Barbarik Director: ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో చిన్న సినిమాల పరిస్థితి దారుణంగా తయారైంది. థియేటర్ కి ప్రేక్షకుడు వెళ్లి సినిమాను చూసే ప్రసక్తి అయితే లేదు… పెద్ద సినిమాలకు అంతో ఇంతో జనం థియేటర్ కి వచ్చి సినిమాలు చూస్తున్నారు. కానీ చిన్న సినిమాలను మాత్రం ఓటిటి లోనే చూసి ఎంజాయ్ చేస్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే ‘త్రిబాణాదారి భార్బరిక్’ అనే సినిమా రీసెంట్ గా రిలీజ్ అయింది. మరి ఈ సినిమా దర్శకుడు సినిమా బాగున్నప్పటికి థియేటర్లో ప్రేక్షకులు మాత్రం ఎవరూ లేరని తమ సినిమాని ఆదరించడానికి ఎవరు ముందుకు రావడం లేదని ప్రేక్షకులు ఎందుకని ఇలా సినిమాలను నెగ్లెక్ట్ చేస్తున్నారు. మంచి సినిమాలు వచ్చినప్పుడు చూడొచ్చు కదా అంటూ ఆయన ఆవేదనను వ్యక్తం చేసి తన చెప్పుతో తనే కొట్టుకున్నాడు. గత రెండు రోజుల నుంచి ఈ న్యూస్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఇక ఆయన పడుతున్న బాధను చూసి చాలామంది సినిమాని చూడడానికి థియేటర్ కైతే వెళ్లారు. ముఖ్యంగా సినిమాలు చూసిన తర్వాత కొంతమంది వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.
సినిమా అనుకున్న రేంజ్ లో లేదని అందువల్లే థియేటర్ కి ప్రేక్షకులు రావడం లేదని ప్రేక్షకులను నిందించాల్సిన అవసరం లేదంటూ వాళ్ళ అభిప్రాయాలు తెలియజేస్తున్నారు… ఇక సినిమా అంతంతమాత్రంగా ఉందనే ఉద్దేశ్యంతోనే దర్శకుడు ఇలాంటి ఒక స్ట్రాటజీని మైంటైన్ చేశాడని ఇలా చేస్తే అయిన ప్రేక్షకులు కనీసం థియేటర్ కి వెళ్లి తమ సినిమాను చూస్తారని ఒక జిమ్మిక్కు అయితే చేశారంటూ మరి కొంతమంది కామెంట్లు చేస్తున్నారు…
ఇక ఇదంతా చూసిన ఇంకొంతమంది మాత్రం సినిమా కోసం ఒక దర్శకుడు చెప్పుతో కొట్టుకునే పరిస్థితి రావడం అనేది నిజంగా బాధాకరం. ఆ సినిమా ఎలా ఉన్నా కూడా తను అలా చేయడం అనేది కరెక్ట్ కాదు అంటూ దర్శకుడుని నిందిస్తున్నారు.
మరి మొత్తానికైతే దర్శకుడు మాత్రం ఈ సినిమా ఎఫెక్టివ్ గా లేదనే ఉద్దేశ్యంతోనే థియేటర్ కి వెళ్లి ప్రేక్షకులు చూడాలనే ఒక సింపతిని ప్లే చేశాడు అంటూ మరికొంతమంది చెబుతున్నారు. ఇక సోషల్ మీడియా జనాలు మాత్రం దర్శకుడిని టార్గెట్ చేసి మొత్తానికైతే భలే ట్రిక్కును ప్లే చేశావయ్యా అంటూ అతని మీద కామెంట్లు అయితే చేస్తున్నారు…