https://oktelugu.com/

India Vs Zimbabwe: రెండవ టి20 లోనే అభిషేక్ సెంచరీ.. ఇతడేమో ఆరు ఇన్నింగ్స్ లు ఆడినా ఒక్క అర్థ శతకం లేదు.. ఈ ఆటగాడు జట్టుకు అవసరమా?

టి20 వరల్డ్ కప్ విజయం తర్వాత టీమిండియా సీనియర్ జట్టుకు బీసీసీఐ పూర్తిగా విశ్రాంతి ఇచ్చింది. 2026 t20 వరల్డ్ కప్ లక్ష్యంగా.. యువ ఆటగాళ్లు ప్రతిభ నిరూపించుకునేందుకు జింబాబ్వే టూర్ కు పంపించింది. ఈ యువ జట్టుకు గిల్ నాయకత్వం వహిస్తున్నాడు. ఈ పర్యటనను భారత జట్టు ఘోర ఓటమితో ప్రారంభించింది. ఆ తర్వాత మ్యాచ్ లో భారత జట్టు అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఫలితంగా ఐదు మ్యాచ్ ల సిరీస్ ను 1-1 తో సమానంగా నిలిచింది.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : July 10, 2024 / 09:53 AM IST

    India Vs Zimbabwe

    Follow us on

    India Vs Zimbabwe: జింబాబ్వే లో భారత యువ జట్టు పర్యటిస్తోంది. 5 t20 ల సిరీస్ ఆడుతోంది. మొదటి మ్యాచ్లో ఓడిపోయినప్పటికీ.. రెండో మ్యాచ్లో భారీ విజయం సాధించింది. 100 పరుగుల తేడాతో ఆతిధ్య జింబాబ్వేను మట్టికరిపించింది. ఇదే క్రమంలో ఓపెనర్ అభిషేక్ శర్మ 47 బంతుల్లో సెంచరీ సాధించి ఆకట్టుకున్నాడు. దీంతో సెలెక్టర్లు అతడి స్థానాన్ని జట్టులో మరింత స్థిరం చేసే దిశగా ఆలోచనలు చేస్తున్నారు. మిగతా మూడు మ్యాచ్లలో అతడు ఇదే స్థాయిలో రాణిస్తే.. అతడి స్థానానికి ఇక తిరుగు ఉండదు. కానీ ఇదే దశలో ఒక కీలక ఆటగాడు వరుసగా విఫలమవుతుండడం టీమిండియా సెలెక్టర్లను నివ్వెర పరుస్తోంది.

    టి20 వరల్డ్ కప్ విజయం తర్వాత టీమిండియా సీనియర్ జట్టుకు బీసీసీఐ పూర్తిగా విశ్రాంతి ఇచ్చింది. 2026 t20 వరల్డ్ కప్ లక్ష్యంగా.. యువ ఆటగాళ్లు ప్రతిభ నిరూపించుకునేందుకు జింబాబ్వే టూర్ కు పంపించింది. ఈ యువ జట్టుకు గిల్ నాయకత్వం వహిస్తున్నాడు. ఈ పర్యటనను భారత జట్టు ఘోర ఓటమితో ప్రారంభించింది. ఆ తర్వాత మ్యాచ్ లో భారత జట్టు అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఫలితంగా ఐదు మ్యాచ్ ల సిరీస్ ను 1-1 తో సమానంగా నిలిచింది.

