Mausam App : ఉష్ణోగ్రతలు పెరుగుతున్న వేళ, వాతావరణంలో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ పరిస్థితుల్లో ఎప్పటికప్పుడు వాతావరణ సమాచారాన్ని తెలుసుకోవడం అవసరం. దీనికోసం భారత వాతావరణ శాఖ (IMD), భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ (MoES) ఆధ్వర్యంలో ‘మౌసమ్’ (Mausam) అనే ప్రత్యేక మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ యాప్ ఎప్పటికప్పుడు రియల్ టైమ్ వాతావరణ అప్‌డేట్స్, వాతావరణ అంచనాలు, రాడార్ ఫోటోలు, వడగాల్పులు, భారీ వర్షాలు వంటి తీవ్ర వాతావరణ పరిస్థితులకు సంబంధించిన హెచ్చరికలను అందిస్తుంది. ఈ యాప్ వినియోగదారులకు ముందుగానే హెచ్చరికలను పంపడం ద్వారా, రాబోయే వాతావరణ పరిస్థితులకు సిద్ధం కావడంలో సాయపడుతుంది.
మౌసమ్ యాప్‌ను మీ ఆండ్రాయిడ్, ఐఓఎస్ (iOS) డివైజ్‌లలో ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి, ఇన్‌స్టాల్ చేసుకోవాలి అనే వివరాలను తెలుసుకుందాం.
ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతున్నట్లయితే, ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి
* ఆండ్రాయిడ్ ఫోన్‌లో Google Play Store ఓపెన్ చేయండి
* సెర్చ్ బార్‌లో “Mausam – IMD” అని టైప్ చేసి సెర్చ్ చేయాలి.
* IMD – AAS అనే డెవలపర్ రూపొందించిన యాప్‌ను ఐడెంటి ఫై చేయాలి.
* యాప్‌ను డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేయడానికి Install బటన్‌పై నొక్కాలి.
* ఇన్‌స్టాల్ అయిన తర్వాత, యాప్‌ను ఓపెన్ చేసి, లొకేషన్, నోటిఫికేషన్‌ల కోసం అడిగే పర్మిషన్లను ఇవ్వాలి.
మౌసమ్ యాప్‌ను iOS (iPhone)లో ఎలా డౌన్‌లోడ్ చేయాలి?
* ఐఫోన్‌లో App Store ఓపెన్ చేయాలి.
* సెర్చ్ బార్‌లో “Mausam IMD” అని టైప్ చేసి సెర్చ్ చేయాలి.
* India Meteorological Department అందించిన యాప్‌ను గుర్తించాలి.
* యాప్‌ను ఇన్‌స్టాల్ చేయడానికి Get బటన్‌పై నొక్కాలి.
* ఇన్‌స్టాల్ అయిన తర్వాత, యాప్‌ను ఓపెన్ చేసి, నోటిఫికేషన్‌లు, లొకేషన్ యాక్సెస్ కోసం పర్మిషన్లను ఇవ్వాలి.
భారీ వర్షాలు, వడగాల్పుల హెచ్చరికలను ఎలా ఆన్ చేయాలి?
* మీ డివైజ్‌లో మౌసమ్ యాప్‌ను తెరవండి.
* లొకేషన్, నోటిఫికేషన్‌లు మొదలైన అవసరమైన పర్మిషన్లను ఇవ్వాలి.
* మీరు IMD జారీ చేసే వాతావరణ హెచ్చరికల గురించి నోటిఫికేషన్‌లు పొందుతారు.
* యాప్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి, “Rain alert” ఆప్షన్‌ను ఆన్ చేయాలి (ఎనేబుల్ చేయండి).
* మీరు సెలక్ట్ చేసుకున్న ప్రాంతాల ఆధారంగా, భారీ వర్షాలు, వడగాల్పులు, ఉరుములు, తుఫానులు వంటి వాటికి సంబంధించిన హెచ్చరికలను ఈ యాప్ మీకు పుష్ నోటిఫికేషన్ల రూపంలో పంపుతుంది. ఈ హెచ్చరికలను IMD జారీ చేస్తుంది. వాటిని క్రమం తప్పకుండా అప్‌డేట్ చేస్తుంది.
మౌసమ్ యాప్ స్పెషాలిటీ
మౌసమ్ యాప్ ఇతర వెదర్ యాప్‌ల మాదిరిగానే పనిచేస్తుంది.కానీ ఇది భారత ప్రభుత్వం అధికారిక యాప్ కావడం దీని ప్రత్యేకత.
* తాజా వాతావరణ పరిస్థితులు: వినియోగదారులు ఒక నిర్దిష్ట ప్రాంతంలో తాజా, వెదర్ అప్ డేట్స్ చెక్ చేసుకోవచ్చు.
* వాతావరణ ప్రమాద హెచ్చరికలు: వడగాల్పులు, ఉరుములు లేదా ఇతర వాతావరణ సంబంధిత ప్రమాదాల గురించి ఈ యాప్ అప్ డెట్ నోటిఫికేషన్‌లను అందిస్తుంది.
* వారంవారీ అప్‌డేట్‌లు: వాతావరణానికి సంబంధించిన వారంవారీ అప్‌డేట్‌లు కూడా అందుబాటులో ఉంటాయి.
* ‘ఫీల్స్ లైక్’ డేటా: యాప్‌లో ‘ఫీల్స్ లైక్’ డేటా కూడా అందుబాటులో ఉంటుంది.