https://oktelugu.com/

Sunrisers Hyderabad : కావ్య పాపకు గట్టి షాక్ ఇచ్చిన ఫ్యాట్ కమిన్స్.. సన్‌రైజర్స్ పరిస్థితి ఏంటో?

గతంలో ఎన్నడూ లేని విధంగా సన్‌రైజర్స్‌ జట్టును విజయాలతో నడిపిస్తూ ఫైనల్ వరకూ చేర్చాడు. మరోవైపు.. మేనేజ్‌మెంట్ కమిన్స్‌పై పెట్టుకున్న నమ్మకాన్ని సైతం నిలబెట్టుకున్నాడు. తన బౌలింగ్, బ్యాటింగుతో అభిమానులను ఆకట్టుకున్నాడు. అలా ఆయన ఆరెంజ్ ఆర్మీకి ఎంతగానో ప్రియమైన కెప్టెన్‌గా మారిపోయాడు.

Written By:
  • Srinivas
  • , Updated On : October 16, 2024 / 04:03 PM IST

    Sunrisers Hyderabad

    Follow us on

    Sunrisers Hyderabad : ఐపీఎల్‌లో మరోసారి సన్‌రైజర్స్‌కు అంతటి ఊపు వచ్చిందంటే అది ప్యా్ట్ కమిన్స్ వల్లే అని చెప్పాలి. గత ఐపీఎల్ సీజన్‌లో కమిన్స్ సన్‌రైజర్స్‌ హైదరాబాద్ రాతను మార్చేశాడు. మూడేళ్లుగా మినిమం ఫామ్ కూడా చూపించని జట్టును అగ్రశిఖరాలకు చేర్చాడు. కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టి జట్టును ఫైనల్ వరకు తీసుకెళ్లాడు. సరే.. ఫైనల్‌లో ఓడిపోయినప్పటికీ అసలు సన్‌రైజర్స్‌ అక్కడి వరకు చేరుతుందని ఎవరూ ఊహించలేదు. కమిన్స్ నేతృత్వంలో జట్టు సృష్టించిన విధ్వంసం అంతాఇంతా కాదు. సన్‌రైజర్స్‌ రికార్డు పరుగులకు కేరాఫ్ అడ్రస్ అయింది. గ్రౌండ్ ఏదైనా.. బ్యాటర్ ఎవరైనా పరుగుల వరద పారించారు. రికార్డు స్కోరు నమోదు చేశారు. తన రికార్డులను తానే బద్దలు కొట్టే స్థాయికి జట్టు వెళ్లింది.

    ఆస్ట్రేలియా వన్డే, టెస్టు జట్టు కెప్టెన్ అయిన ప్యాట్ కమిన్స్‌ను గత ఐపీఎల్ సీజన్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్ యాజమాన్యం రూ.20.50 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. అయితే.. ఆ సందర్భంలో సన్‌రైజర్స్‌ యాజమాన్యంపై చాలా వరకు విమర్శలే వచ్చాయి. ఫామ్‌లో లేని వ్యక్తికి అన్ని కోట్లు వెచ్చించడం వేస్ట్ అని చాలా మంది క్రికెటర్లు సైతం పెదవి విరిచారు. కానీ.. కమిన్స్ మాత్రం వారందరి విమర్శలకు చెక్ పెట్టేశాడు.

    గతంలో ఎన్నడూ లేని విధంగా సన్‌రైజర్స్‌ జట్టును విజయాలతో నడిపిస్తూ ఫైనల్ వరకూ చేర్చాడు. మరోవైపు.. మేనేజ్‌మెంట్ కమిన్స్‌పై పెట్టుకున్న నమ్మకాన్ని సైతం నిలబెట్టుకున్నాడు. తన బౌలింగ్, బ్యాటింగుతో అభిమానులను ఆకట్టుకున్నాడు. అలా ఆయన ఆరెంజ్ ఆర్మీకి ఎంతగానో ప్రియమైన కెప్టెన్‌గా మారిపోయాడు.

    ఈ ఐపీఎల్ సీజన్‌లోనూ సన్‌రైజర్స్‌ యజమానురాలు కావ్య మరోసారి కమిన్స్‌ సారథ్యాన్నే కంటిన్యూ చేస్తారని అందరూ అనుకుంటున్నారు. ఈ క్రమంలోనే టీమిండియా మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా పెద్ద బాంబ్ పేల్చాడు. ఈ సారి సీజన్‌కు కమిన్స్‌ను సన్‌రైజర్స్‌ అంటిపెట్టుకోదని స్టేట్‌మెంట్ ఇచ్చాడు. అతన్ని టీమ్ నుంచి రిలీజ్ చేస్తుందని చెప్పాడు. కొత్త నిబంధనల ప్రకారం.. మొదటి ప్లేయర్‌గా అతడిని తీసుకునే పరిస్థితి వస్తే రూ.18 కోట్లు ఇవ్వా్ల్సి వస్తుందని చెప్పాడు. కెప్టెన్‌గా కమిన్స్ రాణించినప్పటికీ ఫ్రాంచైజీ మాత్రం అతడిని రిలీజ్ చేస్తుందనే చెప్పాడు.

    దీనికి కూడా పలు కారణాలు వినిపిస్తున్నాయి. ఆస్ట్రేలియాకు ఉన్న బిజీలో కమిన్స్ ఈ ఏడాది ఐపీఎల్ ఆడే అవకాశాలు లేనట్లుగా చెప్పాడు. ఒకవేళ ఆసిస్ షెడ్యూలుకు ఐపీఎల్ షెడ్యూల్ అడ్డు రాకుంటే అప్పుడు కమిన్స్ కంటిన్యూ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వేలంలో తన పేరు నమోదు చేసుకొని.. ఆ తర్వాత తప్పుకున్న సందర్భాలూ ఉన్నాయని కమిన్స్ ఇదివరకే చెప్పాడు. గతంలో మిచెల్ స్టార్క్ వంటి ఆసిస్ ఆటగాళ్లు కూడా ఇలానే చేశారు. ఈ క్రమంలో ఆరెంజ్ ఆర్మీలో ఒక్కసారిగా ఆందోళనలు మొదలయ్యాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ మరోసారి కమిన్స్‌నే కొనసాగించాలని ముక్తకంఠంతో కోరుతున్నారు. ఒకవేళ కమిన్స్ కనుక మిస్ అయితే ఇక జట్టు పరిస్థితి ఆందోళనకరమేనన్న కామెంట్స్ చేస్తున్నారు.