Fauji Movie: సంక్రాంతి కానుకగా ప్రభాస్ హీరోగా నటించిన రాజాసాబ్ సినిమా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ప్రభాస్ ఫ్యాన్స్ అంతా సంబరాలు చేసుకుంటున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే ప్రభాస్ హను రాఘవపూడి దర్శకత్వంలో నటించిన ఫౌజీ సినిమా షూటింగ్ ను కంప్లీట్ చేశాడు. ఇక ఈ సినిమా నుంచి ఇప్పటివరకు ఒక్క అప్డేట్ కూడా రాలేదు… ప్రభాస్ లుక్కు ను సైతం రివీల్ చేయలేదు. కారణం ఏదైనా కూడా హను రాఘవపూడి ఎందుకని ఈ సినిమా మీద సస్పెన్స్ ను మెయింటైన్ చేస్తూ వస్తున్నాడు. ప్రభాస్ లుక్ ని రిలీజ్ చేస్తే బాగుండేది కదా అని ప్రతి ఒక్కరు వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. కానీ హను రాఘవపూడి మాత్రం తన ప్రణాళికలో తను ఉన్నట్టుగా తెలుస్తోంది.
ఈ సినిమాకు సంబంధించిన గింప్స్ ని ఒకేసారి రిలీజ్ చేయాలని దాంతో ఫస్ట్ లుక్ పోస్టర్ ను సైతం ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నాడు. ఇక ఈ సినిమా ఎలా ఉండబోతోంది అనేది చెప్పడానికి ఈ సినిమా థీమ్ ను పరిచయం చేస్తూ గ్లింప్స్ లో డైలాగులతో ప్రభాస్ లుక్ ని సైతం చాలా స్టైలిష్ గా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నారట.
ఈ సినిమాలో ప్రభాస్ ఆర్మీ ఆఫీసర్ గా కనిపిస్తున్నాడు. ఇక ఆర్మీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఒక క్యూట్ లవ్ స్టోరీ కూడా ఉంటుందని హను రాఘవపూడి గతంలో తెలియజేశాడు. ఇక ఇంతకుముందు ఆయన చేసిన ‘సీతా రామం’ సినిమా సైతం ఆర్మీ బ్యాక్ డ్రాప్ తెరకెక్కింది. అలాగే ఒక గొప్ప లవ్ స్టోరీ గా ప్రేక్షకుల నుంచి ప్రశంసలను అందుకుంది. ఇక హను రాఘవపూడి లవ్ స్టోరీ లను చాలా బాగా తెరకెక్కిస్తాడనే విషయం మనందరికి తెలిసిందే. అలాంటి వ్యక్తి నుంచి మరో లవ్ స్టోరీ ఎలా రాబోతోంది.
ప్రభాస్ లవర్ బాయ్ గా ఆర్మీ ఆఫీసర్ గా ప్రేక్షకులను మెప్పిస్తాడా? లేదా అనే అనుమానాలు సైతం సగటు ప్రేక్షకుడిలో కలుగుతున్నాయి. మరి వాటిని చెక్ పెడుతూ ఈ సినిమా నుంచి గ్లింప్స్ రిలీజ్ అయితే గాని వీటన్నిటికి ఓ క్లారిటీ అయితే రాదు. మహా శివరాత్రి కానుకగా ఈ సినిమా నుంచి ఒక గ్లింప్స్ రిలీజ్ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది…