Euro Football Cup 2024: సెమీ ఫైనల్ లో సంచలనం.. ఫిఫా రన్నరప్ ఫ్రాన్స్ ను చిత్తు చేసిన స్పెయిన్.. దర్జాగా ఫైనల్ లోకి..

మ్యాచ్ ప్రారంభమైన నాలుగో నిమిషానికి ఫ్రాన్స్ గోల్ సాధించింది. ఆ తర్వాత మరో పావుగంటకు స్పెయిన్ ఆటగాడు డానీ ఒల్మో గోల్ సాధించాడు. దీంతో రెండు జట్లు సమాన గోల్స్ సాధించాయి. ఈ క్రమంలో రెండు జట్ల ఆటగాళ్లు నువ్వా నేనా అన్నట్టుగా మైదానంలో పరుగులు తీశారు. దీంతో మ్యాచ్ డ్రా అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ ఫ్రాన్స్ పెనాల్టీ బాక్స్ వెలుపల బంతిని అందుకున్న తర్వాత డాని ఒల్మో అద్భుతమైన కర్లింగ్ తో గోల్ చేశాడు.

Written By: Anabothula Bhaskar, Updated On : July 10, 2024 9:39 am

Euro Football Cup 2024:

Follow us on

Euro Football Cup 2024: జర్మనీ వేదికగా జరుగుతున్న యూరో కప్ ఫుట్ బాల్ టోర్నీలో… భారత కాలమానం ప్రకారం మంగళవారం అర్ధరాత్రి తర్వాత జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్ లో ఫ్రాన్స్ – స్పెయిన్ తలపడ్డాయి. నువ్వా నేనా అన్నట్టుగా సాగిన ఈ మ్యాచ్లో స్పెయిన్ 2-1 తేడాతో విజయం సాధించింది. దర్జాగా ఫైనల్ లోకి వెళ్ళింది. స్పెయిన్ ఆటగాడు లామిన్ యమల్ అద్భుతమైన గోల్ సాధించి.. తన జట్టును గెలిపించాడు. అంతకుముందు డానీ ఒల్మో గోల్ చేశాడు. ఫలితంగా ఫ్రాన్స్, స్పెయిన్ స్కోర్లు 1-1 తో సమంగా నిలిచాయి.

మ్యాచ్ ప్రారంభమైన నాలుగో నిమిషానికి ఫ్రాన్స్ గోల్ సాధించింది. ఆ తర్వాత మరో పావుగంటకు స్పెయిన్ ఆటగాడు డానీ ఒల్మో గోల్ సాధించాడు. దీంతో రెండు జట్లు సమాన గోల్స్ సాధించాయి. ఈ క్రమంలో రెండు జట్ల ఆటగాళ్లు నువ్వా నేనా అన్నట్టుగా మైదానంలో పరుగులు తీశారు. దీంతో మ్యాచ్ డ్రా అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ ఫ్రాన్స్ పెనాల్టీ బాక్స్ వెలుపల బంతిని అందుకున్న తర్వాత డాని ఒల్మో అద్భుతమైన కర్లింగ్ తో గోల్ చేశాడు. దీంతో యూరో కప్ చరిత్రలో అత్యంత తిన్న వయస్కుడైన గోల్ స్కోరర్ గా నిలిచాడు. అంతకుముందు జర్మనీతో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో స్పెయిన్ గోల్ చేసేందుకు డానీ ఓల్మో సహకరించాడు. సెమీ ఫైనల్ మ్యాచ్ లో ఎం. బాపే వంటి ఆటగాళ్లు ఉన్నప్పటికీ ఫ్రాన్స్ మరో గోల్ సాధించలేకపోయింది. దీంతో స్పెయిన్ 2-1 తేడాతో విజయం సాధించింది. దర్జాగా ఫైనల్ దూసుకెళ్లింది.

ఫ్రాన్స్ ఓడిపోవడంతో ఎం బాపే కన్నీటి పర్యంతమయ్యాడు. 2022లో ఖతార్లో జరిగిన సాకర్ ఫైనల్ అర్జెంటీనా చేతిలో ఫ్రాన్స్ జట్టు ఓడిపోవడంతో అతడు తీవ్ర వేదనకు గురయ్యాడు.. ఎం బాపే ను సహచర ఆటగాళ్లు ఓదార్చారు. ఓటమి ద్వారా ఫ్రాన్స్ అభిమానులు గుండె పగిలింది అంటూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. ఇదే సమయంలో మ్యాచ్ ఆసాంతం తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించిన స్పెయిన్ జట్టు అభిమానుల మనసులను చూరుగొన్నది. స్పెయిన్ ఫైనల్ వెళ్లడంతో.. ఆ జట్టు అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇదే సమయంలో యూరో కప్ లో అత్యంత పిన్నవయస్కుడైన గోల్ స్కోరర్ గా నిలిచిన ఓల్మోను తమ హీరోగా స్పెయిన్ అభిమానులు అభివర్ణిస్తున్నారు.

మ్యాచ్లో కీలక క్షణాలు ఇవి

మ్యాచ్ ప్రారంభమైన నాలుగవ నిమిషంలో ఫ్రాన్స్ గోల్ కొట్టింది. లెస్ బ్ల్యూస్ అద్భుతమైన కిక్ షాట్ కు బంతి గోల్ పోస్ట్ వైపు పరుగులు తీసింది.

ఆట ఐదవ నిమిషంలో ఫాబియాన్ రూయిజ్ యమల్ క్రాస్ ఓవర్ ను బార్ చేశాడు. దీంతో ఒక్కసారిగా మైదానంలో నిశ్శబ్దం ఆవరించింది.

ఆట 25 నిమిషంలో స్పెయిన్ ఆటగాడు యమల్ అద్భుతమైన స్ట్రైక్ తో గోల్ చేశాడు. దీంతో ఫ్రాన్స్ – స్పెయిన్ 1-1 తో సమానంగా నిలిచాయి.

ఆట 48 నిమిషంలో ఓల్మో గోల్ సాధించి స్పెయిన్ 2-1 తో లీడ్ లో ఉంచాడు. ఇదే దశలో స్పెయిన్ ఆటగాళ్లు ఫ్రాన్స్ జట్టుకు మరో గోల్ చేసే అవకాశాన్ని ఇవ్వలేదు.

ఆట 76వ నిమిషంలో ఫ్రాన్స్ ఆటగాళ్లు గోల్ చేసేందుకు బార్ పైకి దూసుకుపోగా.. స్పెయిన్ ఆటగాళ్లు అడ్డుకున్నారు.