క్రమంగా ప్రారంభించడానికి ఆదేశాలు జారీ చేస్తుంది. 2G వినియోగదారులు ఈ సేవ కోసం కొంచెం వేచి ఉండాలి.
ఈ సేవ ఏమిటి?
కాలర్ నేమ్ ప్రెజెంటేషన్ సర్వీస్ గురించి చెప్పాలంటే, ఇది కాలర్ గుర్తింపును సులభతరం చేసే సేవ. ఈ సర్వీస్ ద్వారా ఇన్‌కమింగ్ కాల్‌లో స్క్రీన్‌పై కాలర్ నంబర్‌తో పాటు పేరు కూడా కనిపిస్తుంది. స్పామ్ కాల్‌లను అరికట్టడమే ప్రభుత్వ ఈ నిర్ణయం వెనుక ముఖ్య ఉద్దేశ్యం. టెలికాం కంపెనీలు ఈ సర్వీస్‌ను వీలైనంత త్వరగా ప్రారంభించాలని టెలికాం శాఖ ఆదేశించింది.