https://oktelugu.com/

Virat Kohli Vs Dhoni: కోహ్లీకి, ధోనికి తేడా ఏంటో తెలుసా?

విరాట్ కోహ్లీ గతంతో పోలిస్తే చాలా మారిపోయాడు. స్టేడియంలో అగ్రశవుగా కనిపించడం లేదు. ప్రశాంతంగా మారిపోయాడు అంటూ గత కొన్నాళ్లుగా అభిమానులతో పాటు చాలామంది భావిస్తూ వస్తున్నారు. అయితే విరాట్ కోహ్లీ లో అటువంటి మార్పు ఏమీ రాలేదని యజ్వేంద్ర చాహల్ స్పష్టం చేశాడు. కోహ్లీలో ఎలాంటి మార్పు లేదని, అతను గతంలో ఉన్నట్లే పూర్తి అగ్రేసివ్ గా ఉన్నాడని చాహాల్ స్పష్టం చేశాడు.

Written By:
  • BS
  • , Updated On : July 17, 2023 / 01:50 PM IST

    Virat Kohli Vs Dhoni

    Follow us on

    Virat Kohli Vs Dhoni: ఇండియన్ క్రికెట్ లో అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ధోని, విరాట్ కోహ్లీ పేర్లు ముందు వరుసలో ఉంటాయి. వీరిద్దరూ కెప్టెన్లుగానే కాకుండా ఆటగాళ్లగాను తమ సత్తాను నిరూపించుకున్నారు. క్రికెట్ అభిమానులు ఎప్పుడు చర్చ పెట్టినా వీరిద్దరి గురించి పోలిక పెట్టడం పరిపాటిగా మారింది. అయితే వీరిద్దరి మధ్య ఉన్న సారూప్యతలు, విభిన్నమైన అంశాల గురించి టీమ్ ఇండియా స్టార్ లెగ్ స్పిన్నర్ యజ్వేంద్ర చాహల్ బయటపెట్టాడు. కోహ్లీకి, ధోనీకి మధ్య ఉన్న తేడా ఏంటో మీరు చదివేయండి.

    టీమిండియా స్టార్ క్రికెటర్లు ధోనీ, విరాట్ కోహ్లీ గురించి ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయితే వీరిద్దరూ ఆన్ ఫీల్డ్, ఆఫ్ ఫీల్డ్ ఎలా ఉంటారనే విషయంపై అభిమానులకు ఆసక్తి ఉంటుంది. ధోని మిస్టర్ కూల్ అయితే, విరాట్ కోహ్లీ అగ్రెసివ్ యాటిట్యూడ్ కలిగిన క్రికెటర్. వీరిద్దరూ జట్టుకు అవసరమైన సందర్భాల్లో గొప్ప విజయాలను అందించి పెట్టారు. కెప్టెన్లగాను తమని తాము నిరూపించుకున్నారు. ఈ నేపథ్యంలో వీరిద్దరికి సంబంధించిన కీలక విషయాలను ఇండియా స్టార్ స్పిన్నర్ యజ్వేంద్ర చాహల్ బయట పెట్టాడు.

    కోహ్లీ లో ఎటువంటి మార్పు లేదు..

