Smriti Mandhana : మహిళల క్రికెట్లో జెమిమా రోడ్రిగ్స్, స్మృతి మందాన మధ్య మంచి స్నేహం ఉంది. వీరిద్దరూ మైదానంలో చాలా చాలా హ్యాపీగా ఉంటారు. మైదానం వెలుపల కూడా అదే స్థాయిలో ఉత్సాహాన్ని ప్రదర్శిస్తుంటారు. కష్టసుఖాల్లో కూడా తోడుంటారు. ఇటీవల స్మృతి వివాహం రద్దయినప్పుడు.. జెమీమా ఆమెకు అండగా నిలిచింది. చివరికి బిగ్ బాష్ లీగ్ లో ఆడే అవకాశం వచ్చినప్పటికీ కూడా.. తప్పుకుంది.
బెంగళూరు జట్టుకు స్మృతి, ఢిల్లీ జట్టుకు జెమిమా నాయకత్వం వహిస్తున్నారు. స్మృతి 2024 లో బెంగళూరు జట్టుకు తొలి కప్ అందించింది. 2026 సీజన్లో మాత్రం అంతకుమించి అనే స్థాయిలో అదరగొట్టింది. ఆమె ఏకంగా తొమ్మిది మ్యాచ్లలో 53.85 సగటుతో 377 పరుగులు చేసింది. ఇందులో మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఢిల్లీ జట్టు అంటే స్మృతికి ఎందుకింత కోపం అనేది బెంగళూరు అభిమానులకు ఇప్పటికి తెలియదు. లీగ్ దశలో ఢిల్లీ జట్టుపై 96, 38 పరుగులు చేసింది స్మృతి.. ఫైనల్ గా అయితే 87 పరుగులతో అదరగొట్టింది.
ఫైనల్ మ్యాచ్ లో భారీ స్కోర్ అంటే ఏ జట్టైనా సరే తలకిందులు అయిపోతుంది. అయితే 2024లో బెంగళూరు జట్టుకు ట్రోఫీ అందించిన స్మృతి.. ఈ సీజన్లో ఇంకా అంతకుమించి అనే స్థాయిలో ఆడింది. జట్టుకు రెండోసారి ట్రోఫీ అందించింది. 200 ప్లస్ టార్గెట్ ఉన్నప్పటికీ.. స్మృతి అదిరిపోయే స్థాయిలో ఆట తీరు ప్రదర్శించింది. గ్రేస్ హరీస్(237), రిచా ఘోష్(189) స్థిరంగా ఆడారు. తద్వారా బెంగళూరు జట్టును ఫైనల్ దాకా తీసుకెళ్లారు.
ఢిల్లీ జట్టు మీద స్మృతి కి తిరుగులేని స్థాయిలో రికార్డులు ఉన్నాయి. ఈ సీజన్లో కూడా ఆమె అదే స్థాయిలో ఆట తీరు ప్రదర్శించింది. లీగ్ దశ నుంచి మొదలు పెడితే ఫైనల్ దాకా జోరు కొనసాగించింది. అందువల్లే బెంగళూరు జట్టు మరోసారి విజేతగా ఆవిర్భవించింది. బెంగళూరు జట్టు విజయం సాధించిన తర్వాత స్మృతి మీద ఆ జట్టు అభిమానులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. 2024 లో విజేతను చేసిందని.. 2026 లో కూడా ఛాంపియన్ గా నిలిపిందని.. బెంగళూరు జట్టుకు లభించిన అదృష్టమని కన్నడ అభిమానులు సోషల్ మీడియాలో పేర్కొంటున్నారు.