Homeక్రీడలుక్రికెట్‌SRH Vs KKR: 300 కాదు భయ్యో..9 రన్స్ కే మూడు పోయాయక్కడ!

SRH Vs KKR: 300 కాదు భయ్యో..9 రన్స్ కే మూడు పోయాయక్కడ!

SRH Vs KKR: ఈ ఐపిఎల్ సీజన్లో 300 పరుగులు చేసే సత్తా ఉన్న జట్టుగా సన్ రైజర్స్ హైదరాబాద్ పేరు తెచ్చుకుంది. అందరి అంచనాలకు తగ్గట్టుగానే తొలి మ్యాచ్లో రాజస్థాన్ జట్టుపై 286 పరుగులు చేసింది. ఇక ఆ తర్వాత మ్యాచ్లలో వరుసగా విఫలమైంది. లక్నో జట్టు పై ఓడిపోయింది. ఢిల్లీ జట్టు పై పరాజయం పాలైంది. అంతిమంగా పాయింట్లు పట్టికలో ఎనిమిదో స్థానంలో కొట్టుమిట్టాడుతోంది. ఇలాంటి జట్టు గురువారం ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్ కతా నైట్ రైడర్స్ తో తలపడుతోంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన హైదరాబాద్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. ప్రారంభంలో మెరుగ్గానే బౌలింగ్ వేసిన హైదరాబాద్ బౌలర్లు.. ఆ తర్వాత చేతులెత్తేశారు. దీంతో కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు 200 పరుగులు చేసింది. కోల్ కతా జట్టు లో వెంకటేష్ అయ్యర్ (60) 60 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. రఘువంశి (50) హాఫ్ సెంచరీ చేశాడు. 201 పరుగుల విజయ లక్ష్యంతో రంగంలోకి దిగిన హైదరాబాద్ జట్టుకు ప్రారంభంలోనే ఎదురు దెబ్బ తగిలింది.

Also Read: ఈడెన్ గార్డెన్స్ సగం ఖాళీ.. కారణం ఇదే..

మూడు వికెట్లు టపా టపా

భీకరమైన ఫామ్ లో ఉన్న హైదరాబాద్ ఓపెనర్ హెడ్(4) నాలుగు పరుగులు మాత్రమే చేసి వైభవ్ అరోరా బౌలింగ్లో హర్షిత్ రాణాకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఈ దశలో వచ్చిన ఇషాన్ కిషన్(2) రెండు పరుగులు మాత్రమే చేసి వైభవ్ అరోరా బౌలింగ్లో అజింక్యా రహానే కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. నీతో హైదరాబాద్ జట్టులో ఒకసారి గా కల్లోలం రేగింది. ఇక ఇదే దశలో మరో ఓపెనర్ అభిషేక్ శర్మ (2) రెండు పరుగులు మాత్రమే చేసి హర్షిత్ రాణా బౌలింగ్లో వెంకటేష్ అయ్యర్ కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.. అప్పటికే హైదరాబాద్ జట్టు స్కోర్ కేవలం 9 పరుగులు మాత్రమే. కీలకమైన మూడు వికెట్లు కోల్పోవడంతో హైదరాబాద్ జట్టు పీకల్లోతు కష్టాల్లో పడింది. మొన్నటిదాకా 300 స్కోర్ చేస్తుంది.. ఈ సీజన్ లో హైదరాబాద్ జట్టు పరుగుల వరద పారిస్తుంది అని అందరూ అనుకున్నారు. ఎన్ని ఓటములు ఎదురైనప్పటికీ.. దూకుడు అనేది తగ్గదని హైదరాబాద్ కెప్టెన్ కమిన్స్ ఇటీవల వ్యాఖ్యానించాడు. కానీ అవి కూడా గురువారం నాటి మ్యాచ్లో కనిపించ లేదు. మొత్తంగా చూస్తే హైదరాబాద్ ఆటగాళ్లు దారుణమైన ఆట తీరుతో అభిమానులను నిరాశపరిచారు. కొండంత లక్ష్యం ముందున్న నేపథ్యంలో హైదరాబాద్ గెలవాలంటే అద్భుతమే జరగాలి. ఇప్పటికే రెండు వరుస ఓటములతో హైదరాబాద్ జట్టు పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో ఉంది.. ఈ మ్యాచ్ కూడా ఓడిపోతే 9 లేదా పదో స్థానానికి పడిపోతుంది. ఈ కథనం రాసి సమయానికి తెలుగు ఆటగాడు నితీష్ కుమార్ రెడ్డి(19), కామిందు మెండీస్(5) పరుగులతో క్రీజ్ లో ఉన్నారు. హైదరాబాద్ విజయానికి ఇంకా 169 పరుగులు కావాలి. చేతిలో ఏడు వికెట్లు ఉన్నాయి..

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version