    విరాట్ కోహ్లీ గతంతో పోలిస్తే చాలా మారిపోయాడు. స్టేడియంలో అగ్రశవుగా కనిపించడం లేదు. ప్రశాంతంగా మారిపోయాడు అంటూ గత కొన్నాళ్లుగా అభిమానులతో పాటు చాలామంది భావిస్తూ వస్తున్నారు. అయితే విరాట్ కోహ్లీ లో అటువంటి మార్పు ఏమీ రాలేదని యజ్వేంద్ర చాహల్ స్పష్టం చేశాడు. కోహ్లీలో ఎలాంటి మార్పు లేదని, అతను గతంలో ఉన్నట్లే పూర్తి అగ్రేసివ్ గా ఉన్నాడని చాహాల్ స్పష్టం చేశాడు. మైదానం బయట కోహ్లీ ప్రశాంతంగా కనిపిస్తున్నాడు కదా అంటే.. కోహ్లీ ఎప్పుడు అలాగే ఉండేవాడిని స్పష్టం చేశాడు చాహల్. మైదానంలో పూర్తి అగ్రేషివ్ గా కనిపించే కోహ్లీ.. బయట మాత్రం ఎప్పుడూ ప్రశాంతంగానే ఉంటాడని, ఆ విషయం చాలామందికి తెలియదు అని స్పష్టం చేశాడు. కోహ్లీ ఏ మాత్రం మారలేదని.. మైదానంలో అతను ఎప్పటిలాగే దూకుడుగా ఉన్నాడు అని చాహల్ వెల్లడించాడు. ఒకప్పుడు పాంటింగ్ నేతృత్వంలో ఆస్ట్రేలియా జట్టు ప్రత్యర్ధులను స్లెడ్జింగ్చేస్తూ డామినేట్ చేసేదని, కానీ అటువంటి జట్టుకు ఆస్ట్రేలియా వెళ్లి తమదైన దూకుడుతో విరాట్ కోహ్లీ నేతృత్వంలోని భారత జట్టు ధీటుగా బదులు చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా చాహాల్ గుర్తు చేశాడు. తన కెరీర్ మెరుగవడానికి కూడా కోహ్లీ చాలా సహకారం అందించాడని గుర్తు చేసుకున్నాడు.

    ధోని నిరంతరం సలహాలు, సూచనలు అందిస్తాడు..

    మహేంద్ర సింగ్ ధోని గురించి కూడా చాహల్ కీలక విషయాలను బయటకు వెల్లడించాడు. ధోని సారధ్య బాధ్యతలు నిర్వహించడంలో ఎంత కూల్ గా ఉంటాడో.. సహచర ఆటగాళ్లతోనూ అంతే సరదాగా ఉంటాడు. ఇదే విషయాన్ని చాహాల్ కూడా స్పష్టం చేశాడు. ఆన్ ఫీల్డ్, ఆఫ్ ఫీల్డ్ లో చేష్టలతో సహచారులను ఆటపట్టించే చాహల్.. ధోని ఎదురుపడితే మాత్రం సైలెంట్ గా అయిపోతాడు. కేవలం ధోని ముందు మాత్రమే తాను సైలెంట్ గా ఉంటానని, అతడు తన ముందుకు వచ్చేసరికి నోరు ఆటోమేటిగ్గా మూతపడుతుందని చాహల్ వెల్లడించాడు. మహీ బాయ్ ముందు కూర్చుని అతడు అడిగిన వాటికి మాత్రమే సమాధానం ఇస్తానని, లేకపోతే నిశ్శబ్దంగా ఉంటానని వెల్లడించాడు. గతంలో దక్షిణాఫ్రికా తో జరిగిన టి20 మ్యాచ్లో నాలుగు వాగులు వేసి 64 పరుగులు సమర్పించుకున్నప్పటికీ.. ధోని తనపై నమ్మకం ఉంచి అవకాశాలు కల్పించిన విషయాన్ని గుర్తు చేసుకున్నాడు. దక్షిణాఫ్రికా తో టి20 ఆడుతున్నప్పుడు.. నాలుగు ఓవర్లలో 64 పరుగులు బాదారని, l క్లాసెన్ తన బౌలింగ్ లో దంచి కొడుతున్నాడని, వెంటనే ధోని తన వద్దకు వచ్చి రౌండ్ ద వికెట్ వేస్తావా..? అంటూ అడిగిన విషయాన్ని చాహల్ బయట పెట్టాడు. అలా వేసినప్పటికీ క్లాసెన్ సిక్స్ కొట్టాడని, మళ్లీ ధోని తన వద్దకు వచ్చి.. ‘ ఈరోజు నీది కాదు.. అయినా పర్లేదు’ అంటూ భుజం తట్టిన విషయాన్ని చాహల్ తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నాడు. ఈ విధంగా ధోని, కోహ్లీ గురించి చాహల్ కీలక విషయాలను బయట పెట్టడం ద్వారా అభిమానులకు అనేక అంశాలపై స్పష్టత వచ్చేలా చేశాడు.