SRH vs KKR : ఢిల్లీ వేదికగా జరుగుతున్న మ్యాచ్లో కోల్ కతా పై హైదరాబాద్ ఆటగాళ్లు తమ విశ్వరూపం చూపించారు. క్లాసెన్(105*) సెంచరీ తో అదరగొట్టాడు. హెడ్(76) 24 పరుగుల దూరంలో సెంచరీ మిస్ చేసుకున్నాడు. ఒకవేళ హెడ్ కనుక ఉండి ఉంటే హైదరాబాద్ 300 పరుగులు చేసేది. 300 లోడెడ్ అనే పదానికి సార్ధకత కలిగించేది. మొత్తానికి కోల్ కతా మీద 278 పరుగులు చేసిన హైదరాబాద్.. అనేక రికార్డులను బద్దలు కొట్టింది.
2024 నుంచి ఐపీఎల్లో ఇప్పటివరకు అత్యధిక సిక్సర్లు కొట్టిన ప్లేయర్ల జాబితాలో తొలి మూడు స్థానాల్లో ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లు ఉండడం విశేషం. ఈ జాబితాలో 76 సిక్సర్లతో నికోలస్ పూరన్ ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాడు. 70 సిక్సులతో అభిషేక్ శర్మ సెకండ్ ప్లేస్ లో ఉన్నాడు. 60 సిక్సులతో రియాన్ పరాగ్ థర్డ్ ప్లేస్ లో ఉన్నాడు. 57 సిక్సులతో విరాట్ కోహ్లీ ఫోర్త్ ప్లేస్ లో ఉన్నాడు.
టి20లలో అత్యధికంగా 250+స్కోర్లు చేసిన జట్టుగా హైదరాబాద్ తొలి స్థానంలో నిలిచింది. ఏకంగా ఐదుసార్లు 250 కంటే ఎక్కువ పరుగులు చేసిన జట్టుగా హైదరాబాద్ రికార్డ్ సృష్టించింది.
హైదరాబాద్ తర్వాత టీమిండియా మూడుసార్లు 250 కంటే ఎక్కువ పరుగులు చేసి రెండవ స్థానంలో ఉంది.
సర్రే జట్టు మూడుసార్లు 250 కంటే ఎక్కువ పరుగులు చేసి మూడో స్థానంలో కొనసాగుతోంది.
ఐపీఎల్ చరిత్రలో మూడు లేదా అంతకంటే తక్కువ స్థానాల్లో బ్యాటింగ్ కు వచ్చి సెంచరీలు చేసిన ప్లేయర్ల జాబితాలో క్లాసెన్ చోటు సంపాదించుకున్నాడు. ఈ జాబితాలో మూడు సెంచరీలతో ఏ బి డివిలియర్స్ మొదటి స్థానంలో ఉన్నాడు.
సంజు శాంసన్ మూడు సెంచరీలు చేసి రెండవ స్థానంలో కొనసాగుతున్నాడు.
రెండు సెంచరీలు చేసి సూర్య కుమార్ యాదవ్ మూడో స్థానంలో ఉన్నాడు..
క్లాసెన్ రెండు సెంచరీలు చేసి నాలుగు స్థానంలో ఉన్నాడు..
ఇక ఈ సీజన్ ప్రారంభంలో హైదరాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్లో పంజాబ్ జట్టుపై అభిషేక్ శర్మ 10 సిక్సర్లు కొట్టాడు. ఇప్పటివరకు ఇదే రికార్డుగా ఉంది. ఆ తర్వాత షారుక్ ఖాన్ యజమానిగా ఉన్న జట్టుతో జరిగిన మ్యాచ్లో.. ఢిల్లీ వేదికగా క్లాసెన్ 9 సిక్సర్లు కొట్టాడు..
గత ఏడాది రెండు వేరువేరు సందర్భాల్లో ఢిల్లీ క్యాపిటల్స్, బెంగళూరు పై 22 సిక్సర్లు బాదిన హైదరాబాద్.. ఆ తర్వాత ఈ సీజన్లో కోల్ కతా పై 19 సిక్సర్లు కొట్టింది. మొత్తంగా తన రికార్డుకు తనే చేరువగా వచ్చింది. ఈ జాబితాలో ఐపీఎల్లో మరే జట్టు లేకపోవడం విశేషం.
ఇక ఈ మ్యాచ్లో సెంచరీ ద్వారా క్లాసెన్ సరికొత్త రికార్డు సృష్టించాడు. అయితే ఐపీఎల్ లో అత్యంత ఫాస్ట్ సెంచరీ మాత్రం గేల్ మీద ఉంది.
గేల్ బెంగళూరు జట్టు తరఫున ఆడుతున్నప్పుడు పూణె జట్టుతో జరిగిన మ్యాచ్లో 30 బాల్స్ ఫేస్ చేసి సెంచరీ చేశాడు. 2013 ఐపీఎల్ లో ఈ అద్భుతం చోటుచేసుకుంది.
2025లో వైభవ్ సూర్య వంశీ రాజస్థాన్ రాయల్స్ తరఫున జైపూర్ వేదికగా గుజరాత్ టైటాన్స్ జట్టుపై 35 బాల్స్ లోనే సెంచరీ చేశాడు.
2010లో రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు యూసఫ్ పటాన్ ముంబై ఇండియన్స్ జట్టుతో జరిగిన మ్యాచ్లో 37 బాల్స్ లోనే సెంచరీ చేశాడు.
ఇక 2025 సీజన్లో ఢిల్లీ వేదికగా కోల్ కతా జట్టుతో జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ ఆటగాడు క్లాసెన్ 37 బాల్స్ లో సెంచరీ చేశాడు.
2013లో పంజాబ్ జట్టు ఆటగాడు డేవిడ్ మిల్లర్ బెంగళూరు తో మొహాలీ వేదిక జరిగిన మ్యాచ్లో 38 బాల్స్ లోనే సెంచరీ చేశాడు.
Varada kuda aapaleni Performance adi!
Heinrich Klaasen | #PlayWithFire | #SRHvKKR | #TATAIPL2025 pic.twitter.com/lCGKCzY8Qt
— SunRisers Hyderabad (@SunRisers) May 25, 2025