Rashmika : ఇండస్ట్రీ లోకి వచ్చిన అతి కొద్దిరోజుల్లోనే స్టార్ హీరోయిన్స్ లో ఒకరిగా నిల్చిన హీరోయిన్ రష్మిక మందన. కన్నడ సినీ పరిశ్రమలో రెండు మూడు సినిమాలు చేసిన ఈమె నాగ శౌర్య హీరో గా నటించిన ‘ఛలో’ అనే చిత్రం ద్వారా మన టాలీవుడ్ ఆడియన్స్ కి పరిచయమైంది. ఈ సినిమా భారీ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో రష్మిక కి మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. వరుసగా స్టార్ హీరోల సరసన నటించే ఛాన్స్ దక్కింది. అవి సూపర్ హిట్స్ గా నిలవడం కూడా ఈమె అదృష్టం. ఇక ‘పుష్ప’ చిత్రం తో భారీ బ్లాక్ బస్టర్ ని అందుకొని పాన్ ఇండియా లెవెల్ లో క్రేజ్ ని సొంతం చేసుకున్న ఈ హాట్ బ్యూటీ, బాలీవుడ్ లో ‘ఎనిమల్’ చిత్రంతో మరో భారీ బ్లాక్ బస్టర్ ని అందుకొని పాన్ ఇండియన్ స్టార్ హీరోయిన్ గా మారిపోయింది.
ఇప్పుడు రీసెంట్ గా ‘పుష్ప 2’ తో మరోసారి ఆమె పాన్ ఇండియన్ బ్లాక్ బస్టర్ ని తన ఖాతాలో వేసుకుంది. ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గా ఆమె ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో తన కాబోయే భర్త గురించి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. ఆమె మాట్లాడుతూ ‘నా కాబోయే భర్త నా ప్రతీ దశలోనూ నాకు తోడుగా ఉంటూ నాతో పాటు నడవాలి. కష్టసమయం లో నన్ను, నా మనసుని అర్థం చేసుకొని నాకు స్ట్రాంగ్ పిల్లర్ లాగా నిలబడాలి. నాకు అత్యంత గౌరవం ఇస్తూ, నా పై ప్రత్యేకమైన శ్రద్ద చూపించాలి. ఒక వయస్సు వచ్చిన తర్వాత కచ్చితంగా తోడు కావాలని అనిపిస్తుంది. నిజమైన ప్రేమ ఉన్నప్పుడు మాత్రమే ఆ తోడు దొరుకుతుంది. అలాంటి నిజమైన ప్రేమని పంచే వ్యక్తి నా జీవితంలోకి రావాలి’ అంటూ ఆమె చెప్పుకొచ్చింది.
ఇదంతా ఈమె ఇప్పుడు ఎందుకు చెప్తుంది. ఇప్పటికే ఆమె విజయ్ దేవరకొండ ని తన జీవిత భాగస్వామి గా ఎంచుకుంది కదా, మళ్ళీ ఈ ముసుగులో గుద్దులాట ఎందుకు అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. చాలా కాలం నుండి ఈమె విజయ్ దేవరకొండ తో డేటింగ్ చేస్తుంది. ప్రస్తుతం హైదరాబాద్ లో అతని ఇంట్లోనే ఉంటుంది. వీళ్లిద్దరు కలిసి జిమ్ కి వెళ్లడం, షాపింగ్ కి వెళ్లడం, ప్రైవేట్ ఫంక్షన్స్ కలిసి పాల్గొనడం వంటివి మనం సోషల్ మీడియా లో ఎన్నో సందర్భాల్లో చూసాము. అంతెందుకు రీసెంట్ గా ఈమె పుష్ప సినిమా చూసేందుకు విజయ్ దేవర కొండ కుటుంబం తోనే థియేటర్ కి వచ్చింది. దానికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు కూడా సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఇలా వీళ్ళ సంగతి ఓపెన్ గా అందరికీ తెలిసిపోయినప్పుడు ఇంకా ఇలా దాచడం ఎందుకు అని అభిమానులు అంటున్నారు.