Pawan Kalyan Bro Movie: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా విడుదల అంటే ఏ రేంజ్ హడావడి ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన సినిమా విడుదలయ్యే నెల మొత్తం పండుగ వాతారవరణం నెలకొంటుంది. ఎక్కడ చూసిన భిమానుల కోలాహలమే కనిపిస్తాడు. కానీ ఆయన హీరో గా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘బ్రో ది అవతార్’ విషయంలో మాత్రం అవి ఈసారి బాగా తగ్గింది అనే చెప్పాలి. అసలు పవన్ కళ్యాణ్ సినిమా విడుదల 10 రోజుల ముందు ఇంత గుట్టుచప్పుడు వాతావరణం ఏ చిత్రానికి కూడా లేదు.
అందుకు కారణాలు కూడా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ ‘వారాహి విజయయాత్ర’ లో బిజీ గా ఉండడం వల్ల అభిమానులు కూడా తమ ఫోకస్ ని పూర్తి సినిమాల వైపు నుండి మరలించి వారాహి యాత్ర మీదనే ఫోకస్ చెయ్యడం. దానికి తోడు సినిమా ప్రొమోషన్స్ విషయం లో మేకర్స్ తమకి ఏ సంబంధం లేదు అన్నట్టుగా వ్యవహరించడం ఈ సినిమా మీద హైప్ ని జెనరేట్ చేయలేకపోయాయి.
మరో ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏమిటంటే ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఇంకా చాలావరకు బ్యాలన్స్ ఉండిపోయింది అట. పవన్ కళ్యాణ్ తన పాత్రకి సంబంధించి డబ్బింగ్ ఇంకా చెప్పలేదు. అంతే కాకుండా థమన్ బ్యాక్ గ్రౌండ్ వర్క్ ఇంకా పూర్తి చెయ్యలేదు. రీ ఏకార్డింగ్ ఇంకా జరుగుతూనే ఉంది. సినిమా నుండి టీజర్ విడుదల అవ్వాలన్నా, ట్రైలర్ విడుదల అవ్వాలన్నా త్రివిక్రమ్ శ్రీనివాస్ అనుమతి ఉండాల్సిందే.
ఆయనకీ ఔట్పుట్ చూపించి ఓకే చేయించడం బాగా ఆలస్యం అవుతుంది.ఎందుకంటే ఆయన మహేష్ బాబు తో ‘గుంటూరు కారం’ సినిమా షూటింగ్ లో బిజీ గా ఉన్నాడు. అలా సమయానికి ఏది జరగకపోవడం బ్రో చిత్రం ప్రమోషనల్ కంటెంట్ విషయం లో ఇంత జాప్యం జరుగుతుంది. రేపు మొదటి కాపీ చూసిన తర్వాత త్రివిక్రమ్ కి సినిమా క్వాలిటీ నచ్చకపోతే ఈ చిత్రం వాయిదా పడే అవకాశం కూడా ఉందని అంటున్నారు ట్రేడ్ పండితులు.