Homeక్రీడలుక్రికెట్‌South Africa vs New Zealand T20 Match Highlights: సౌత్ ఆఫ్రికా వర్సెస్ న్యూజిలాండ్;...

South Africa vs New Zealand T20 Match Highlights: సౌత్ ఆఫ్రికా వర్సెస్ న్యూజిలాండ్; సౌత్ ఆఫ్రికా వర్సెస్ న్యూజిలాండ్ : సెమీస్ లో వాళ్లు కొట్టారు.. బయట వీళ్లు ఇచ్చి పడేశారు

South Africa vs New Zealand T20 Match Highlights: లెక్క సరిపోయింది. దారుణమైన ఓటమికి బదులు తీరిపోయింది. హోరాహోరీ కాదు..పూర్తి ఏకపక్షంగా సాగింది.. సౌతాఫ్రికా బౌలింగ్ అలా ఉంది మరి.. నిప్పులు చెరిగే బంతులు వేసిన సౌతాఫ్రికా బౌలర్లు న్యూజిలాండ్ ప్లేయర్లకు చుక్కలు చూపించారు. ఏమాత్రం కోలుకోకుండా అదరగొట్టారు. ఫలితంగా న్యూజిలాండ్ అత్యల్ప స్కోరుకు పరిమితం కావాల్సి వచ్చింది. అంతే కాదు, ఏడు వికెట్ల తేడాతో దారుణమైన ఓటమిని మూటకట్టుకోవాల్సి వచ్చింది.

Also Read: నార్త్ లో అల్లు అర్జున్ మేనియా నడుస్తుందా..? ఆ బాలీవుడ్ స్టార్ నేను నీ సినిమాలో చేస్తాను బన్నీ అని అడిగాడా..?

ఐదు టీ20 మ్యాచ్ సిరీస్ లో భాగంగా న్యూజిలాండ్ సౌతాఫ్రికాలో ఫర్యటిస్తోంది. ఇందులో భాగంగా మౌంట్ మాగనూయి లో ఆదివారం తొలి టీ20 మ్యాచ్ నిర్వహించారు. ఈమ్యాచ్ లో ముందుగా న్యూజిలాండ్ బ్యాటింగ్ చేసింది. సౌతాఫ్రికా బౌలర్ల దూకుడు ముందు తల వంచింది. ఓపెన్లర్లు కాన్వే(1), టామ్ లాథమ్(7), టిమ్ రాబిన్ సన్(6), నిక్ కేలీ(2), జాకబ్స్(10), సాంట్నర్(15) ఇలాటాప్ ప్లేయర్లు దారుణంగా విఫలమయ్యారు.

నీషం(26) టాప్ స్కోరర్ గా నిలిచాడు,చివర్లో మెక్ కోన్హీ(15)మెరుపులు మెరిపించడంతో కివీస్ ఆమాత్రమైనా స్కోర్ చేయగలిగింది. సౌతాఫ్రికా బౌలర్లలో మోకీనా మూడు, కోయేట్జీ, బార్ట్ మన్, కేశవ్ మహారాజ్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. రెండు పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది న్యూజిలాండ్.. ఇక ఏ దశలో కూడా కోలుకోలేకపోయింది. 14 పరుగుల వద్ద రెండు, 20 పరుగులవద్దమూడు, 21 పరుగుల వద్ద నాలుగు, 36 పరుగుల వద్ద ఐదు, 54 పరుగుల వద్దఆరు, 80 పరుగులవద్ద ఏడు, 83 పరుగుల వద్ద 8, 86 పరుగుల వద్ధ 9, 91 పరుగుల వద్ద పదో వికెట్ కోల్పోయింది.

అనంతరం ఛేజింగ్ మొదలు పెట్టిన సౌతాఫ్రికా16.4 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. సౌతాఫ్రికా ఓపెనర్ టోనీ డీ జోర్జీ (2) విఫలమైనప్పటికీ మరో ఓపెనర్ కన్నోర్ ఏస్తెర్ హుజెన్(45) ఆకట్టుకున్నాడు. ఇతడికి జాసోన్ స్మిత్(10), డియాన్ ఫోరెస్టర్ (16)సహకరించారు. న్యూజిలాండ్ బౌలర్లలోజాకరీ ఫోక్స్ , జెమీసన్, సాంట్నర్ తలా ఒక వికెట్ సాధించారు.

టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్ మ్యాచ్ లో సౌతాఫ్రికాను న్యూజిలాండ్ ఓడించింది. ఫైనల్ టీమిండియా చేతిలో కివీస్ ఓటమిపాలైంది. న్యూజిలాండ్ ను ఓడించడం ద్వారా టీ20 వరల్డ్ కప్ లో సెమీఫైనల్ ఓటమికి సౌతాఫ్రికా బదులు తీర్చుకున్నట్టయింది. రెండు జట్లలో కూడా సమర్థవంతమైన ప్లేయర్లు లేరు. ద్వితీయ శ్రేణి ప్లేయర్లతోనే రెండు జట్లూ రంగంలోకి దిగాయి.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

AI Impact On Education: ఏఐతో మూలాలే మటాష్.. పరిస్థితి ఎంతకు దిగజారిందంటే..

AI Impact On Education: ఏఐ తో ఇప్పటివరకు కేవలం ఐటీ ఉద్యోగాలు మాత్రమే పోయాయని అనుకున్నాం. ఎంట్రీ లెవెల్.. మిడ్ లెవెల్ ఉద్యోగాలు మాత్రమే మటాష్ అయిపోయాయని మీడియా వార్తల్లో...

Rahul Gandhi Injury: రాహుల్ రక్తం కళ్ళ చూశారు.. మోడీకి ఇది మైనస్సే

Rahul Gandhi Injury: మల్లికార్జున కార్గే నిన్న తన పుట్టినరోజు జరుపుకున్నారు.. ఆయనకు శుభాకాంక్షలు తెలియజేయడానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు వెళ్లారు.. పోలీసులు కూడా వారి కేవలం శుభాకాంక్షలు తెలియజేయడానికి మాత్రమే వెళ్తున్నారని...

Ishan Kishan: ఐపీఎల్ లో పరుగుల వరద పారించాడు.. జాతీయ జట్టులో తేలిపోతున్నాడు.. ఇలా అయితే కష్టమే..

Ishan Kishan: అప్పట్లో దూకుడుగా బ్యాటింగ్ చేసేవాడు. వన్డేలో అతడికి డబుల్ సెంచరీ కూడా ఉంది. ఈ స్థాయిలో ఆడిన అతడు స్థిరత్వాన్ని కొనసాగించలేకపోయాడు. దీనికి తోడు క్రమశిక్షణలోపించడంతో జట్టులో స్థానం...

Vijayendra Prasad: రాజమౌళి కి నచ్చినట్టుగా కథ రాయడం చాలా కష్టం అంటున్న విజయేంద్రప్రసాద్… ఆయన అడిగేవి ఇవే…

Vijayendra Prasad: తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకుడిగా తన కెరియర్ ను మొదలుపెట్టిన రాజమౌళి ఆ తర్వాత పాన్ ఇండియా పరిధిని టచ్ చేస్తూ ప్రేక్షకులోకాన్ని అలరిస్తున్నాడు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులందరిని...

Mahesh Babu: మహేష్ బాబు కి నచ్చినట్టుగా సినిమాను తీయలేకపోయిన దర్శకులు వీళ్లే…

Mahesh Babu: సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా మారిపోయాడు. తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ యావత్...
Oktelugu Epaper
Exit mobile version