SRH Vs PBKS: 1,2,6,6,6,6 ఇవేవో పరీక్షల ఫలితాలప్పుడు కార్పొరేట్ కాలేజీలు ప్రకటించే ర్యాంకులు కాదు.. శనివారం హైదరాబాద్ జట్టు బౌలర్ మహమ్మద్ షమీ బౌలింగ్ లో పంజాబ్ ఆటగాడు స్టోయినిస్ చేసిన పరుగులు. చివరి ఓవర్లో ఏకంగా 27 పరుగులు సమర్పించుకొని.. షమీ చెత్త రికార్డును మూట కట్టుకున్నాడు.
Also Read: ఓపెనర్ గా వచ్చినా సేమ్ అదే కథ.. పంత్ గ్రహచారం బాగోలేదా?
సాధారణంగా డెత్ ఓవర్లలో షమీ పొదుపుగా బౌలింగ్ వేస్తాడు. అతని మీద నమ్మకం ఉంచి హైదరాబాద్ జట్టు కెప్టెన్ కమిన్స్ చివరి ఓవర్ బౌలింగ్ వేసే అవకాశం ఇచ్చాడు. అయితే షమీ బౌలింగ్లో మార్కస్ స్టోయినిస్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. విధ్వంసానికి పరాకాష్ట లాగా బ్యాటింగ్ చేశాడు. ఆరు బంతుల్లో 27 పరుగులు చేశాడు. దీంతో పంజాబ్ జట్టు స్కోర్ రాకెట్ వేగంతో దూసుకు వెళ్లింది. 19 వ ఓవర్ దాకా ఆరు వికెట్ల నష్టానికి 218 పరుగులుగా ఉన్న పంజాబ్ జట్టు స్కోర్.. ఒకసారి గా 245 పరుగులకు చేరుకుంది. అంతేకాదు స్టోయినీస్ వ్యక్తిగత స్కోరు 8 పరుగుల నుంచి 34 పరుగులకు చేరుకుంది. కేవలం 11 బంతుల్లోనే స్టోయినీస్ ఈ ఘనత సాధించడం విశేషం.
అత్యంత చెత్త రికార్డు
చివరి ఓవర్లో 27 పరుగులు ఇవ్వడం ద్వారా మహమ్మద్ షమీ అత్యంత చెత్త రికార్డును ఐపీఎల్ లో నమోదు చేశాడు. ఈ సీజన్లో ఇప్పటివరకు అత్యంత చెత్త గణాంకాలను నమోదు చేసిన బౌలర్ గా జోఫ్రా ఆర్చర్ నిలిచాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు చెందిన ఆర్చర్ నాలుగు ఓవర్లు వేసి 76 పరుగులు ఇచ్చాడు.. ఈ సీజన్లో ఇప్పటివరకు ఇదే అత్యంత చెత్త బౌలింగ్ గా నమోదయింది. ఇక ఆ తర్వాత స్థానంలో మహమ్మద్ షమీ కొనసాగుతున్నాడు. శనివారం పంజాబ్ జట్టుతో జరిగిన మ్యాచ్లో అతడు నాలుగో ఓవర్లు వేసి వికెట్లు ఏమీ తీయకుండానే 75 పరుగులు సమర్పించుకున్నాడు. గుజరాత్ టైటాన్స్ ఆటగాడు మోహిత్ శర్మ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో 2024లో జరిగిన మ్యాచ్లో 4 ఓవర్లు వేసి 73 పరుగులు సమర్పించుకున్నాడు. 2018లో హైదరాబాద్ జట్టు ఆటగాడు బాసిల్ తంపి బెంగళూరు జట్టుతో జరిగిన మ్యాచ్లో.. నాలుగు ఓవర్లు వేసి 70 పరుగులు సమర్పించుకున్నాడు. గుజరాత్ టైటాన్స్ జట్టు చెందిన ఆటగాడు యష్ దయ్యాలు 2023లో అహ్మదాబాద్ వేదికగా కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు తో జరిగిన మ్యాచ్లో నాలుగు ఓవర్లు వేసి 69 పరుగులు సమర్పించుకున్నాడు. అయితే ఈ జాబితాలో అందరి బౌలర్ల కంటే షమీ బౌలింగ్ కాస్త వైవిధ్యంగా ఉంటుంది. కానీ అలాంటి ఆటగాడు కూడా ఇలా బౌలింగ్ చేయడాన్ని హైదరాబాద్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.
FOUR CONSECUTIVE SIXES BY STOINIS AGAINST SHAMI pic.twitter.com/lLLjxF47oy
— Johns. (@CricCrazyJohns) April 12, 2025