    వాస్తవానికి రెండవ టి20 మ్యాచ్లో టీమిండియా అద్భుతంగా బ్యాటింగ్ చేసింది. బౌలర్లు కూడా సూపర్ గా బౌలింగ్ చేశారు. అన్ని బాగున్నాయి అనుకుంటున్నప్పటికీ.. ఒక్క విషయంలో మాత్రం టీమిండియా తీవ్రంగా ఇబ్బంది పడుతోంది.. కెప్టెన్ గిల్ పేలవమైన ఫామ్ జట్టును అయోమయానికి గురి చేస్తోంది..గిల్ గత పది టి20 ఇన్నింగ్స్ లలో కేవలం ఒకే ఒక అర్థ సెంచరీ చేశాడు. తనకు తానే టి20 కెరియర్ ను డోలాయమనంలో పడేసుకున్నాడు. గత ఆరు ఇన్నింగ్స్ లలో గిల్ ఒక అర్థ సెంచరీ కూడా సాధించలేకపోయాడు. ఇంతటి నిరాశ జనకమైన ఫామ్ వల్లే గిల్ టి20 వరల్డ్ కప్ లో 15 మంది ఆటగాళ్ల స్క్వాడ్ లో స్థానం సంపాదించుకోలేకపోయాడు. జింబాబ్వే టూర్ ద్వారా తనను తాను నిరూపించుకుంటాడని బీసీసీఐ సెలెక్టర్లు అంచనా వేశారు. అయితే అతడు వారి అంచనాలకు తగ్గట్టుగా రాణించలేకపోతున్నాడు.. గిల్ కనుక ఇదే స్థాయిలో ఆడితే మాత్రం భవిష్యత్తులో అతడికి టి20 జట్టులో చోటు ఉండదని, క్రమంగా అతడు కనుమరుగవడం ఖాయమని క్రీడా విశేషకులు అంటున్నారు. టీమిండియా ఆడే తదుపరి మ్యాచ్లలో గిల్ రాణించకపోతే టీ 20 జట్టు నుంచి శాశ్వతంగా తప్పిస్తారని ప్రచారం జరుగుతోంది. “గిల్ సరిగ్గా ఆడటం లేదు. తొలి మ్యాచ్లో జింబాబ్వే చేతిలో భారత్ ఓడిపోయింది. గిల్ సారథ్యం ఆశించనంత ఫలితాలు ఇవ్వడం లేదు. అతని ఆట కూడా ఏమంత గొప్పగా లేదు. ఇలాంటి ఆటగాడు జట్టుకు అవసరమా” అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి.

    టి20 వరల్డ్ కప్ విజయం తర్వాత రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా పొట్టి ఫార్మాట్ కు గుడ్ బై చెప్పేశారు. ఈ నేపథ్యంలో ఓపెనింగ్ స్థానం కోసం చాలామంది యువ ఆటగాళ్లు ముందు వరుసలో ఉన్నారు. రెండవ టి20 మ్యాచ్ లో అభిషేక్ శర్మ సూపర్ సెంచరీ సాధించాడు. ఫలితంగా అతడు గిల్ కు పోటీగా వచ్చేసాడు. యశస్వి జైస్వాల్, రుతు రాజ్ గైక్వాడ్ కూడా ధాటిగా ఆడుతూ ఓపెనింగ్ రేసులో ఉన్నారు. అయితే వీరందరి నుంచి వస్తున్న పోటీని తట్టుకోవాలంటే కచ్చితంగా గిల్ తన పూర్వపు ఫామ్ అందుకోవాలి.

    గత పది టి20 ఇన్నింగ్స్ లలో గిల్ చేసిన పరుగులు ఇవి..

    జింబాబ్వే తో మొదటి టీ20 లో 31 పరుగులు, రెండవ టి20లో రెండు పరుగులు, ఆఫ్ఘనిస్తాన్ తో తొలి t20 మ్యాచ్లో 23 పరుగులు, సౌత్ ఆఫ్రికాతో మూడో టి20 మ్యాచ్లో 12 పరుగులు, రెండవ టి20 మ్యాచ్లో గోల్డెన్ డక్, వెస్టిండీస్ జట్టుతో తొలి టి20లో మూడు పరుగులు, రెండవ టి20 లో ఏడు పరుగులు, మూడవ టి20 లో ఆరు పరుగులు, నాల్గవ టి20 లో 77 పరుగులు, ఐదో టి20 లో 9 పరుగులు చేశాడు.