SRH Vs KKR (6)
SRH Vs KKR: ఐపీఎల్ లో లక్నో జట్టు బౌలర్ దిగ్వేష్ సింగ్ రాటి(Digvesh Singh Rathi) “నోట్ బుక్ సంతకం” తో ఎంతటి వివాదాస్పదుడయ్యాడో అందరికీ తెలుసు. అతడి తీరు బాగోలేకపోవడంతో ఐపీఎల్ ప్యానల్ కమిటీ మ్యాచ్ ఫీజులో ఏకంగా 25 శాతం కోత విధించింది. అయినప్పటికీ కొంతమంది ఆటగాళ్లు తమ తీరు మార్చుకోవడం లేదు. పైగా మరింత రెచ్చిపోతున్నారు.
Also Read: పాపం కావ్య పాప.. బిక్క ముఖంతో.. గుండెలు తరుక్కుపోతున్నాయ్ రా..
ఈ జాబితాలోకి ఇప్పుడు కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు బౌలర్ హర్షిత్ రాణా కూడా చేరినట్టు తెలుస్తోంది. కిస్సింగ్ ప్లేయర్ (ప్రత్యర్థి ఆటగాళ్లకు ఫ్లయింగ్ కిస్ లు ఇస్తుంటాడు) గా పేరుపొందిన ఇతడు.. ఈ సీజన్లోనూ తన పేరు, తీరు మార్చుకోవడం లేదు. తొలి మూడు మ్యాచులలో నిదానంగా ఉన్న ఇతడు.. గురువారం సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుతో జరిగిన మ్యాచ్లో రెచ్చిపోయాడు. వికెట్ తీసిన ఆనందంలో ప్రత్యర్థి ఆటగాడికి ఫ్లయింగ్ కిస్ ఇచ్చాడు. ఇప్పుడు ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. ఈడెన్ గార్డెన్స్ వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్ కతా నైట్ రైడర్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన కోల్ కతా జట్టు 6 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది.. వెంకటేష్ అయ్యర్ (60), రఘు వంశీ (50) దుమ్ము రేపే ఇన్నింగ్స్ ఆడారు. దీంతో హైదరాబాద్ ఎదుట 201 పరుగుల విజయ లక్ష్యాన్ని ఉంచారు.
దారుణంగా విఫలమైంది
201 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ మొదలుపెట్టిన హైదరాబాద్ జట్టుకు ప్రారంభంలోనే వరుస ఎదురుదెబ్బలు తగిలాయి..హెడ్(4), ఇషాన్ కిషన్(2), అభిషేక్ శర్మ (2), నితీష్ కుమార్ రెడ్డి (19), అనికేత్ వర్మ (6) విఫలమయ్యారు.. దీంతో హైదరాబాద్ జట్టు ఓటమిపాలైంది. ఇక ఈ మ్యాచ్లో అభిషేక్ శర్మ వికెట్ ను హర్షిత్ రాణా పడగొట్టాడు. హర్షిత్ వేసిన బంతిని తప్పుగా అంచనా వేసిన అభిషేక్ శర్మ వెంకటేష్ అయ్యర్ కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఈ నేపథ్యంలో అభిషేక్ శర్మ వికెట్ తీసిన ఆనందంలో హర్షిత్ రాణా ఎగిరి గంతేశాడు. అంతేకాదు తన అలవాటైన స్టైల్ లో ఫ్లయింగ్ కిస్ ఇచ్చాడు. రెండు పరుగులకే అవుట్ కావడంతో నిరాశగా పెవిలియన్ చేరుకుంటున్న అభిషేక్ శర్మను.. ఫ్లయింగ్ కిస్ ఇచ్చి మరింతగా రెచ్చగొట్టాడు హర్షిత్.. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయి.. అయితే అంతకుముందు సీజన్లలో హర్షిత్ ఇలానే చేయడంతో ఐపీఎల్ ప్యానల్ కమిటీ హెచ్చరించింది. దీంతో అతడు కొద్ది రోజులు క్రమశిక్షణతోనే ఉన్నాడు. మళ్లీ ఈ సీజన్లో మొదలుపెట్టాడు. తొలి మూడు మ్యాచ్ లలో బాగానే ఉన్నప్పటికీ.. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుతో జరిగిన మ్యాచ్లోనే రెచ్చిపోయాడు. మరి ఈసారి ఐసీసీ ప్యానల్ కమిటీ హర్షిత్ పై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సి ఉంది.
HARSHIT RANA GETS ABHISHEK SHARMA#IPL2025 | #KKRvsSRH pic.twitter.com/PESS0YemuX
— KKR Vibe (@KnightsVibe) April 3, 2025