SRH Vs LSG
SRH Vs LSG: నిలవాలంటే గెలవాల్సిన మ్యాచ్లో.. హైదరాబాద్ గెలిచి చూపించింది. అది అలాంటి, ఇలాంటి గెలుపు కాదు.. ఈ విజయంతో హైదరాబాద్ ఏకంగా పాయింట్లు పట్టికలో మూడవ స్థానానికి వెళ్లిపోయింది. ప్లే ఆఫ్ ఆశలను మరింత బలోపేతం చేసుకుంది. వాస్తవానికి చెన్నై, బెంగళూరు, ముంబై జట్లతో జరిగిన మ్యాచ్లలో ఓడిపోయిన హైదరాబాద్.. బుధవారం రాత్రి లక్నోతో జరిగిన మ్యాచ్ తో గట్టి కం బ్యాక్ ఇచ్చింది.. పది వికెట్ల తేడాతో ఘనవిజయాన్ని అందుకొని, నెట్ రన్ రేట్ ను మరింత సుస్థిరం చేసుకుంది.. లక్నో విధించిన పరుగుల లక్ష్యాన్ని చేదించే క్రమంలో హైదరాబాద్ గత రికార్డులను మొత్తం బద్దలు కొట్టింది. 167 పరుగుల లక్ష్యాన్ని 62 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. దీంతో అనేక రికార్డులు హైదరాబాద్ జట్టు పాదాక్రాంతమయ్యాయి. ఇంతకీ బద్దలైన అ రికార్డులు ఏమిటంటే..
లక్నో జట్టు పై హైదరాబాద్ 9.4 ఓవర్లలోనే 166 రన్ టార్గెట్ చేజ్ చేసింది. ఇంకా 62 బంతులు మిగిలి ఉండగానే గెలుపును అందుకుంది. టి20 క్రికెట్లో 150+ పరుగుల లక్ష్యాన్ని చేదించడంలో సన్ రైజర్స్ అత్యుత్తమమైన రికార్డు నెలకొల్పింది. 2018-19 బీబీఎల్ లో మెల్బోర్న్ స్టార్స్ పై బ్రిస్బేన్ హీట్ ఇదే స్థాయిలో విజయాన్ని అందుకుంది. 157 రన్ టార్గెట్ ను 60 బంతులు మిగిలి ఉండగానే కొట్టి పడేసింది.
2018లో నార్త్ అంప్టన్ షైర్, వోర్సెస్టర్ షైర్ టీ -20 మ్యాచ్ జరిగింది.. ఈ మ్యాచ్లో భాగంగా నార్త్ అంప్టన్ షైర్ 162 పరుగుల విజయ లక్ష్యాన్ని విధించింది. దీనిని వోర్సెస్టర్ షైర్ అత్యంత సులభంగా చేదించింది. ఇదే ఇప్పటివరకు రికార్డుగా ఉండేది. కానీ ఈ రికార్డును హైదరాబాద్ జట్టు బద్దలు కొట్టింది.. బుధవారం జరిగిన మ్యాచ్లో లక్నో విధించిన 167 రన్స్ టార్గెట్ ను 9.4 ఓవర్లలోనే చేదించింది..
ఈ మ్యాచ్లో హైదరాబాద్ పవర్ ప్లే లో 107 రన్స్ కొట్టింది. టి20 లలో ఇది రెండవ అత్యధిక స్కోరు. గత నెలలో ఢిల్లీ జట్టుతో జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ పవర్ ప్లే లో ఏకంగా 125 రన్స్ చేసింది. ఇది ఐపీఎల్ చరిత్రలో అత్యధిక రికార్డుగా ఉంది.
ఈ సీజన్లో 12 మ్యాచ్లలో హైదరాబాద్ జట్టు ఏకంగా 146 సిక్స్ లు కొట్టింది. ఒక టి20 టోర్నమెంట్లో ఒక జట్టు ఈ స్థాయిలో సిక్స్ లు కొట్టడం ఇదే ప్రథమం. 2018 ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ కొట్టిన 145 సిక్స్ ల రికార్డును హైదరాబాద్ బద్దలు కొట్టింది..
ఇక ఈ మ్యాచ్లో లక్నో జట్టు పవర్ ప్లే లో రెండు వికెట్లకు 27 పరుగులు మాత్రమే చేసింది. హైదరాబాద్ వికెట్ కోల్పోకుండా 107 రన్స్ చేసింది. ఈ రెండు జట్ల మధ్య పవర్ ప్లే లో స్కోర్ వ్యత్యాసం 80 పరుగులుగా ఉంది. ఇది ఐపీఎల్ లోనే అతిపెద్ద రికార్డు. గత శనివారం బెంగళూరు, గుజరాత్ జట్ల మధ్య మ్యాచ్ జరిగినప్పుడు గుజరాత్ పవర్ ప్లే లో మూడు వికెట్లు కోల్పోయి మూడు పరుగులు చేస్తే, బెంగళూరు ఒక వికెట్ కోల్పోయి 92 పరుగులు చేసింది. ఈ రెండు జట్ల మధ్య వ్యత్యాసం 70 పరుగులుగా నమోదయింది. దానిని హైదరాబాద్ బ్రేక్ చేసింది.
ఇక హైదరాబాద్ ఓపెనర్ హెడ్ ఈ ఐపీఎల్లో 20 కంటే తక్కువ బంతుల్లో మూడు అర్థ సెంచరీలు కొట్టాడు. హెడ్ తర్వాత స్థానంలో జేక్ ఫ్రెజర్ కొనసాగుతున్నాడు. అతడు 20 కంటే తక్కువ బంతుల్లో మూడుసార్లు అర్థ సెంచరీలు చేశాడు. హెడ్ 16 బంతుల్లో రెండు అర్థ సెంచరీలు సాధించాడు.. ఐపీఎల్ లో హైదరాబాద్ జట్టుకు ఇది ఒక రికార్డ్.
లక్నో జట్టు పై హెడ్, అభిషేక్ శర్మ నెలకొల్పిన 167 పరుగుల భాగస్వామ్యం (17.27 రన్ రేట్) ఐపీఎల్ లో అత్యుత్తమమైనది. టి20 చరిత్రలో రెండవ అతిపెద్దది. ఇక 10 వికెట్ల తేడాతో విజయం సాధించడం హైదరాబాద్ జట్టు ఇది రెండవసారి.. 2020లో జరిగిన మ్యాచ్లో ముంబై 150 రన్స్ టార్గెట్ విధించగా.. దానిని వికెట్ కోల్పోకుండా హైదరాబాద్ చేదించింది. ఆ తర్వాత బుధవారం లక్నో జట్టుతో జరిగిన మ్యాచ్లో 167 పరుగుల లక్ష్యాన్ని వికెట్ కోల్పోకుండా సాధించింది.
టి20 క్రికెట్లో 150 + చేజింగ్ లో పాకిస్తాన్ మాత్రమే రెండుసార్లు పది వికెట్లు తేడాతో విజయాలను అందుకుంది. ఇక లక్నోతో జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ ఓపెనర్లు 58 బంతుల్లో 16 ఫోర్లు, 14 సిక్సర్లు కొట్టారు. అభిషేక్, హెడ్ 12 సింగిల్స్, రెండు టుడీలు మాత్రమే తీశారంటే వారి బ్యాటింగ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.