Ravichandran Ashwin Retirement: ఇండియన్ టీం లో దిగ్గజస్పిన్నర్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న బౌలర్ రవిచంద్రన్ అశ్విన్… ఒకప్పుడు అనిల్ కుంబ్లే, హర్భజన్ సింగ్ లాంటి దిగ్గజ స్పిన్నర్లు ఇండియన్ టీం కి చాలా విజయాలను కట్టబెట్టారు. ఇక వాళ్ళ తర్వాత వాళ్ళ లెగసీని ముందుకు తీసుకెళ్లిన ఒకే ఒక స్పిన్నర్ చంద్రన్ అశ్విన్ ఈయన వల్ల చాలా మ్యాచుల్లో ఇండియన్ టీమ్ విజయం సాధించడమే కాకుండా చాలా అరుదైన రికార్డులను కూడా సొంతం చేసుకుంది. మరి ఈయన ఆస్ట్రేలియాతో మూడో టెస్ట్ మ్యాచ్ ముగిసిన అనంతరం అంతర్జాతీయ క్రికెట్ కి వీడ్కోలు పలుకుతున్నట్టుగా ఒక అనౌన్స్ మెంట్ అయితే ఇచ్చాడు. ఇక దీనిని బీసీసీఐ కూడా అధికారికంగా ప్రకటించింది…
మరికొన్ని సంవత్సరాలపాటు ఇండియన్ టీమ్ కి తన సేవలను అందిస్తాడు అనుకున్న రవిచంద్రన్ అశ్విన్ ఇలా సడన్ గా అందరికీ షాక్ ఇస్తూ అంతర్జాతీయ క్రికెట్ కి గుడ్ బై చెప్పడం అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరిని తీవ్రమైన దిగ్భ్రాంతికి గురి చేస్తుందనే చెప్పాలి… ఇక ఇపుడున్న పరిస్థితిలో ఆయన లాంటి స్పిన్నర్ ఇండియన్ టీమ్ లో మరెవరు కనిపించడం లేదు. కాబట్టి ఆయన రిటైర్ మెంట్ ప్రకటించడం పట్ల యావత్ ఇండియన్ క్రికెట్ అభిమానులందరూ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక ఏది ఏమైనా కూడా ఆయన కూడా తనకు ఏజ్ అయిపోయిందనే ఉద్దేశ్యం తోనే కొత్త వాళ్ళకి అవకాశాలను ఇవ్వాలని అనుకొని రిటర్మెంట్ ప్రకటించానట్టుగా తెలుస్తోంది…
ఇక ఇండియన్ క్రికెట్ టీం మొత్తం అతనికి ఘనంగా వీడ్కోలు పలుకుతుంది. ఇక ఏది ఏమైనా కూడా అశ్విన్ లాంటి దిగ్గజ స్పిన్నర్ ఇండియన్ టీమ్ కి మరొకరు దొరకడం అనేది చాలా కష్టంతో కూడుకున్న పనే.. ఇక ఇది ఇలా ఉంటే ఆస్ట్రేలియా తో మూడో మ్యాచ్ జరుగుతున్న సమయంలోనే డ్రెస్సింగ్ రూమ్ లో కోహ్లీ కి ముందుగానే తన రిటర్మెంట్ ప్రకటిస్తున్న విషయాన్ని చెప్పిన అశ్విన్ ఎమోషనల్ అయిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది…